ఇటాలియన్ ఆపెరా రచయిత ద పోన్తె (Da Ponte), సంగీత స్వరకర్త మొజార్ట్ (Mozart) కలయికలో వచ్చిన మూడు రూపకాలు -- లె నోట్జె ది ఫిగారొ, దాన్ జియోవాన్ని, కొసీ ఫాన్ తుత్తె-- 18వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా బహుళ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉన్నాయి. వీటిలో మూడవదైన కొసీ ఫాన్ తుత్తె (Così fan tutte) రెండు జంటల మధ్య జరిగిన కథ. తమ ప్రియురాళ్ళ ప్రేమకు ఇద్దరు యువకులు పెట్టిన పరీక్ష. ఒక హాస్య…
Category Archive: ముందుమాట
జీవితంలో అత్యున్నత పీఠాల్ని, పురస్కారాల్ని, డబ్బుని అలా చూసి ఇలా వద్దనుకుని చిన్నారి పొన్నారి చంటి పిల్లలకోసమని వెనక్కి మళ్ళి, జీవితాంతం చిన్నపిల్లల కోసం బొమ్మలు వేసిన ఒక రంగు సుద్ద ముక్క వంటి మెత్తని చిత్రకారుడి కథ ఇది--అంటూ, మన దేశంలోని మొదటితరం బాలసాహిత్య చిత్రకారుల్లో ఒకరయిన పులక్ బిశ్వాస్ (1941-2013) గురించి ఆర్టిస్ట్ అన్వర్ ఆత్మీయ వ్యాసం రంగు బలపం-పులక్ బిశ్వాస్; తన సిలబస్‌లో స్కెచింగ్ గురించి సూచనలు, వంటరి జీవితంలోకి ఇల్లామై అని…
భారతీయ చిత్రకళ ఆధునికతా స్వరూపాన్ని మార్చిన వ్యక్తిగా, భిన్న సంస్కృతులు కలిసిన అనుభవంతో తనదే అయిన పంథా పాటించిన అసమాన కళాకారిణిగా, ఒక స్వేచ్ఛాజీవిగా, ఇండియన్ ఫ్రిదా కాలో అని అభివర్ణింపబడిన అమృత షెర్-గిల్ (1913-41) చిత్రకళాభిమానులకు చిరపరిచితమే. యూరోపియన్ ఆధునిక పద్ధతులతో, గొగేన్, మొదిల్యాని తదితరుల ప్రభావంలో పారిస్ కళావాతావరణంలో మెరుగులు దిద్దుకున్న అమృత చిత్రకళ ఆపైన అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రాలు, మొఘలాయి మినియేచర్లు, దాక్షిణాత్య చిత్రశిల్పాలు, ఫ్రెస్కోలు, తదితర దేశీయ చిత్రకళలను లోతుగా ఆకళింపు…
ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈమాట ఒక కొత్తరూపు దిద్దుకుని మాసపత్రికగా మారి, కొత్తగా మరికొన్ని కొత్త పుంతలు తొక్కి ఈ సంచికతో ఏడాది. రచయితల సహకారం, పాఠకుల ప్రోత్సాహం-- నాణ్యతతో ఏమాత్రమూ రాజీ పడకుండా ఈమాటను మాసపత్రికగా ఇక నడపగలమనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి. అందువల్ల ఇకనుంచీ కూడా ఈమాట మాసపత్రికగానే రాబోతున్నది. ఈ సాహితీప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన రచయితలకు, పాఠకులకు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువకాని కృతజ్ఞతలు మరొక్కసారి. డిటిఎల్‌సి వారి సాహిత్య…
ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నము అనే పాట 1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాలోది. రాసినది ఎస్. వి. భుజంగరాయ శర్మ. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ తాత్త్విక దృక్పథాన్ని మొత్తం రంగరించి శర్మ ఈపాటలో నింపారంటారు శ్రీరమణ, శర్మగారి 92వ జయంతి (డిసెంబర్ 15న) సందర్భంగా రాసిన తన నివాళి వ్యాసంలో. అలాగే, వెంపటి చినసత్యం, పట్రాయని సంగీతరావులతో కలిసి కూచిపూడిత్రయంలో ఒకరిగా పేరుపొందిన భుజంగరాయ శర్మ తన పదం ద్వారా…
అధివాస్తవికతావాదం 1950, -60 దశకాలకల్లా సాహిత్యాన్ని దాటి చిత్రకళానాటకరంగాలలో ప్రవేశించి ఒక గొప్ప సాంస్కృతిక ప్రభంజనంగా పరిణమించింది. ఆ అధివాస్తవికోద్యమానికి పారిస్ నగరం కేంద్రం కాగా అందులో చిత్రకారుడు స్టాన్లీ హేటర్ చిత్రశాల ఆట్లియే 17 కేంద్రబిందువు అయింది. బెకెట్, పికాసో, బ్లిన్, ఆఖ్‌త్వాఁ వంటి ఎందరో కళాకారుల సమక్షంలో పెరిగిన ఆగీ హేటర్ ఒక చక్కటి కవి, రచయిత, నటుడు, అనువాదకుడుగా ఎదగడంలో ఆ దశకాల ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి పారిస్ నాటకరంగం, అబ్సర్డ్…
తెలుగు పాత్రికేయ సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడైన మోహన్ గురించి ఆయనొక కార్టూనిస్టు అనో తెలుగులో మొట్టమొదటి గ్రాఫిక్ ఆర్టిస్టు, ఆనిమేషనిస్టు అనో మాత్రమే చెప్పి ఇప్పటిదాకా ఎవరూ ఆగిపోలేదు, ఇక ఆగిపోలేరు కూడా. చక్కటి ఆర్టిస్ట్ కావడం ఆయనలో కేవలం ఒక పార్శ్వమే. సాహిత్యకారుడు, కళా విమర్శకుడూ అయిన ఆయన ఎందరు రచయితలూ కళాకారులపై ఎంత ప్రభావం చూపింది, మోహన్ ప్రాంగణం ఎలా ఎందరో సాహిత్యకళాకారులకు ఒక పిట్టలు వాలే చెట్టు అయింది, ఆ నీడన ఎన్ని…
సాహిత్య విమర్శ అనేది (మనం ప్రస్తుతం వాడుతున్న అర్థంలో) తెలుగు సాహిత్య రంగానికి స్వతస్సిద్ధమైన లక్షణం కాదు. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల వచ్చినది కావడంతో ఆ ఆధునిక విమర్శాపద్ధతులు మనకు సరిగా బోధపడలేదు, మనం అలవర్చుకోలేదు కూడా. విమర్శ సాహిత్యాన్ని నిర్వచించబూనుకోదు. ఎందుకంటే నిర్వచనాలు సాహిత్యాన్ని సంకుచితం చేస్తాయి. సిసలైన విమర్శ సాహిత్యాన్ని వివరించి విస్తరిస్తుంది. పాఠకులలో సాహిత్యాభినివేశం కలిగిస్తుంది, పెంచుతుంది. ప్రస్తుత సాహిత్యరంగంలో—పొగడ్తలు తప్ప మరేమీ స్వీకరించలేని రచయితలు; ఏ రచననైనా పొగడడం లేదా…
"నేను ఒంటరిని. మీరు ఒంటరి. మనం పరస్పరం స్పర్శించుకున్న క్షణాల్లో కూడా మనతో మన ఒంటరితనం." అని ముగిస్తాడు నడచి వెళ్ళిన దారి అనే కథను డా. వి. చంద్రశేఖరరావు. వర్తమాన తెలుగు సాహిత్యంలో అతనిది ఒక విభిన్నమైన పంథా. ఒక ప్రత్యేకమైన కథనం. కథనం గురించి ఏ వొక్కమాట అనబోయినా రూపవాదులని ముద్ర వేస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా ఆయన ప్రపంచ సాహిత్యాన్ని, ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని, లోతుగా చదువుకుని తనదంటూ ఒక అద్భుతమైన…
చెవుల్ని చితకకొట్టే సినీ సంగీతం ఓ పక్కన హోరెత్తుతున్నా ఎందరో చిన్నారులు అపురూపంగా సంప్రదాయ సంగీతం మనం చెవులు అప్పగించి వినేలా పాడటం ఎలా జరుగుతోందీ? నాటకమైనా, నాట్యమైనా, చిత్రకళయినా అన్నిటికీ ఎంతో కొంత ముచ్చట తీర్చే మార్గాలున్నాయి. ఇదే స్థితి మన ప్రాంతీయ, ప్రాచీన చిత్ర శిల్ప కళల దగ్గరికొచ్చేసరికి కథ మారింది. సంగీతం, నాట్యం, కొద్దో గొప్పో నాటకం ప్రజలకు పరిచయం అయినంతగా చిత్ర శిల్పకళలు పరిచయం అయినట్టు లేదు. అందుకని, చిన్న పిల్లలకు…
అసలు 'చూడటం' మొదలుపెడితే 'కనబడటం' మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా మన కన్నే మనకు బోలెడు చెబుతుంది. అసలు ముందస్తుగా కళాత్మకమైనవాటిని, కళాఖండాలని, తరచుగా విరివిగా చూడటం అలవాటయితే సామాన్యులనే అసమాన్యులకి 'కళ' వీలయినంత దగ్గరవుతుంది - అంటూ ఈ సంచిక నుంచి చిత్రకళను పరిచయం చేస్తూ చిత్రకారుడు, కళావిమర్శకుడు అయిన తల్లావజ్ఝుల శివాజీ కళకాలమ్; సహజమైన బంధాన్ని సంకెళ్ళతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ సృష్టినే…
తెలుగువారు ఇప్పటికీ ఎప్పటికీ గొప్పగా చెప్పుకునే మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ వంటి సినీమాలను తన కెమేరా కంటితో అంతటి కళాఖండాలుగా తీర్చిదిద్దిన ఘనత మార్కస్ బార్ట్‌లీది. ఏ డిజిటల్ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఆయన చూపిన ప్రతిభ అసమానమైంది. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో బార్ట్‌లీది ప్రముఖ పాత్ర. ఆయన శతజయంతి సందర్భంగా జెజ్జాల కృష్ణ మోహన రావు నివాళి ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ; విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం…
వసంతఋతువును వెంటబెట్టుకొని, తెలుగువారి కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా వసంతునికి, వెన్నెలఱేనికి మధ్యన పోటీ గురించి భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; వసంత తిలకమనే వృత్తం గురించి జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; అంతా కొత్తగా మొదలెడదామని కోగంటి విజయ్ కవిత; ఇంకా మరికొన్ని చక్కని కవితలు; వలసయుగంలో తెలుగు భాష, సాహిత్యదృక్పథాల్లో వచ్చిన మార్పులు, వాటికి ఎదురొడ్డి తన వాదాన్ని వినిపించిన విశ్వనాథ సాహిత్యగళం, సాహిత్య సందర్భం గురించి వెల్చేరు…
తెలుగు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో ప్రామాణికత లేమిని ఎత్తి చూపిస్తూ, "జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి." అంటూ వెల్చేరు నారాయణ రావు 1988లో తెలుగు పరిశోధన అనే పత్రికలో చేసిన చర్చ నేటికీ తన సంగతత్వాన్ని ఎంతమాత్రమూ కోల్పోలేదు. ఆ చర్చ పరిష్కృత పాఠం; బాలకథారచయితగా సుప్రసిద్ధుడైన డాక్టర్ ౙాయిస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కథల స్ఫూర్తితో లలిత టి.ఎస్. చెప్పిన అంకెల కథ; ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా…
మనకు కనిపించే వెండితెర వెలుగుల వెనుక మనకు తెలియని ఒక ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాస్తున్న తెరచాటు-వులు ఈ సంచిక నుంచి ప్రారంభం. ఈమాట కొత్త రూపం గురించి తమ అభిప్రాయాలు చెప్పిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈమాటలో ఇంకొన్ని సౌకర్యాలు చేర్చాం. ఇప్పుడు నచ్చిన రచనను అక్కడినుంచే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి వీలుగా ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ బటన్లు; సంపాదకులను సంప్రదించడానికి, మీ రచనలు పంపడానికి క్విక్…
ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈమాట ఇకనుంచీ మాసపత్రిక! ఈమాటలో కొత్త సంపాదకుల చేరిక!! మారుతున్న కాలంతో పాటుగా మార్పులు తప్పవు. ఈమాట ఇకనుంచీ మాసపత్రికగా మారుతోంది! ఐతే ఏ మార్పయినా పత్రిక నాణ్యతాప్రమాణాలను మెరుగు పరచగలగాలి లేదా కనీసం నిలపగలగాలి. ఆ ఉద్దేశంతో, ఈమాటను మాసపత్రికగా ఏడాది పాటు ఒక ప్రయోగంగా ప్రచురించాలని, ఆపైన మంచిచెడ్డలు బేరీజు వేసుకుని ఈ మార్పు శాశ్వతం చేయడమా లేదా అని నిర్ణయించాలని మా ఆలోచన. రచయితలు, పాఠకులు,…
🔸 అమెరికన్ ఫోక్ సంగీత ప్రపంచపు దిగ్గజం, వాగ్గేయకారుడు అయిన బాబ్ డిలన్ స్వతహాగా వివాదాస్పదుడు కూడా. ఆ పాటకుడిని ఈ ఏడాది సాహిత్య విభాగపు నోబెల్ బహుమతికి ఎంచుకోవడం కూడా అలాగే వివాదాలకు దారి తీసింది. బాబ్ డిలన్ కేవలం గాయకుడేనా? కవి అవునా, కాదా? అనే ప్రశ్న మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చింది. డిలన్ ఎందుకు కేవలం పాటకాడు కాదో తన అభిప్రాయం చెప్తున్నారు ఈ వ్యాసంలో వేలూరి వేంకటేశ్వరరావు. 🔸 అత్యంత లఘుకావ్యమైనా…
వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని (29 ఆగస్ట్, 1863) తెలుగు భాషోత్సవదినంగా ప్రకటించుకుని తెలుగువారు తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తిస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. గ్రాంథిక భాషను కాదని వ్యావహారికభాష తెలుగులో తెచ్చిన పెద్ద మార్పుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా -- ఈ భాషావాదాలకి ఆద్యులుగా మన మనసుల్లో స్థిరపడిపోయిన పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల రచనల వల్ల తెలుగు భాష వ్యవహారాలలో కలిగిన మార్పులేమిటి? తెలుగు భాష…
మూడువందల సంవత్సరాలకు పైగా సంఖ్యాగణిత శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఫెర్మా చివరి సిద్ధాంతాన్ని, బ్రిటన్‌కు చెందిన సర్ ఏండ్రూ వైల్స్ మొదట 1993లోనే రుజువు చేసినప్పటికీ, అందులో ఒక లొసుగు కానవచ్చింది. రిచర్డ్ టేలర్ సహకారంతో అందులోని లొసుగులు సవరించి తిరిగి 1995లో ప్రచురించి శాస్త్రప్రపంచాన్ని ఇప్పటికి పూర్తిగా ఒప్పించాడు. ఎన్నో ఏండ్ల అకుంఠిత దీక్షతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన వైల్స్ కృషికి ఫలితంగా గణితంలో నోబెల్ బహుమతితో సమానంగా గౌరవించబడే ఆబెల్ ప్రైజ్ ఈ…
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం పరిశీలనగా చదివి, పరిశోధన చేసి పిహెచ్‌డీలు సంపాదించుకున్న విద్యార్థుల్లో కొందరినీ, తెలుగుదేశంలో ప్రామాణికమైన పరిశోధన చేసిన కొందరినీ, పిలిచి అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16-17 తేదీల్లో, అధ్యాపకులు వెల్చేరు నారాయణరావు, జాయ్స్ ఫ్లూకిగర్ ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ మీద కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి పరిశోధన మార్గాలలో కొత్త పద్ధతులు అనుసరించడానికి, ఈ సంవృత సదస్సు…