గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 - ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి రాసిన ఉత్తరాలు, విమర్శకుల వ్యాసాలు, పాలగుమ్మి రేడియో చర్చ, అలాగే రోహిణీప్రసాద్, లక్ష్మన్న, హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం. ఇంకా...
Category Archive: ముందుమాట
సెప్టెంబరు 2009 సంచికలో మీకోసం - శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ; ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది - వేమూరి వెంకటేశ్వర రావు వ్యాసం; శాశ్వత్, వింధ్యవాసిని కన్నడ మూలం నుంచి అనువాదం చేసిన కథ కెంధూళి; పాబ్లో నెరూడా కవితకు తెనుగు సేత ఈ రాత్రి నేను రాయగలను - బొల్లోజు బాబా కవిత.
జులై 2009 సంచికలో-- నిద్రిత నగరం - వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్ష, వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో 'ప్రభావం' అంటే ఏమిటి?, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం: ఫాదర్స్ డే. ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు.
వస్తున్న వసంత ఋతు శుభాకాంక్షలతో ఈమాట మే 2009 సంచికకు స్వాగతం. కొత్తగా: - ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం. - అభిప్రాయ నియమావళి అవసరాన్ని వివరిస్తూ పాఠకుల కోసం ఈమాట సంపాదకుల వ్యాసం. చర్చకు ఆహ్వానం. - పొరపాటున బహిర్గతమైన ప్రైవేటు ఉత్తరం- ఈమాట ముఖ్య సంపాదకుడు, ప్రచురణకు వచ్చే రచనలపై తన సంపాదక బృందానికి రాసిన మెమో. ఇంకా...
ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం. ప్రముఖ కవి, రచయత శ్రీ స్మైల్ డిసెంబర్ 5వ తేదీ మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంచికలో: ప్రత్యేక వ్యాసం: ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత "స్మైల్" (మహమ్మద్ ఇస్మాయిల్) జ్ఞాపకాలు వేలూరి వేంకటేశ్వర రావు మాటలలో. ఏమిటీ ఈమాట మాట? ఈమాట ప్రారంభించినప్పటి ఆశయాలు ఎంతవరకూ నిజమయ్యాయి? కే.వీ.యస్. రామారావు మాటల్లో: "పదేళ్ళ ఈమాట మాట". వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం…
ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కొత్త కథలు, వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు. ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.
ఈమాట జులై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో భద్రిరాజు కృష్ణమూర్తి, ఆరుద్ర తో ఇంటర్వ్యూ, సి. మృణాళిని గారి ఉపన్యాసం. జె.యు.బి.వి. ప్రసాద్, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి గార్ల కథలు. ఇంకా వ్యాసాలు, కవితలు, ఇతర ఆకర్షణలు.
విరోధి నామసంవత్సర శుభాకాంక్షలతో ఈమాట మార్చ్ 2009 సంచికకు స్వాగతం! ఈమాట సంపాదకులలో ఒకరైన శంకగిరి నారాయణస్వామి (నాసీ) గారు వ్యక్తిగత కారణాల వల్ల ఈమాట సంపాదక బాధ్యతల నుంచి వైదొలిగారు. వారు సంపాదక బృందంలో ఒకరుగా గత సంవత్సరంలో చేసిన కృషికి మా కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా కాకపోయినా, ఈమాటకు వారి సహాయ సహకారాలు ఇకముందు కూడా ఉంటాయనే మా నమ్మకం. - ఈ సంచికలో...
భద్రిరాజు గారి అశీతితమ జన్మదిన సందర్భంగా ఆయన గురించి చేకూరి రామారావు, వెల్చేరు నారాయణ రావు, కె. కె. రంగనాథాచార్యులు, ఆరుద్ర, బూదరాజు రాధకృష్ణ గార్లు రాసిన వ్యాసాలను ఈ సంచికలో చివరి విడతగా మీకు అందజేస్తున్నాము. సమయాభావం వల్ల, ఈ ప్రత్యేక సంచికకోసం మాకు పంపించిన కొత్త రచనలన్నింటిని ప్రచురించలేక పోయాము. మిగిలిన రచనలను జులై సంచికలో తగుమాత్రంగా సమీక్షించి ప్రచురిస్తాము. ఈ సంచికకోసం పాత వ్యాసాలను సేకరించడంలో మాకు ఎంతగానో సహాయ పడ్డ వాడపల్లి…
వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది.
"ఈ మాట" పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి. - ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు - ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు - “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలుపూర్తి వివరాలు»
ఈమాట జనవరి 2008 సంచికలో -- ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: "నా మాట" ఇంకా విశేషాలు -- సితార్ విద్వాంసులలో పండిట్ రవిశంకర్ అర్జునుడైతే, ప్రతిభలో కర్ణుడి వంటి ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మల్టీమీడియా వ్యాసం: "సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్" దేవతలకూ, రాక్షసులకే గాక, ప్రాణం లేని…
ఈమాట నవంబర్ 2007 సంచిక విడుదల!
సరికొత్త కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల! ఈ సంచిక "కన్యాశుల్కం" ప్రత్యేక సంచిక.
ఈ సంచికలో మరొక ముఖ్యమైన విశేషం, శంఖవరం పాణిని గారు ఈ సంచికనుంచీ ఈమాట సంపాదక వర్గంలో భాగస్వామి అయ్యారు. పాణిని వృత్తి రీత్యా బయోకెమిస్ట్. ఎమరీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ప్రొఫెసర్. ప్రవృత్తి రీత్యా, తెలుగు సాహిత్యం, సంగీతం, -- రెండింటిలోనూ ద్రష్టే అని చెప్పచ్చు. యాహూ గ్రూపు "రచ్చబండ" మోడరేటర్లలో ఒకరుగా, అంతకు ముందు తెలుసా (తెలుగు సాహిత్యం) గ్రూపు లో క్రియాశీలక సభ్యులుగా, "ghantasAla.info" వ్యవస్థాపకులలలో ఒకరిగా ఇంటర్నెట్టులో చిరపరిచితులు. పాణినిగారు…
కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట మే 2007 సంచిక విడుదల! ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణ, స్వర్గీయ సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ సాహిత్యాన్ని లోతుగా, […]
అనుకోని సాంకేతికమైన ఇబ్బందుల నుండి బయటపడి ఒకరోజు ఆలస్యంగా మార్చ్ సంచికను విడుదల చేస్తున్నాం. ఓపిగ్గా “ఈమాట” కోసం నిరీక్షిస్తూ, మాకెంతో ప్రోత్సాహం ఇచ్చిన […]
జనవరి 2007 సంచికలో- నారాయణస్వామి కవితల సంకలనం “సందుక” పై విన్నకోట రవిశంకర్ సమీక్ష – “పోగొట్టుకున్నవాడి పాట”, “భాషా సంబంధ నిరూపణ” పై […]
ఈ సంచికలో విశేషాలు: ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు గురించి ఒక సమీక్ష, సంపాదకీయం. ఈ సాహితీ సదస్సులో వేలూరి వేంకటేశ్వర రావు […]