గడినుడి-38 సమాధానాలు

అడ్డం

  1. నియమం పత్రంలో లేని మూలాన భీరువులు పఠించేది. (6)
    సమాధానం: పలాయనమంత్రం
  2. గిజిగాడు (6)
    సమాధానం: బంగారుపిచ్చుక
  3. ఇది అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట వెనుకటికి ఒకడు. (2)
    సమాధానం: అల్లం
  4. తీతువుపిట్ట కలిగివున్న తోలు సంచి. (2)
    సమాధానం: తిత్తి
  5. ప్రచండ కాదు కడుపు (3)
    సమాధానం: పిచండ
  6. జడముడి చివరల్లో వాన (2)
    సమాధానం: జడి
  7. శకటరేఫ మధ్య లోపిస్తే ఆవు గిట్ట కనిపించదా? (2)
    సమాధానం: శఫ
  8. హిందుస్తానీ ఒట్టు (2)
    సమాధానం: కసం
  9. [20 + 22+ 54 + 56] విశ్వనాథ వారి మూలుగుడు నవల (1+1+1+1)
    సమాధానం: హా
  10. అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలుగుట (5)
    సమాధానం: స్థితప్రజ్ఞత
  11. చూడుము 20.
    సమాధానం: హా
  12. రింఛోళి, కిర్మీరాల కిణాంక రచయిత (2)
    సమాధానం: చేరా
  13. ప్రతిజ్ఞలోని ప్రతిభ (2)
    సమాధానం: ప్రజ్ఞ
  14. హారం కోసం సవరం వెదుకు (2)
    సమాధానం: సరం
  15. పునరంకితమున నాడి (2)
    సమాధానం: నరం
  16. అతీగతీలో రెండో సగం అవనిజ దగ్గర లభ్యం. (2)
    సమాధానం: పజ
  17. కుసుమ పువ్వు (3)
    సమాధానం: కుసుంభ
  18. ముద్దు అయిన తిట్టు (3)
    సమాధానం: భడవ
  19. మనవి పత్రములోని పరిశుద్ధము (3)
    సమాధానం: పవిత్ర
  20. వెదురుబద్దలు మొదలైన వాటితో అల్లిన తట్ట (2)
    సమాధానం: గంప
  21. అందరికీ శకునం చెప్పేది తాను పోయి కుడితిలో పడిందట (2)
    సమాధానం: బల్లి
  22. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గ ఈ జాబితాలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పుణ్యక్షేత్రపు అమ్మవారు. (5,8)
    సమాధానం: త్రిపురాంతకంబాలాత్రిపురసుందరి
  23. చింపిగుడ్డలో గొంతు (2)
    సమాధానం: పీక
  24. భక్త వశవంకరుని అంతరమున కళేబరం (2)
    సమాధానం: శవం
  25. కలువ ___ కలలు విరియ కొండనెక్కిరావే అని సిరివెన్నెల చందమామను పిలుస్తున్నాడు. (3)
    సమాధానం: చెలువ
  26. చొంగ (3)
    సమాధానం: ఫేనము
  27. సప్తస్వరాలలో గొప్పతనము (3)
    సమాధానం: గరిమ
  28. ఫణము (2)
    సమాధానం: స్ఫట
  29. రాకాసి నిండువెన్నెల నిస్తుంది (2)
    సమాధానం: రాకా
  30. వడివేలులోని తేజం (2)
    సమాధానం: వేడి
  31. అలమరలో సొరుగు (2)
    సమాధానం: అర
  32. రేకుతో చేసిన డబ్బా (2)
    సమాధానం: టిన్ను
  33. చూడుము 20.
    సమాధానం: హూ
  34. స్వజుడు (5)
    సమాధానం: కన్నకొడుకు
  35. చూడుము 20.
    సమాధానం: హూ
  36. పూర్తికాని మీటింగు (2)
    సమాధానం: మీటిం
  37. గోవు లేని కౌముది (2)
    సమాధానం: ముది
  38. సేవకురాలు హిందీలో వచ్చింది. (2)
    సమాధానం: ఆయా
  39. కడమ ఎదురువస్తే నాగలి (3)
    సమాధానం: మడక
  40. పతి, గురువు, దేవుడు (2)
    సమాధానం: స్వామి
  41. ఇరకాటంలో కల్లు (2)
    సమాధానం: ఇర
  42. ఇతనికి వరహాల లాలి అని సినారె లాలిపాట (6)
    సమాధానం: వటపత్రశాయి
  43. వేప బ్రహ్మ సృష్టి ఐతే కరివేప ? (4,2)
    సమాధానం: విశ్వామిత్రసృష్టి

నిలువు

  1. ఎత్తు కానిది. (2)
    సమాధానం: పల్లం
  2. నియతి కలిగిన పద్య విశ్రమస్థానము (2)
    సమాధానం: యతి
  3. తడబడుతూ మాట్లాడటానికి బత్తిన సోదరులకేంటి సంబంధం? (2)
    సమాధానం: నత్తి
  4. పొయ్యి (2)
    సమాధానం: త్రంపి
  5. చనిన నాళుల తెనుగు కత్తులు సానవెట్టిన __ ఈ పెనుగొండ కొండ అని రాళ్ళపల్లివారి పాట. (2)
    సమాధానం: బండ
  6. కారుజము గర్భంలో రోగం (2)
    సమాధానం: రుజ
  7. పిచండిక మైనస్ చంక (2)
    సమాధానం: పిడి
  8. కొరడా (2)
    సమాధానం: కశ
  9. అనవసరమయిన విషయాలను పదేపదే వాగడం. (3,3)
    సమాధానం: అధికప్రసంగం
  10. కొంపెల్ల జనార్ధనరావుకు కృష్ణాపత్రిక ముద్దుగా ఇచ్చిన బిరుదు (2,3,5,3)
    సమాధానం: చండప్రచండశిలాభినవకొక్కొండ
  11. తమలపాకు (6)
    సమాధానం: ఫణిరాజవల్లి
  12. పటిష్టమైన, నిలకడ కలిగిన (3)
    సమాధానం: సుస్థిరం
  13. తనచే తెలివి వస్తుంది. (3)
    సమాధానం: చేతన
  14. గుర్తు (2)
    సమాధానం: సంజ్ఞ
  15. జలపుష్పము (2)
    సమాధానం: చేప
  16. మత్తేభవృత్తంలోని తొలి రెండుగణాలతో సమావేశం (2)
    సమాధానం: సభ
  17. పరంపరలో చిన్న చెక్క పేడు. (2)
    సమాధానం: రంప
  18. వీరిని చూసిన వేళల పిచ్చను/ముచ్చట పడనేల అని పింగళి వారి ప్రశ్న.(5)
    సమాధానం: సుందరాంగులు
  19. ఫిలిప్పిన్స్‌కు చెందిన కాట్రియోనా గ్రే ప్రస్తుత _____ (5)
    సమాధానం: విశ్వసుందరి
  20. త్రిపరిమాణికలో మేగజైను (3)
    సమాధానం: పత్రిక
  21. సీస్మోమీటర్ దీని తీవ్రతను రికార్డు చేస్తుంది. (3)
    సమాధానం: భూకంపం
  22. ద్వారకాపురంలో సంసారం (3)
    సమాధానం: కాపురం
  23. శబరి ధరించిన ఈటె (3)
    సమాధానం: బరిశ
  24. పుష్యరాగము (6)
    సమాధానం: పీతస్ఫటికము
  25. కొక్కిరిబిక్కిరి (6)
    సమాధానం: వంకరటింకర
  26. ప్రవరాఖ్యుడి వద్ద నున్న నాణెము (2)
    సమాధానం: వరా
  27. తెలంగాణ దొరల కోట (2)
    సమాధానం: గడి
  28. 1000 కిలోల బరువు (2)
    సమాధానం: టన్ను
  29. కారవేల్లము (3)
    సమాధానం: కాకర
  30. కె.శివారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన సాహిత్య త్రైమాసపత్రిక (3)
    సమాధానం: వేకువ
  31. నీవో నేనో – నేనే (2)
    సమాధానం: అమీ
  32. ఆకాశము; దినము; వనము; స్వర్గము (2)
    సమాధానం: దివ
  33. అష్ట వసువులలో ఒకడు (2)
    సమాధానం: ఆప
  34. ఛాయాచిత్రములో టూరు (2)
    సమాధానం: యాత్ర
  35. ఒడలు (2)
    సమాధానం: మయి
  36. నీటికాకి (2)
    సమాధానం: కవి
  37. ఆర్.కె. నారాయణ్ రచనల్లో హీరో (2)
    సమాధానం: స్వామి
  38. కాలమును కొలుచువాడు- సూర్యుడు అట దీనికి వ్యుత్పత్తి (2)
    సమాధానం: మిత్ర
  39. యజ్ఞము (2)
    సమాధానం: ఇష్టి