ఇక పద్యంలోని కవిత్వలోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం.
శీర్షికలు శీర్షికలు
కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.
ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట.
2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.
ఏదో అనబోయి మళ్ళీ జాతకం చూడ్డం మొదలుపెట్టాడు సిద్ధాంతి గారు. సామర్లకోట వచ్చింది. పెద్దాయన కాఫీ ఇప్పించేడు సిద్ధాంతి గారికి. ఎక్కే దిగే జనాల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాప జాతకంలో లీనమై ఉన్నారు. పాప కొంచెం చిరాకుగా ఉన్నట్టు గమనించేడు లూ.
“అమాయకపు జూ. శ్రీరంజనీ, ధర్మసూక్ష్మ మెరుగవు నీవు. యోగా అనగా నేమి? క్రమ పద్ధతిలో గాలి పీల్చుట, వదులుట. టివిలో ఆ యోగా గురువు, కాళ్ళూ, చేతులూ నానా రకాలుగా పెట్టించి, యే ఆసనం వేయించినా, ప్రతీ ఆసనం లోనూ గాలి ఘట్టిగా పీల్చి వదులుడూ, అని చెపుతాడు కదా.”
భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం – నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.
రాజుగారి వేషం తడిపి
బికారిగాడి దేహం తడిపి
ఒక ముద్దగా
ఒక్క తీరైన పులకరింతగా-
చిందిన చెమట చుక్క
పుట్టబోయే బిడ్డని
అమ్మ మోసినంత భధ్రంగా మోస్తున్న
జ్ఞాపకాల సంచీలోంచి
కొన్ని క్షణాల వెలికితీత
ఏదో రహస్యం అర్థమయ్యీ కానట్టు
ఏదో వెలుగు లోలో మిణుకు మిణుకుమంటూ
ఇన్నాళ్ళెందుకు సాగిందీ ప్రతీక్ష!
నిర్దిష్టవాక్య నిర్మాణనైపుణ్య నిధి కోసం నిరంతర ప్రయాసను గునపం చేసి తవ్వుతూ పో రచనాకారుడా. చక్కని పదాల కాంతులు అల్లుకున్న చుక్కల పందిరికి లెక్కలేనన్ని భావవిద్యుద్దీపాల వెలుతురు గుత్తులు వేలాడనీ.
ఆ పెళ్ళిలో
నా పట్టు చీర మీద
రాలి పడ్డ నీ కొంటె నవ్వుల
మత్తు మల్లె పువ్వుల
ఇంపగు కెంపుల జొంపలొ
సొంపగు బంగారు రేకు – సొగసుల సిరులో
వంపుల మరకతవల్లులొ
నింపెను కంబళమువోలె – నేలను నాకుల్
కాల స్వభావము! నిన్న మొన్నటిదనుక నిలువ నీడ లేకుండిన ఈ వచన కవులు, క్షురకుడు మార్జాలపు తల గొఱిగినటుల లపనముకొచ్చిన కూతలు గూయుచు, చేతికొచ్చిన వ్రాతలు వ్రాయుచు దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా?
తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని ఆడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా?
ఈ సంచికతో ఈమాటను సాంకేతికంగా మరిన్ని సదుపాయాలు కలిగిన సరికొత్త వర్డ్‌ప్రెస్ లోకి మార్చాం. అందుకు అణుగుణంగా, పాఠకుల సౌకర్యం కోసంగా ఈమాట వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. పాఠకులందరికీ చిరపరిచితమైన ఈమాట వేషాన్ని మరికొంత మెరుగు పరిచాం; మీకు నచ్చిన రచనని మీ మిత్రులతో ఫేస్‌బుక్, గూగుల్+, ఈ-మెయిల్ ద్వారా వెంటనే పంచుకునే వీలు; ఒక రచయిత రచన చదివే పాఠకులకి ఆ రచయిత ఇతర రచనలు కనిపించే అమరిక; ముఖపత్రంలో పాత సంచికల నుండి కథలు, కవితలు, వ్యాసాలు ఎప్పటికప్పుడు యాదృచ్ఛికంగా కనపడే ఏర్పాటు; ఇలా ఎన్నో. త్వరలోనే మొబైల్ పరికరాలలో కూడా ఈమాటను చదువుకునే వీలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా ఊహలకి రూపాన్నిచ్చి, నవ్వుతూ మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించినందుకూ, ఇకనుంచి ఈమాట సాంకేతిక నిర్వహణా భారంలో పాలు పంచుకుంటున్నందుకూ అశ్విన్ బూదరాజుకి మా హార్దిక కృతజ్ఞతలు.
ఈమాట గ్రంథాలయంలో కొత్తగా మహాభారత యుద్ధ కథ తేలికపాటి వచనంలో; సామాన్యుల కథలు – కోళ్ళ మంగారం మరికొందరు. అపురూప శబ్ద తరంగాలు: తెలుగువారికి చిరపరిచితమైన రక్తకన్నీరు నాటకం; రెండు ఉగాది కవిసమ్మేళనాలు.
ఈ సంచికలో: మండువ రాధ, పాలపర్తి ఇంద్రాణి కవితలు; బులుసు సుబ్రహ్మణ్యం, వేలూరి వేంకటేశ్వర రావు, లైలా యెర్నేని, మండువ రాధ, ఆర్. శర్మ దంతుర్తి, ఆర్. దమయంతిల కథలు; పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వాడ్రేవు చినవీరభద్రుడు, బండ్లమూడి స్వాతికుమారి, సురేశ్ కొలిచాల, జెజ్జాల కృష్ణ మోహన రావు, లక్ష్మన్న విష్ణుభొట్ల, వెల్చేరు నారాయణ రావుల వ్యాసాలు; భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం…,
మూడో రోజున భాగ్యనగరంలో పుట్టిన చీలిక బాగా పెద్దదయ్యింది. ఉత్తర భాగ్యనగరం సుమారు అరవై అడుగులు పైచిలుకు (భౌతిక శాస్త్ర పరిభాషలో ఇరవై మీటర్లు) వెడల్పుగా పెరిగి పెద్ద గండిగా తయారయ్యింది. ఈ రెండు భాగాలనీ గొలుసులతో కట్టి పెట్టటానికి ప్రభుత్వం దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరికీ ఫర్మానా పంపింది.
మన డబ్బు కోసమే ఒప్పుకుంటున్నాడు అని కోపంతో అరిచింది ఈవిడ. పెద్దావిడకి పిచ్చ కోపం వచ్చేసింది. నీ అందం చూసి ఎవడూ రాడు, నీ డబ్బుకోసమే వస్తాడు అంటూ చెడామడా తిట్టింది ఆవిడ. నన్ను చూసి చేసుకునే వాడు దొరికినప్పుడే చేసుకుంటాను అని ఇంకా ఘట్టిగా అరిచింది ఈవిడ. చివరికి మన వెంకట్ కూడా నిన్ను చూసి చేసుకోడు…
చల్ల గాలి తెరతెరలు తెరలుగా వచ్చి, వింజామర్లు వీస్తుంటే, అలుపు తీర్చుకుంటున్నా. ఇంతలో ఒక చైనా అమ్మాయి, నా ముందు నించి ఆ అడవి లోకి ట్రెకింగ్‌కి పోతోంది. ఈ బక్క ప్రాణి అందులో చిక్కుకు పోతే ఎలా అనిపించింది. వొద్దని చెప్పబోయి ఆగిపోయాను. మనకెందుకొచ్చిన గొడవలే పోనీ అని. ఎందుకంటే ఆమె వెళ్ళే దారితో నా కొక చేదు అనుభవం వుంది.
మూసి ఉన్న ఆ తలుపుల కేసి చూస్తూ, నిసి ఒకలాటి విచిత్రమైన ఆలోచనలకు లోనయ్యింది. చచ్చి స్వర్గంలో వేశ్యా వాటికలోకి వచ్చి పడ్డట్టున్నా. లేకుంటే పాకీజా కోఠీ లోనైనా ఉండి ఉంటా. లేకపోతే నేనేంటి, ఈ బిల్డింగ్‌లో ఈ పడిగాపులేంటీ, అనుకుంది, తన పాఠం పుస్తకం తిరగేస్తూ.