వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది.
శీర్షికలు శీర్షికలు
“ప్రియా, ఈ మహావిశ్వంలో ఏ నక్షత్రాల మధ్య ఏ లోకంలో ఉంటావో తెలుసుకోలేకపోయినాను.”
“నేనేం తెలుసు నీకు?”
“..నువ్వెవరో నాకు తెలీకపోతే నువ్వెవరో నీకు కూడా తెలీదు.”
“దొంగరాముడులో క్యారక్టరు వేయాలంటే నాకు కొంచెం భయం వేసింది. అది కొంచెం గయ్యాళి పాత్ర, చేయగలనో లేదో. అలాగే తెలుగు కూడా యాసతో మాట్లాడాలి, సరిగ్గా వస్తుందో రాదో” అంటూ మహానటి చెప్పిన ముచ్చట్లు.
రసాయినోద్రేకాల ప్రళయ కాలంలో
అయితే కుంభవృష్టి లేతే చండ్రగాడ్పులు
తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు
ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని,
వాదోపవాదాల వలలు
ఎన్నిసార్లు విసురుతావ్?
వాతావరణం వాటం గా లేదని
ఎన్ని యుగాలు కసురుతావ్?
గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. చక్కనమ్మ చిక్కినా అందమే గదా.
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను
మౌనంగా..
నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?
అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను.
అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ఇన్ని దేశాల కథలు చదివిన ఆమె మానసికంగా ఎక్కడ ఉంటుందో, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి తెలియదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు.
గుడ్డ మూట తల కింద పెట్టుకొని
పాడుబడ్డ మండపంలో బవిరి గడ్డం సన్యాసి
నిన్ను నేను మరచిపోవాలంటే
నన్ను నేను మరచిపోవాలి
నన్ను నేను మరచిపోవాలంటే
నన్ను నేను చంపుకోవాలి
గగనమందలి తారకాగణము లెల్ల
అవనికిం జాఱిపడినవో యనఁగఁ గురిసె
అర్యమాంశుభాస్వంతంబు లగుచు ధవళ
హిమకణంబులు ధాత్రిలో నెందుఁ గనిన
ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కొత్త కథలు, వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు. ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.
పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, ”భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని అభివర్ణించవచ్చు.
మా పడవ మునిగి పోతుంది. మాక్కావల్సిందీ అదే!
పేరు తెలియని చెట్టు ఒకటి
వానకు తడుస్తూ నిలబడి ఉంది
అప్పుడప్పుడూ గలగలపారే
ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
కాలం నా కనురెప్పల క్రింద
మాగన్నుగా ఒదిగిపోతుంది.