ఈమాట సెప్టెంబరు 2009 సంచికకు స్వాగతం. ఈ సంచికలో మీకోసం:
- తెలుగు నిఘంటువుని పునర్నిర్మించాల్సిన అవసరంపై వేలూరి వెంకటేశ్వర రావు సంపాదకీయం.
- కథలు: పెదవి దాటనివి – సౌమ్య బాలకృష్ణ; మిగారమాత – ఆర్. శర్మ దంతుర్తి; అనువాద కథ కెంధూళి – శాశ్వత్, వింధ్యవాసిని.
- కవితలు: మరో పువ్వు – మూలా సుబ్రహ్మణ్యం; హంస గీతం – హేమ వెంపటి; వానా వానా – ఆత్రేయ కొండూరు; అనువాద కవిత ఈ రాత్రి నేను రాయగలను – బొల్లోజు బాబా; జమ్మిబంగారం చెట్టు – జాన్ హైడ్ కనుమూరి; వాన కూడా వింతే – ఇంద్రప్రసాద్
- వ్యాసాలు: ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది – వేమూరి వెంకటేశ్వర రావు; గుర్రం జాషువా పాపాయి పద్యాలు – విష్ణుభొట్ల లక్ష్మన్న; పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం – కొడవటిగంటి రోహిణీప్రసాద్. నాకు నచ్చిన పద్యం శీర్షికలో విశ్వనాథ కల్పనా వైచిత్రిపై చీమలమర్రి బృందావనరావు వ్యాసం, ఇటీవలే మరణించిన శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ.
అనివార్య కారణాల వల్ల కొడవళ్ళ హనుమంతరావు కంప్యూటర్ పూర్వాపరాలపై రాస్తున్న వ్యాసాలను రాయలేకపోడంతో గత రెండు సంచికలనుండీ అవి లేని లోటు మనకు తెలుస్తూనే ఉన్నది. తమ పని ఒత్తిడి తగ్గగానే ఒకటీ రెండు నెలల్లోనే మళ్ళి ఈ వ్యాస పరంపరను కొనసాగిస్తానని హనుమంతరావు తెలియచేశారు. త్వరలోనే వారు మళ్ళీ ఈ వ్యాస శీర్షికను పునరుద్ధరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.
అలానే, ఈసారి లక్ష్మన్న రాసిన పాపాయి పద్యాల వ్యాసానుబంధంగా కొడవటిగంటి రోహిణీప్రసాద్ కొన్ని సంగీతపరంగా ఆసక్తికరమైన విషయాలను, అంతే కాక పట్రాయని సంగీతరావు గారు వారికి ఒక ఉత్తరంలో ముచ్చటించిన సంగతులను పంచుకున్నారు. చదవడం మర్చిపోకండి.
మీ ఆదరాభిమానాలూ, విశ్లేషణాత్మక సద్విమర్శలూ మాకిలా కొనసాగుతూనే ఉంటాయని ఆశిస్తున్నాం.
– ఈమాట సంపాదకులు.