పులక్ బిశ్వాస్ (1941-2013)
జీవితంలో అత్యున్నత పీఠాల్ని, పురస్కారాల్ని, డబ్బుని అలా చూసి ఇలా వద్దనుకుని చిన్నారి పొన్నారి చంటి పిల్లలకోసమని వెనక్కి మళ్ళి, జీవితాంతం చిన్నపిల్లల కోసం బొమ్మలు వేసిన ఒక రంగు సుద్ద ముక్క వంటి మెత్తని చిత్రకారుడి కథ ఇది–అంటూ, మన దేశంలోని మొదటితరం బాలసాహిత్య చిత్రకారుల్లో ఒకరయిన పులక్ బిశ్వాస్ (1941-2013) గురించి ఆర్టిస్ట్ అన్వర్ ఆత్మీయ వ్యాసం రంగు బలపం-పులక్ బిశ్వాస్; తన సిలబస్‌లో స్కెచింగ్ గురించి సూచనలు, వంటరి జీవితంలోకి ఇల్లామై అని వగచనవసరం లేకుండా కోరి జన్మతో పాటుగా తోడు తెచ్చుకున్న పవిత్ర గ్రంథం– ఇది నా ప్రేయసి, నా తల్లి, నా సహచరి, నా నేస్తం, నా ఆస్తి అంటూ తన స్కెచ్‌బుక్స్‌తో చేయిస్తున్న పరిచయం; ఉషాజ్యోతి బంధం దీర్ఘకవిత ఆకాశదీపం; చారిత్రాత్మక చారిత్రిక ఆత్మకథ సురపురం పై దాసరి అమరేంద్ర సమీక్ష; ఈ నెలలో ఉగాది పండగ వస్తోంది కాబట్టి ఆ సందర్భంగా తెలుగువారికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ భైరవభట్ల కామేశ్వరరావు ఒక విశేషంతో కూర్చిన గడి-నుడి. (ఆ విశేషమేమిటో గడి పూర్తి చేస్తేనే తెలుస్తుంది మరి!); ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు, శీర్షికలూ…
ఈ సంచికలో:
- కథలు: ‘భ్రమ’ – చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు; అప్పటికి – చంద్ర కన్నెగంటి; పిల్లర్ నం.13 – పూడూరి రాజిరెడ్డి (స్వగతం); పూర్వీకం – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); ఒక వోర – ఆర్. దమయంతి.
- కవితలు: ఆకాశదీపం – ఉషాజ్యోతి బంధం; మునిమాపు వేళకు – రేఖాజ్యోతి; పంజరపు పక్షి – విజయ్ కోగంటి (మాయా ఏన్జెలో).
- వ్యాసాలు: రంగు బలపం: పులక్ బిశ్వాస్ – అన్వర్; విమర్శ ఎందుకు? – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు; సురపురం – దాసరి అమరేంద్ర; నివేదిక: సంస్కృత సంగోష్ఠి – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి; తెలుగు కథల్లో ‘నేను’- టి. చంద్రశేఖర రెడ్డి .
- ఇతరములు: సిలబస్: 2. తొలి ప్రేమలేఖ – అన్వర్; నాకు నచ్చిన పద్యం : మెయి బూదిపూత మాగాణి – చీమలమర్రి బృందావనరావు; గడి నుడి – భైరవభట్ల కామేశ్వరరావు.