మే 2017

తెలుగువారు ఇప్పటికీ ఎప్పటికీ గొప్పగా చెప్పుకునే మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ వంటి సినీమాలను తన కెమేరా కంటితో అంతటి కళాఖండాలుగా తీర్చిదిద్దిన ఘనత మార్కస్ బార్ట్‌లీది. ఏ డిజిటల్ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఆయన చూపిన ప్రతిభ అసమానమైనది. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో బార్ట్‌లీది ప్రముఖ పాత్ర. ఆయన శతజయంతి సందర్భంగా జెజ్జాల కృష్ణ మోహన రావు నివాళి ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ; విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. అర్జునుడి రథసారథి శల్యుడు. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేసి, ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించిన ఒక చిత్రమైన కథ. అందులో ఒక అప్సరస అశ్వంగా మారిన వైనం, తద్వారా మన సంప్రదాయ కథాకథన పద్ధతినీ ప్రస్తావిస్తున్న భైరవభట్ల కామేశ్వరరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం; సాదత్ హసన్ మంటో ప్రసంగం; నవరసాల పద్య రసాయనం; మరింకా కథలు, కవితలు, వ్యాసాలూ ఈ మే మాసపు ఈమాటలో.


ఈ సంచికలో:

  • కథలు: దేహి – పూడూరి రాజిరెడ్డి; రిటర్న్ పాలసీ – అవినేని భాస్కర్ (మూలం: ఎ. ముత్తులింగం); ఒకనాటి యువ కథ: కెరటాలు పలకరించాయి – పోతుకూచి సాంబశివరావు; ఆవలి తీరం – వేమూరి వేంకటేశ్వరరావు.
  • కవితలు: రామరసాయనం – పరిమి శ్రీరామనాథ్; సగమే పూర్తయిన ఓ కవిత – విజయ్ కోగంటి; సరస్సు నవ్వు – హెచ్చార్కె; రామచంద్రపుత్ర, రామభద్ర – వాసుదేవరావు ఎరికలపూడి; అదీ నేనే… – స్వాతి శాయి యాకసిరి.
  • వ్యాసాలు, శీర్షికలు: సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు – ఏల్చూరి మురళీధరరావు; తెలుగు భాషా ప్రాచీనత – పి. వి. పరబ్రహ్మశాస్త్రి; నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం – న్యాయపతి శ్రీనివాస్; వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ! – కల్లూరి భాస్కరం; తెరచాటు-వులు: 4. మీరు సమర్థులు గాన… – శ్రీనివాస్ కంచిభొట్ల; ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ – జెజ్జాల కృష్ణ మోహన రావు; పెంపకపు మమకారం: కాళీపట్నం రామారావు కథ గురించి – ఎస్. జె. కళ్యాణి; నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస – భైరవభట్ల కామేశ్వరరావు.
  • చిత్రతరంగాలు: – In defence of freedom.
  • శబ్దతరంగాలు: ఒక పాట-రెండు బాణీలు – పరుచూరి శ్రీనివాస్.