ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్‌లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి…
జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్! శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, తెలుగువారు గర్వించదగ్గ ద్రావిడ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. భాషాశాస్త్రంలో తమ విశేషమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు. తమ వెలుగుతో ప్రపంచపు…
పాబ్లో పికాసో, సాల్వడోర్ డాలి, ఎడ్గార్ డెగా, వాసిలీ కాండిన్‌స్కీ తదితరుల సరసన సమాన స్థాయిలో నిలబడిన చిత్రకారుడు ఎస్. వి. రామారావు. భారతీయ చిత్రకళా పద్ధతులను యూరోపు నైరూప్య చిత్రకళతో రంగరించి తనదంటూ ఒక ప్రత్యేకమైన భావప్రకాశకత్వాన్ని సాధించుకున్న రంగులకవి. చిత్రకారుడు, కవి, వ్యాసకర్త అయిన రామారావు కళాజీవన పరిణామాన్ని పరిచయం చేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం, నైరూప్యచిత్ర కళాయాత్రికుడు; చారిత్రక నవల లక్షణాల పరిశీలన, చర్చ కోసంగా మూడు ప్రత్యేక వ్యాసాలు…
ఆషాఢ మాసం కాకపోయినా, మధ్యాహ్నాలు ఆకాశమంతా నల్లమబ్బులు నిండిపోయి ఉరుములూ, మెరుపుల జడివానలు మనల్ని అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి ఇప్పటికే. వాటిని చూసేనేమో, కృష్ణ మోహన రావు గారు, కాళిదాస విరచిత మేఘదూతంపై వ్రాసిన ఛందోవ్యాసం ఆషాఢస్య ప్రథమ దివసే ఈ సంచికలో ప్రత్యేకం. ఈ వ్యాసానికి యక్షుడి చిత్రాలను అందించినది ఔత్సాహిక చిత్రకారుడు మాగంటి వంశీమోహన్‌గారు. అంతే కాదు, ఈ వ్యాసానికి తోడుగా పరుచూరి శ్రీనివాస్ సేకరించిన మేఘసందేశం ఆడియో రూపకం కూడా ప్రత్యేకమే. బాలాంత్రపు రజనీకాంత…
తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట 'సీత గడియ'పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో "సాహిత్యం - స్త్రీల చైతన్యం" అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్…
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!! ఊర్మిళాదేవి నిద్ర: మన ప్రాచ్య సంస్కృతులలో రామాయణం కేవలం ఒక కావ్యం కాదు. సీతారాముళ్ళు కేవలం దేవతలూ కారు. రామాయాణంలో పాత్రలన్నీ మన జీవితాల్లోని పాత్రలు. మన జీవితాల్లో ఉండే కష్ట నష్టాలు, సుఖదుఃఖాలను మనలాగే అనుభవించే మామూలు మనవాళ్ళు. అందుకేనేమో, మనకెన్ని వందల రామాయణాలో! ఒక్కో రామాయణం చెప్పే కథ ఇంకో రామాయణం చెప్పదందుకే మరి! తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాలుగా తెలుగు స్త్రీల పాటలలో ఒక విడదీయరాని…
అత్తిపట్ కృష్ణస్వామి రామానుజన్ (A. K. Ramanujan, 1929-93) మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉంటూ దక్షిణ భారత భాషల సాహిత్య స్వరూప పరిణామాలని నిశితంగా పరిశీలించిన విద్యాధికుడు. "భారతీయ చింతన అంటూ ఒకటున్నదా?" అనే ఒక ప్రముఖ వ్యాసం ద్వారా భారతీయ చింతనలో సందర్భ గ్రాహ్యత (Context sensitivity) గురించి విశ్లేషించాడు. భారతీయ సాహిత్యంలో మౌఖిక, లిఖిత పార్శ్వాల అనుబంధంపై…
వేగుంట మోహన ప్రసాద్ (05జనవరి 1942 - 03ఆగస్ట్ 2011): మో' గా సుప్రసిద్ధుడైన అపరిచితుడు కవి వేగుంట మోహనప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు. మొట్టమొదట ప్రచురించబడ్డ కవిత హిమానీహృది, 1960 మే నెల భారతిలో. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ 'చితి-చింత' (1969) మో'కి తెలుగు కవుల్లో ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. 'రహస్తంత్రి', 'సాంధ్యభాష', 'పునరపి', 'నిషాదం', ఇలా ఎన్నో…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకుంటున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఈ సమావేశాలకు తెలుగు దేశం నుంచి ఎందరో రాజకీయ కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. తానా సాహిత్య సమావేశంలో మేడసాని మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాత్యాయనీ విద్మహే, మృణాలిని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొంటున్నారు. బాపూ బొమ్మల కొలువు ఈ సమావేశంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.…
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ (7 మే 1861 – 7 ఆగస్ట్ 1941) 150వ జన్మదిన వార్షికోత్సవం (మే 7 - మే 9) శాంతినికేతన ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది. ఈ సందర్భంగా కవయిత్రి కేతకి కుషారి డైసన్ చేసిన టాగోర్ కవితల అనువాదాల సంకలనం పెంగ్విన్ ఇండియా వారు విడుదల చేస్తున్నారు. టాగోర్ పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ కవులచే గీతాంజలి కవితల పఠనం, వాచికాంజలి, నృత్యాంజలి, కావ్యాంజలి తదితర సాహిత్య లలిత కళా కార్యక్రమాలను ప్రదర్శించబోతున్నారు.  …
ముళ్ళపూడి వెంకట రమణ (28 జూన్ 1931 - 24 ఫిబ్రవరి 2011): సాక్షి, ముత్యాలముగ్గు, రాజాధిరాజు, అందాలరాముడు, బుద్ధిమంతుడు, గోరంత దీపం, స్నేహం, వంశవృక్షం, రాధాకళ్యాణం - ఇలా ఎన్నో బాపూ చిత్రాలకు మాటలద్దిన మాంత్రికుడు. బుడుగు, సీగాన పెసూనాంబ, అప్పుల అప్పారావు, కాంట్రాక్టరు, రాధా గోపాళం, రెండుజెళ్ళ సీత - ఇలా ఎన్నో పాత్రలకు జన్మ నిచ్చి మాటలు పోసి పెంచి సజీవులను, చిరంజీవులను చేసిన వాక్య బ్రహ్మ, ఋణానందలహరి భాష్యకారుడు, అర్ధబాపూ అయిన…
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!! కోవెల సంపత్కుమారాచార్య (26 జూన్ 1933 - 6 ఆగస్ట్ 2010): శ్రీ కోవెల జననం వరంగల్లులో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, హిందీ భాషలలో ఎం. ఏ., ఆపై కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1978లో 'తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ: సంప్రదాయము' అనే సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ డిగ్రీలు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ - లక్షణ దీపిక, తెలుగు ఛందోవికాసము, మధుర గాథలు, తదితర గ్రంథాలు; ఆముక్త, చేతనావర్తం…
ఈ సంచికలో: 'కథ నచ్చిన కారణం' కొత్త శీర్షిక ప్రారంభం. పాల్గొనమని మా పాఠకులకు ఆహ్వానం. విన్నకోట రవిశంకర్ కవిత్వ పరిశీలన, నాటికి నేడు రేడియో నాటిక, దేశికాచారి, వైదేహి శశిధర్, పాలపర్తి ఇంద్రాణి తదితరుల కవితలు. జెజ్జాల కృష్ణ మోహనరావు తిరుక్కుఱళ్ అనువాదం కామవేదం. ఇంకా...
నువ్వు లేవు నీ పాట వుంది, ఇంటి ముందు జూకా మల్లెల్లో చుట్టుకుని, లాంతరు సన్నని వెలుతురులో కమ్ముకుని.. అంటూ అద్భుతమైన వచన కవిత్వాన్ని మనకందించి అకాలంగా కాలం చేసినా మన మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన ఇలా గుర్తు రావడానికి ఏ సందర్భమూ లేదు, అక్కర్లేదు. ఆ కవితా సతి నొసటి రసగంగాధర తిలకపు చుక్కలు కొన్ని ప్రత్యేకంగా, శబ్దతరంగాలు, కథలు, కవితలు, వ్యాసాలతో కలిసి ఈ సంచికలో ఈమాట…
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఈ యేటికి ఐదువందల సంవత్సరాలయింది. కృష్ణరాయని కాలంలో తెలుగు వారికి ప్రసాదమైన అపురూప సాహిత్యమూ, దక్షిణాపథ చరిత్రలో ఆ కాలానికి గల విశిష్టతల ప్రభావంతో, ఈ సంచికను శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాం. ఈ సంచికలో కథలు, కవితలు, శీర్షికలతో పాటుగా విజయనగర సామ్రాజ్యం గురించిన చారిత్రాత్మక వ్యాసాలు; కీ. శే. వేటూరి సుందరరామమూర్తి రచించిన సంగీత నాటిక ఆడియో ప్రత్యేకంగా ఈమాట పాఠకుల కోసం పొందుపరిచాం.…
ఈ సంచికలో మీకోసం:       సుప్రసిద్ధ హిందీ కవి బాబా నాగార్జున కవిత్వాన్ని, అంతస్సు - బాహ్యప్రపంచాల సంబంధాల్ని విశ్లేషిస్తూ చాకిరేవు ఉపేంద్ర సమగ్ర వ్యాసం; శబ్దతరంగాలలో రమేష్ నాయుడు ప్రత్యేక జనరంజని ఆడియో; వసంత ఋతువుని సాహిత్యంలో సంగీతంలో పరిచయం చేస్తూ జెజ్జాల కృష్ణ మోహనరావు వ్యాసం; ఇంకా ఎన్నో కవితలు, కథలు, శీర్షికలూ...
ఈ సంచికలో మీకోసం... ద్రౌపది నవల పై చెలరేగుతున్న వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం ఇతిహాసాలూ, ప్రబంధాలూ; జయదేవుని అష్టపది సా విరహే తవదీనా పై పాటలతో, అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసం; సహజగాయని ఎస్.వరలక్ష్మి పాడిన అపురూపమైన పాటలు కొన్ని అందిస్తూ పరుచూరి శ్రీనివాస్ శబ్దతరంగాలలో; ఇంకా కవితలు, వ్యాసాలూ, శీర్షికలూ....
!!!ఈమాట పాఠకులకు, రచయితలకు, సమీక్షకులకు, వ్యాఖ్యాతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!తెలుగు కవిత్వానికి ఒక వినూత్న విభిన్న దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా మహా ప్రస్థాన కవితా విరించిని వీలైనంత సంపూర్ణంగా పునఃపరిచయం చేసే సంకల్పంతో కొన్ని పాత, కొన్ని కొత్త విశ్లేషణా విమర్శా వ్యాసాలను ప్రచురిస్తున్నాం. శ్రీశ్రీతో జరిగిన చర్చల ఆడియో రూపకాలు, శ్రీశ్రీ ఉపన్యాసం, కవితా పఠనపు వీడియోలూ, శ్రీశ్రీ కవితకి బాపూ బొమ్మల సంకలనం ఈమాట పాఠకులకి ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తున్నాం.…
గతశతాబ్దపు సాహిత్యకారుల్లో ప్రముఖుడిగా పేరెన్నిక గన్న కొడవటిగంటి కుటుంబరావు గారి (అక్టోబర్ 28, 1909 - ఆగస్ట్ 17, 1980) శతజయంతిని పురస్కరించుకొని ఈ ఈమాటను కొ.కు స్మారక ప్రత్యేక సంచికగా మీకు సమర్పిస్తున్నాం. కొడవటిగంటి రాసిన ఉత్తరాలు, విమర్శకుల వ్యాసాలు, పాలగుమ్మి రేడియో చర్చ, అలాగే రోహిణీప్రసాద్, లక్ష్మన్న, హనుమంతరావుల కొత్త వ్యాసాలు ఈ సంచిక ప్రత్యేకం. ఇంకా...
సెప్టెంబరు 2009 సంచికలో మీకోసం - శ్రీమతి డీ. కే. పట్టమ్మాళ్ స్మృత్యర్థం గొర్తి బ్రహ్మానందం వ్యాసం కంచి పట్టు కచేరీ; ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది - వేమూరి వెంకటేశ్వర రావు వ్యాసం; శాశ్వత్, వింధ్యవాసిని కన్నడ మూలం నుంచి అనువాదం చేసిన కథ కెంధూళి; పాబ్లో నెరూడా కవితకు తెనుగు సేత ఈ రాత్రి నేను రాయగలను - బొల్లోజు బాబా కవిత.