ఈమాట మే 2011 సంచికకు స్వాగతం!!


రవీంద్రనాథ్ టాగోర్
(7 మే 1861 – 7 ఆగస్ట్ 1941)

విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ 150వ జన్మదిన వార్షికోత్సవం భారత బంగ్లా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ఉత్సవ మండలి పర్యవేక్షణలో, మే 7 – మే 9లలో శాంతినికేతనంలో నిర్వహించ బడుతున్నది. సందర్భంగా మే 7న ఈ కవయిత్రి కేతకి కుషారి డైసన్ చేసిన టాగోర్ కవితల అనువాదాల సంకలనం పెంగ్విన్ ఇండియా వారు విడుదల చేస్తున్నారు. శాంతినికేతన ప్రాంగణంలో టాగోర్ పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ కవులచే గీతాంజలి కవితల పఠనం, రవీంద్ర సంగీత గానసభ, టాగోర్ నాటక ప్రదర్శన, టాగోర్ కవిత్వ పునర్మూల్యాంకనం, వాచికాంజలి, నృత్యాంజలి, కావ్యాంజలి తదితర సాహిత్య లలిత కళా కార్యక్రమాలను ప్రదర్శించబోతున్నారు.


  • ఇంద్రాణి, సుబ్రహ్మణ్యం, స్వాతికుమారి, దేశికాచారి కవితలు; సాయి బ్రహ్మానందం చెప్పే కోనసీమ కథ; గిరిధరరావు చెప్పిన ‘నల్లతోలు’ కథ నచ్చిన కారణం; సోమ శంకర్ అనువాద కథ గాంధీ అభిమాని.
  • పలుకుబడి లో వ్యుత్పత్తి, నిరుక్తములపై సురేశ్ కొలిచాల భాషా శాస్త్ర వ్యాసం; కనకప్రసాద్ సాహిత్య చింతన ‘మూడు లాంతర్లలో మరొక భాగం; మందుల పరిశోధన గురించి మోహనరావు వ్యాసం; బృందావనరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం.
  • మోహనరావు టాగోర్ గీతాలకు చేసిన అనువాదాలు, మాతృకలు; శ్రీనివాస్ సేకరించి పంపిన కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం లోపలి పిలుపు విని, ఈ సంచికలో మీకోసం.