ఒకరోజు కొత్తబట్టలు కట్టుకుని మా ఇంటికి వచ్చింది మా అక్కను కలవడానికి. ఆ రోజు ఏ పండగా కాకపోవడంతో ఆ రోజు తన పుట్టిన రోజని గ్రహించాను. మధ్యాహ్నమల్లా కూచుని మంచి ఆర్ట్ పేపరు మీద వాసు రాసిన పాటని పొందికగా రాసి, మూడో చరణంలో ‘మూర్తి’ అన్న పదాన్ని కోట్‌లలో పెట్టి వాళ్ళమ్మగారు లేని సమయం చూసి వాళ్ళింటికి వెళ్ళి ‘ఇది నీకు నా పుట్టినరోజు కానుక’ అని చెప్పి బుచ్చిరత్నానికి ఇచ్చేను. అది చదివి నమ్మలేనట్టు నావంక చూసింది.
Category Archive: కథలు
నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు.
భలేగా ఉంది లెక్కల టీచరు! పొడుగ్గా, రెపరెపలాడే వాయిల్ చీరలో – ఎంత తెలుపో! మోచేతివరకూ చేతులున్న జాకెట్టు, నల్లతోలు బెల్టుతో రిస్టువాచీ, రెండో చేతికి నల్ల గాజులు, చెవులకు పొడుగ్గా వెండి లోలాకులు, మెళ్ళో సీతాకోకచిలక లాకెట్టుతో సన్నటి వెండి గొలుసు, కళ్ళకు సురమా కాటిక!
ఒద్దు ఒద్దనుకుంటూనే ఒక ఉత్తరాన్ని తెరిచాను. కుదురుగా ఉన్నాయి అందులోని పంజాబీ అక్షరాలు. మరో ఉత్తరం తెరిచాను. అదే చేతి రాత. అదే పొందిక. ఇంకోటి… ఆ గుర్‌ముఖి అక్షరాలు చదవడం రాదు కాబట్టి, ఆమె రాసింది నాకు తెలిసే ప్రమాదం లేదు. కానీ అవి ప్రేమలేఖలని గుర్తుపట్టడానికి, చదవాల్సిన పని లేకపోయింది! ప్రతి ఉత్తరానికీ కుడి చివరన స్పష్టంగా, సంతకానికి బదులు లిప్‍స్టిక్ రాసుకున్న పెదాలు ఒత్తిన ముద్రలు…
నావంటివాడు ఉంటే గింటే రాజకీయ కార్టూనిస్ట్‌గానే ఉండాలి. వార్తలు చదవడం, ఆలోచించడం, వాటి ఆలంబనతో రాజకీయ కార్టూన్లు గీయడం. ఎంత మన్నికైన పని! ఆ వెటకారాన్ని, సునిశిత వ్యంగ్యాన్ని ఊహించడంలో ఎంత మజా ఉంటుంది. బుర్ర ఎంత పదునుగా పని చేస్తుంది.
నా బాడీ షాపింగ్ ఐ. టి. బిజినెస్ మోడల్ గురించి నేను చెప్పాను. ఇద్దరమూ బ్రోకర్స్‌మే అని నవ్వాడు. నాకు కాస్త ఇరిటేషన్ వచ్చింది. ఆవిడ మటుకు పెద్ద ఇన్వాల్వ్ అవ్వకుండా మా మాటలు వింటూ కూర్చుంది. తన బర్త్‌డే ఆరోజు అని మాటల్లో తెలిసింది. ఇంతలో అతనికి కాల్ రావటంతో ఇప్పుడే వస్తానని బయటకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం కాసేపు మౌనంగా కూర్చున్నాం, మా డ్రింక్స్ మేము తాగుతూ. నలభై అనిపించేలా లేదు. స్లిమ్ ఫిగర్.
అందరం సంబరంగా 2020కు స్వాగతం చెప్పాం. చిట్టచివరి సారిగా మొరాకన్ విందుభోజనాన్ని ఆస్వాదించాం. ఎంతో హాయిగా సంతృప్తితో నిద్రాదేవత ఒడిలో సేదదీరాం. తెల్లవారగానే చుట్టూ కమ్ముకున్న కొత్త సంవత్సరపు పరిమళాలను మనసారా ఒంటపట్టించుకుంటూ తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయం దారి పట్టాం.
ఆమెను ఏమని పిలివాలో నాకెప్పుడూ తోచేది కాదు. పేరు పెట్టి పిలిచినా, ఆంటీ అన్నా, అమ్మాయ్ అన్నా ఆమె ముఖంలోని నవ్వులో పెద్ద తేడా ఉండేదేమీ కాదు. ఆటలంటే ఆమెకి చాలా ఆసక్తి ఉండేది. ఇంట్లో రకరకాల బోర్డ్ గేమ్స్, ఆటవస్తువులు ఉండేవి. చెస్, క్యారమ్స్, చైనీస్ చెక్కర్స్, బాడ్మింటన్ ఇలాంటి ఆటలన్నీ ఆమె నేర్పినవే. బ్లాక్ అండ్ వైట్ టివిలో క్రికెట్ ఆటలు లైవ్ మాత్రం వదలకుండా చూసేది. అవి టెస్ట్ మ్యాచ్ లైనా సరే.
జీవితం మామూలుగానే గడిచినా, ఆనందం లేకపోయినా, విషాదంగా ఉన్నా బానే ఉంటుంది. కానీ తప్పు చేసినట్లు దాన్ని మోస్తూ తిరగడమే కష్టం. తప్పు ఒప్పు అంటూ ఏమీ ఉండవని, తప్పు జరగడం వెనుక తెలియని, అర్థం కాని అన్యాయాలు ఉంటాయని అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. ఏదో చెప్పడానికో ఏదైనా అడగడానికో కాదు, ఉత్తగా కారణాలు ఏమీ లేకుండా ఒక్కసారి నిన్ను చూసి దగ్గరగా హత్తుకొని గుండెని తేలిక చేసుకొని వెళ్ళాలనుకుంటున్నా.
కోతి ముందుకు వచ్చి ఆ బైక్ పక్కన చేరి అతను బిగిస్తున్న నట్టుని తడిమి చూసింది. వంగి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి కొరికింది. అతను దాన్నే చూస్తున్నాడు. ఇందాక పైకి లేస్తూ చేతిలో ఉన్న స్పానర్ కింద పడేశాడు. ఆ కోతి వంగి స్పానర్ చేతికి తీసుకుని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని చూసింది. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది, నోట్లో పెట్టుకుని తర్వాత దాన్ని బోల్ట్ మీద పెట్టి అతనిలాగే బిగిస్తున్నట్టు అభినయం చేసింది.
నిర్వహణలో పాలుపంచుకోవడం ప్రారంభించాక అధికారి మొదటిసారిగా అధికారపు రుచిని తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆ అధికారం ఎలా వస్తుంది అన్నదీ కనుక్కుంటాడు. ఇంకా ఇంకా అధికారానికి వాడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసం తనను తాను మార్చుకుంటూ పోతాడు. కొన్నేళ్ళలో వాడు అధికార వ్యవస్థలో ఉండి మిగిలినవాళ్ళలాగా మూసలోకి సరిపడేలా మారిపోతాడు. వాడు ఎంతో కాలంగా కలలుగని తెచ్చుకున్న లక్ష్యాలన్నీ ఎక్కడో తప్పిపోతాయి.
భయం పుట్టింది. నాన్న గురించి నేను మాట్లాడ్డం! ఏం మాట్లాడాలి? ఏం పొగడాలి? హడావిడిగా పైకి లేచాను. బాత్రూమ్ వైపు నడిచాను. ఒంట్లో వణుకు తగ్గట్లేదు. ఓ సిగరెట్ త్వరగా రెండు పఫ్స్ తీస్కోని పడేశాను. వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కొని ఇంకో పాకెట్లో ఉన్న చిన్న బాటిల్ కోసం వెతికాను. అది దొరకలేదు. టెన్షన్ ఎక్కువైంది. “ఎక్కడైనా పడేశానా? ఇంట్లో వాడాను, పాకెట్లో పెట్టుకున్నట్టే గుర్తు. బైటికెళ్ళి వెతికే టైం లేదు. అది లేకపోతే…”
భయ్యావత్ సంగతేమోకాని, చూస్తున్న మాకు చిరుచెమటలు పడుతున్నాయి. ఆ పని మేం చెయ్యనందుకు ఒక రకంగా అవమానంగానూ ఉంది. ఈ పీపీ రేపట్నుంచీ పోజు కొట్టచ్చు. అసలే కొంత పొగరున్న యూపీ ‘జాట్’. ఉన్నట్టుండి మోకు ‘చిరచిర’మంది. మరుక్షణం పుటుక్కున తెగింది. మేమూ, మాతోబాటు భయ్యావత్ కూడా ఫ్రీజ్! మొహంలో భయం – ముప్ఫయ్ అడుగుల ఎత్తునుంచి పీపీ సింగ్ పిండి బస్తాలా పడిపోతున్నాడు, చేతులు గాల్లో నిరర్ధకంగా ఆడిస్తూ.
“ఈ గీరమనిషికి నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాననుకుంటున్నట్టుంది. దీని ఆశ మండిపోనూ! ఈసారి మళ్ళా రెండేళ్ళయేసరికి మనల్ని ఉద్ధరించడానికి వేంచేస్తుందిగా మహారాణీగారు! అప్పుడు చెప్పేస్తా. మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందీ, అప్పుడే పెళ్ళేఁవిటీ? మా ఆయన దానికి పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తా మంటున్నారూ అని చెప్పేస్తా!” అంది.
ఒకే ఒక్కరోజులో మేమంతా నాగరికత నిండిన మరాకేష్ నుంచి గంటన్నర దూరం ప్రయాణించి నగరంతో ఏ మాత్రం పోలికలేని కొండచరియల్లో వేలాడే బెర్బర్ గ్రామాలను, సారవంతమైన లోయలను, హిమ శిఖరాలను, నిర్జీవపుటెడారులనూ చూడగలిగామన్నది విస్మయ పరిచే విషయం.
మా యజమాని తన స్వహస్తాలతో ఒక ఉద్యోగికి ఉద్వాసన చెప్పే అవకాశం పోయినందుకు తెగ విచారించి, తనకు తానై తన పత్రిక నుండి ఒక మనిషి అలా వెళ్ళిపోగలిగే స్వతంత్రాన్ని భరించలేక, నా కోసం కబురు పంపి బోలెడంత భవిష్యత్తు ఉన్న నేను అంత మూర్ఖంగా ఉండకూడదని నచ్చచెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాడు.
ఒక పాత కోటలో అది ఒక గది. మధ్యలో, ఒక శవవాహిక మీద తెల్లని దుస్తుల్లో పడుక్కున్న ఒక యువతి శవం ఉంటుంది. నాలుగు ప్రక్కలా, గోడలపై కాగడాలు వెలుగుతూ ఉంటాయి. కుడిప్రక్కన వెడల్పుగా ఉన్న ఒక కిటికీ, అందులోంచి దూరంగా రెండు కొండలు, వాటి మధ్యలోనుండి ఒక సముద్రపు తునకా కనిపిస్తూ ఉంటాయి.
మార్గరెట్టు టీచరు మొహమాటపడుతూ మొహమాటపడుతూ లోపలికి వొచ్చేరు. అతి బలవంతాన పాలు తాగేరు. ఆవిడ నెమ్మదితనం, మాటతీరు, మనిషీ అన్నీ అమ్మకీ బామ్మకీ నచ్చేయి. తర్వాత తెగమెచ్చుకున్నారు. ఆవిడ దగ్గర నెమ్మదితనాన్ని, గట్టిగా అరుస్తున్నట్టు మాటాడకండా మాటలాడ్డాన్ని నేర్చుకోవాలి.
స్వీరా నగరాన్ని ఒక ఆరుబయలు మ్యూజియం అనడం సబబు. అక్కడ మనకు లభించగల చక్కని అనుభవం ఏమిటీ అంటే గమ్యమంటూ లేకుండా ఆ నగరపు వీధుల్లో గంటలతరబడి తిరుగాడటం, ఆ ప్రక్రియలో కాస్సేపు మనల్ని మనమే కోల్పోవడం. ఏ ఆలోచనలకూ తావు లేకుండా సేదదీర్చే ఆ వాతావరణం ఏ మనిషినైనా మత్తెక్కిస్తుంది.
ఇక్కడ ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో కార్టూనిస్ట్‌గా ఉన్నది నేనొక్కడినే కాదు. మరో కార్టూనిస్ట్ కూడా అక్కడ తన బొమ్మలతో, తన సృజనాత్మకతో, తన కార్టూన్ల వెటకారపు చావు దెబ్బలతో రాజకీయ నాయకులని హేళన చేస్తూ ఉన్నాడు. అతను మీకు బాగా తెలిసినవాడే! అతని పేరు చెప్పేయంగానే అతడిని మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు.