కొండ నుంచి కడలి దాకా

సేకరణ: పరుచూరి శ్రీనివాస్

గోదావరి నదిపై “కొండ నుంచి కడలి దాకా” అన్న ఈ బాలల సంగీత రూపకానికి ఒక ప్రత్యేకత ఉంది. జేజి మామయ్య గా పిల్లలకు చిరపరిచితమైన శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు బాపిరాజు, శ్రీనాధుడు, విశ్వనాథ కవుల కవితల్ని ఒకే రూపకంలో స్వర పర్చటం ఒకటి. టోక్యోలో జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1972 లో జరిగిన అంతర్జాతీయ రేడియో పోటీలలో బహుమతి పొందటం ఇంకో ప్రత్యేకత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆకాశవాణి అరుదైన రూపకాల్లో ఇది ఒకటి.

నిడివి: ~ 30 ని.