చిన్నోడికి రోజూ ఓ కథ కావాలి. పెద్దోడికీ ఆసక్తేగానీ అడుగుతాడు, వదిలేస్తాడు; వీడంత మంకుపట్టు పట్టడు. తెనాలి రామకృష్ణ కథలు, ఈసప్‌ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు, మర్యాద రామన్న కథలు, ఇట్లాంటివేవో నాకు గుర్తొచ్చినవి చెప్తుంటాను. ఒకరోజు, ఎంత గింజుకున్నా ఏ కథా గుర్తు రాక, ఏదో మేనేజ్‌ చేయొచ్చని డోరియన్‌ గ్రే మొదలుపెట్టాను.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది.

సంక్రాంతికి బయట నాలుక్కూడలిలో
మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా?
ఆ మంచు కురిసిన పొద్దున్న మంట దగ్గిర
నీ చేయి పట్టుకుని చలి కాచుకుంటూంటే
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ

వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ బోస్ డికె’ అనడమే కద్దు.

కొన్ని మోహాల్లోనో దాహాల్లోనో
నీకై నీవే చిక్కుకున్నప్పుడు
తప్పదు
చెదరిన
గడ్డిపరకల గూటినే
మమకారంగా వెతుక్కునే పిట్టలా
ఈ వేదననిలా భరించాల్సిందే

నిజానికి, ‘నీ రచన చాలా గొప్పగా ఉంది’ అని వచ్చే విమర్శ వల్ల (నిజంగానే ప్రతికూల విమర్శకు అందని రచనైనా సరే) రచయితకు తాత్కాలికానందం తప్ప వేరే ఏ ఉపయోగమూ ఉండదు. రచయితలు అదే కావాలనుకుంటే భజన సంఘాలనేర్పరచుకోవడం తేలికే! (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)

నేను మాదేవి ఇద్దరం గల్సి బువ్వమ్మవ్వ దగ్గర్కి పోతిమి. చల్ల కాలం కదా, స్కూల్ గోడ నీడ బలే సల్లగుంటది. గోడానాంకుని బువ్వమ్మవ్వ సిన్న చక్క పెట్టెలో వక్కో అరలో బటానీలు, రేక్కాయిలు, బుడ్డలు, పత్తి పండ్లు పెట్టుకుని అమ్ముకుంటా ఉంటాది. బువ్వమ్మవ్వ ఏం వయ్సో తెల్దు గాని బాగ ముసిలిగుంటది. నేనైదు పైసలు పెట్టి రేక్కాయలు కొనుక్కుంటి. మాదేవి బుడ్డలు కొనుక్కునె.

మట్టిరంగు ఆకుపచ్చ అంచు
కొత్త కొత్త ఆశలు, ఆకాశం హద్దు
అక్షింతల్లా మంచు కురుస్తూంది మోహనంగా
మెరుస్తూంది తెల్లని వెలుగుల్లో
నిద్దరోతూంది నిబ్బరంగా నీడల్లో.

అక్షరాలే తప్ప ఆస్తులు బొత్తిగా లేని సామాన్య కుటుంబానికి చెందిన మనిషి వాడ్రేవు పాండురంగారావు. ‘ఇంగ్లీషు మీద చిన్నప్పట్నించీ విపరీతమైన వ్యామోహం’ ఉన్న మనిషి. భాషా చదువూ అంటే ఎంత ఇష్టం ఉన్నా, హైస్కూలు చదువుతో విద్యను పక్కనబెట్టి టెలిగ్రాఫిస్టు ఉద్యోగాన్ని అందుకొన్న మనిషి.

ఐదేళ్ళ కిందట ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లందరూ కలిపి కట్టుకున్న హౌసింగ్ సొసైటీలో మాకు పై అంతస్తు అలాట్ అయింది. చెప్పకేం! సంతోషంగానే అనిపించింది. వంటింటి పక్కనుంచి డాబామీదకి వెళ్తే, చిన్నదే అయినా, పనివాళ్ళకోసం కట్టించిన ఒక గది, బాత్రూమ్ అదనంగా దొరికాయి. మేమున్న గవర్నమెంటు ఇల్లు ఎంత విశాలంగా, ఎన్ని వసతులతో ఉన్నప్పటికీ ఇది స్వార్జితంతో కట్టుకున్నది.

మొదటి అయిదు పాటలు ఎన్. సి. వి. జగన్నాథాచార్యులుగారు పాడినవి. ‘స్వరముల తూగే ఘనరాగమయివో’ అన్న గోదావరి నదిపైన పాట (రచన: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం: మల్లిక్) కేవలం జగన్నాథాచార్యులుగారి పాటలతో ఒక సంకలనం చేయాలనే కోరిక చాలా సంవత్సరాలుగా ఉంది కాని, వారి వారసులు అదే ఆలోచనలలో ఉన్నారని వింటున్నాను.

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

ఇదిగో అదిగో అంటూనే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై ఏళ్ళ వయసొచ్చేసింది. సాహితీ సమితి సంబరాలకు తోటి సాహిత్యాభిమానులతో కలిసి సదస్సు నిర్వహించుకోవడంకన్నా సబబైనది మరొకటి ఉండబోదు. అందుకే తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్‌కు ఆహ్వానిస్తున్నాం.

గడినుడి 17కు ఈసారి గడువు తేదీలోపు ఇద్దరు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. 1. సుభద్ర, 2. భమిడిపాటి సూర్యలక్ష్మి. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ముగ్గురు: 1. కార్తిక్ చంద్ర పివిఎస్, 2. కోమలి గోటేటి, 3. జివిఎస్ఎస్ మార్కండేయులు. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 17 సమాధానాలు, వివరణ.

లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను.

జీవితంలో అత్యున్నత పీఠాల్ని, పురస్కారాల్ని, డబ్బుని అలా చూసి ఇలా వద్దనుకుని చిన్నారి పొన్నారి చంటి పిల్లలకోసమని వెనక్కి మళ్ళి, జీవితాంతం చిన్నపిల్లల కోసం బొమ్మలు వేసిన ఒక రంగు సుద్ద ముక్క వంటి మెత్తని చిత్రకారుడి కథ ఇది–అంటూ, మన దేశంలోని మొదటితరం బాలసాహిత్య చిత్రకారుల్లో ఒకరయిన పులక్ బిశ్వాస్ (1941-2013) గురించి ఆర్టిస్ట్ అన్వర్ ఆత్మీయ వ్యాసం రంగు బలపం-పులక్ బిశ్వాస్; తన సిలబస్‌లో స్కెచింగ్ గురించి సూచనలు, వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం– ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి అంటూ తన స్కెచ్‌బుక్స్‌‌తో చేయిస్తున్న పరిచయం; ఉషాజ్యోతి బంధం దీర్ఘకవిత ఆకాశదీపం; చారిత్రాత్మక చారిత్రిక ఆత్మకథ సురపురం పై దాసరి అమరేంద్ర సమీక్ష; ఈ నెలలో ఉగాది పండగ వస్తోంది కాబట్టి ఆ సందర్భంగా తెలుగువారికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ భైరవభట్ల కామేశ్వరరావు ఒక విశేషంతో కూర్చిన గడి-నుడి. (ఆ విశేషమేమిటో గడి పూర్తి చేస్తేనే తెలుస్తుంది మరి!); ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు, శీర్షికలూ…

ఈ దేశంలో ఇలస్ట్రేటర్లకు వర్క్‌షాప్స్ ఉండవు, వారి పనికి ఫెలోషిప్‌లు కానీ, గ్రాంట్లు కానీ ఏం రావు. కానీ విదేశాల్లో నీకు ఈ సదుపాయాలు అన్నీ వుంటాయి. అద్భుతమైన గురువులు ఉన్నారక్కడ. ఒకవేళ చూపు సారించగలిగతే నువ్వు ఆ వేపు చూడాలి. కానీ, నీ భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.

ఈలోగా ఇంకో నంబర్ నుంచి కాల్ రావడం మొదలైంది, “…ఎక్కడ పడిపోయారండీ?” అంటూ. మామయ్య అందా, నాన్న అందా? పిల్లర్ నంబర్ థర్టీన్ అని చెప్పాను. రోడ్డుకు అటువైపా? ఇటువైపా? రైతుబజార్‌కు ఎంతదూరం? కుడిపక్కా, ఎడమపక్కా అంటూ వచ్చిన ప్రశ్నలకు జవాబు చెబుతూనే ఇంకో షాపులోకి వెళ్ళాను. నేను అడిగింది కాక ఇంకేదో పేరు చెప్పి, అది ఉందన్నాడు.

మీట్ మై స్కెచ్ బుక్. లేదా డ్రాయింగ్ జర్నల్. కాదా వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం. ఇది నా బైబుల్, ఇది నా ఖురాన్, ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి… నా అంతటికీ నేను అనునిత్యం వ్రాసుకునే ప్రేమలేఖల సమాహరం కథ వినిపిస్తా.

దిక్కు తోచక దాచుకున్నవన్నీ బయటికి తీసి చూస్తావు. చాకొలేట్ రేపర్, సినిమా టికెట్, రుమాలు, ఎండిన మల్లెపువ్వొకటి, రెండు గవ్వలు, నాలుగు మబ్బులు మూసిన సాయంత్రాలు, కొన్ని పాత పాటలు. చెదలు తినేస్తూ. దేన్నీ రేకెత్తించని, దేన్నీ సూచించని ఈ చెత్తంతా ఎందుకు ఏరిపెట్టుకున్నట్టో అర్థం కాదు. బరువు దించుకుని అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి. అప్పుడు తను ఈ భూమ్మీద ఇదే కాలంలో జీవించే తోటి మనిషి.