ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి…
శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారికి సాహిత్యాభివందనాలు! నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలలకు రూపం వస్తే... అని ఒక సినీకవి ఆనాడు ఏసందర్భానికి రాశాడో కాని, ఆపాట ఈపూట ఈమాటలో మానోట పాడబడుతుందని ఆయన ఊహకు అందడం జరిగివుండదు. తెలుగు సాహిత్య అకాడెమీ కార్పొరేషన్ కో. & సన్స్ లిమిటెడ్‍కు శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారిని ఓనరుగా రాష్ట్రప్రభుత్వం నియమించడం తెలుగు (సంస్కృతానికి కూడా) భాషకు, సాహిత్యానికి ఒక అనిదంపూర్వగౌరవంగా మేము భావించడం జరిగింది. సాహిత్యరంగేతర్ అని శ్రీలక్ష్మిగారి…
తెలుగు సాహిత్యచరిత్రలో కొద్ది కథలు మాత్రమే రాసి అతి గొప్ప పేరు సంపాదించుకున్న రచయితలు కొందరున్నారు. వారందరిలోనూ కారా మాష్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావుగారు అగ్రగణ్యులుగా నిలుస్తారు. ఆయన కథల గొప్పతనాన్ని ఎందరో ప్రశంసించారు. మరెందరో తమను తాము కారా అభిమానులుగా ప్రకటించుకున్నారు. ఏ బహుకొద్దిమందో విమర్శించారు. కాని, ఆ కథల పూర్తి విస్తృతిని, వాటి లోతులను, అవి సూచించే ఐతిహ్యాలను గుర్తించి చర్చించిన పాఠకులే కాదు, రచయితలూ ఎక్కువమంది కనపడరు. కారా మాష్టారి కథలు నలుపు…
మరణ వార్తలని వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు చుట్టూ చిక్కని నల్ల బార్డరు వేయడం ఆనవాయితీ. అదెప్పుడు? లోకం కాస్తో కూస్తో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధసమయాల్లో, ప్రకృతి భీభత్సాల్లో, అల్లర్లలో మనిషి చావుకి ఒక గౌరవం ఉండదు. హోదాలుండవు. దహన సంస్కారాలు ఉండవు. కనీసం వారిని లెక్కపెట్టి అధికార గణాంకాల్లో ఆ మాత్రం ఉనికిని కూడా వారికి మిగలనివ్వరు. ఇలా అసందర్భంగా, అన్యాయంగా, అమానుషంగా, అర్థరహితంగా చనిపోయినవాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి సాహిత్యమే కాస్తన్నా మర్యాదనిస్తుంది. తెల్లబట్టలో…
ప్రతీ మనిషికీ కొన్ని అభిరుచులుంటాయి. వీటిలో చాలామటుకు ఏ ప్రయత్నాన్ని, పరిశ్రమని కోరనివి. సహజాతమైనవి. వినోదం, కాలక్షేపం వీటి ప్రధాన లక్షణాలు. కొందరు వీటినే శ్రద్ధగా గమనించుకుంటారు. అదనపు సమయాన్ని వెచ్చించి, ఈ అభిరుచులకు పదునుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా కొద్దిమంది మాత్రం మరొక్క అడుగు ముందుకువేస్తారు. సహజాతమైన అభిరుచులతో తృప్తిపడకుండా, తమకు అలవాటు లేని, నేర్చుకునేందుకు తేలిక కాని అభిరుచులను ప్రయత్న పూర్వకంగా అభివృద్ధి చేసుకుంటారు. ఈ స్థాయిలలో హెచ్చుతగ్గులు లేవు. కాని, వినగానే, చూడగానే…
ప్రతీభాషా తనదైన కొన్ని మహాకావ్యాలను తయారుచేసుకుంటుంది. తరాలు మారినా తరగని సజీవచైతన్యాన్ని తమలో నింపుకుని, చదివిన ప్రతిసారీ నూత్నమైన అనుభవాన్ని మిగులుస్తాయవి. నిత్యనూతనమైన ఆ కావ్యాలే కాలక్రమేణా క్లాసిక్స్ అని పిలవబడి ఆ భాషాసంస్కృతులలో, ఆ జాతి సంపదలో భాగమవుతాయి. ఆయా సమాజాలు ఈ సాహిత్యకావ్యసంపదను ఎలా కాపాడుకుంటున్నాయో ఎలా చదువుతున్నాయో వాటిని ఎలా తరువాతి తరాలకు అందిస్తున్నాయో గమనిస్తే, ఆ సమాజపు సాహిత్యసంస్కారం తేటతెల్లమవుతుంది. తమ తమ భాషలలోని ప్రాచీన మహాకావ్యాలను తాము నిరంతరంగా భిన్న…
తెలుగులో ఒక కవితను కాని, కావ్యాన్ని కానీ ఎలా చదవాలో చెప్పేవాళ్ళు మన సాహిత్యసమాజంలో లేరు. ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలో కారణాలు చెప్పమని అడిగితే, దాన్ని అవమానమనుకునే వాతావరణం నుండి సాహిత్యకారులు ఎడంగా జరిగినదెన్నడూ లేదు. ఒక కవిని, కావ్యాన్ని చదవకపోతే, మన జ్ఞానంలో పూడ్చుకోలేని లోటుగా ఏదో మిగిలిపోతుందని బలంగా వివరించి చెప్పగల ధైర్యవంతులు లేరు. భాష, చరిత్ర, సాహిత్యం, విమర్శ--వీటి అవసరమేమిటో, కాలానుగుణంగా వాటికి తగ్గట్టు పాఠకుడిని సన్నద్ధం చెయ్యాల్సిందెవరో మన ఆలోచనలకు…
సాహిత్యసృష్టి చాలా చిత్రమైనది, ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపగల శక్తి కలది. శతాబ్దాలుగా సాహిత్యకారులు, ఎన్నో విభిన్నమైన జీవననేపథ్యాల నుండి వచ్చి కూడా, అంతకు ఎన్నోరెట్లు విభిన్నమైన జీవనపార్శ్వాలని గమనిస్తూ కూడా, జీవితానికి ఏ లక్షణాలు ప్రాథమికమనుకుంటామో అవే సాహిత్యంలోనూ ప్రతిఫలింపజేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. సమాచారప్రసారాలు సంక్లిష్టమైన కాలంలో కూడా యుద్ధం-శోకం, ప్రేమ-పగ ఆకలి-కోరికల చుట్టూ తిరిగిన దేశదేశాల కథల మధ్య, క్లాసిక్స్ అని చెప్పబడ్డ మహోత్కృష్ట సాహిత్యం మధ్య గల సామ్యాలను విమర్శకులు…
కనీవినీ ఎరుగని రీతిలో కొరోనా వైరస్ గతసంవత్సరం ప్రపంచమంతటినీ కుదిపివేసింది. ఎన్నో వ్యాపారాలను, వృత్తులను అతలాకుతలం చేసింది. ఏ పూటకాపూట సంపాదించుకునే ఎన్నో జీవితాలను రాత్రికి రాత్రి అయోమయంలోకి నెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలకు పేదప్రజలు ఆటబొమ్మలేనని పాశవికంగా స్పష్టం చేసింది. దేశాల మధ్య, మనుష్యుల మధ్య కొత్త దూరాలు ఏర్పరచింది, కొత్త భయాలు సృష్టించింది. వెలివేత లాంటి జీవితంలో అశాంతికి, వేదనకూ గురి చేసింది. నిజానికి ఇట్లాంటి క్షణాల్లోనే మనిషి తనకు తానొక ప్రశ్నార్థకమై…
సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య…
తెలుగులో కథలూ కవితలూ వచ్చినంత ఇబ్బడిముబ్బడిగా వ్యాసాలు రావు. వస్తువు రాజకీయమైనా, సామాజికమైనా, ఉగ్రవాదమైనా, స్త్రీలపై అత్యాచారాలైనా మరింకేదైనా సరే, తెలుగు వారి భావప్రకటనకు కవితలే తొట్టతొలిదారి. లేదూ సినిమాఫక్కీలో ఎంతపెద్ద సమస్యకయినా చిటికెలో పరిష్కారం చూపించే కథలు. అంతే కాని, ఆ సంఘటనలను తార్కికంగా విశ్లేషించి నిగ్గుతేల్చే వ్యాసం మాత్రం తలపోయరు. వస్తువు పట్ల నిబద్ధత లేకపోవడం, ఆలోచనకు తావివ్వని సోమరితనం, కథాకవితాది ప్రక్రియలకు స్వీయ శైలి ముసుగులో ఎలాగైనా రాసే వీలుండటం బాహ్యకారణాలుగా కనపడుతోన్నా,…
మట్టిముద్దగాదు మహిత సత్కవి శక్తి మట్టుచున్న నణగిమణిగి యుండ/ రత్నఖచితమైన రబ్బరుబంతియై వెంటవెంట నంటి మింటికెక్కు అని ఎంత నమ్మినా, సామాజిక అసమానతలకు గురైన ఆవేదనలో, ...ఎంత రత్నకాంతి యెంత శాంతి! ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో/ పుట్టరాని చోట బుట్టుకతన అని అతను వాపోయిన మాట కూడా నిజం. ఎవడారగించు నమృతభోజనంబున గలిసెనో ఈలేమ గంజిబువ్వ/ ఎవరు వాసముసేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె? అని ప్రశ్నించిన మాటా నిజం. కాని, వీటికి అతీతంగా, గవ్వకుసాటిరాని…
భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో, ప్రత్యేకించి తెలుగుభాషాప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన వేళ్ళూనుకుంటున్న సమయంలో వారికి మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక విధివిధానాలను అర్థం అయేలా చెప్పి పరిపాలనాపద్ధతులకు సహకరించిన పండితులు, విద్యావేత్తలు అయిన స్థానికుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఉదాహరణకు, సి. పి. బ్రౌన్ గురించి మనకు తెలిసినంతగా, అతనికి ఇతోధికంగా సహాయం చేసిన తెలుగు పండితుల గురించి, వారి కృషి గురించి తెలీదు. కల్నల్ మెకంజీ పేరు మనం విన్నాం కాని అతనికి ఆ…
స్త్రీ సాహిత్యం అని ప్రత్యేకంగా విభజించి చూపించడం సాహిత్యానికి లింగభేదం ఆపాదించడంలా పైకి కనపడుతున్నా దాని ఉద్దేశ్యం అది కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, నాటుకుపోయిన మూస అభిప్రాయాలు స్త్రీని తన ఆశలు, అభిప్రాయాలు, ఆలోచనలూ సవివరంగా, నిస్సంకోచంగా చెప్పనివ్వని స్థితి నేటికీ ఉంది. ఇలాంటి వాతావరణంలో, స్త్రీ ఆంతరంగిక ఆలోచనా స్థితిని మనకేమాత్రమైనా పరిచయం చెయ్యగలిగినది సృజనాత్మకలోకంలో ఆమెకు దొరికే స్వేచ్ఛ. వాళ్ళ ఆశలనూ ఆశయాలనూ స్త్రీసహజమైన సౌకుమార్యంతో చెప్పుకున్న రచయితలను పాఠకులు, మామూలు రచయితల…
పంజరంలో బందీ అయిన పక్షి ఎందుకు పాడుతుందో తెలుసా? తన రెక్కలు కత్తిరించబడి, తన కాళ్ళకు సంకెళ్ళు వేయబడి, రగిలిపోతున్న కోపం, నిస్సహాయతల ఊచలకావల చూడలేక, ఇక వేరే దారి లేక, దూరతీరాలకు తన గొంతు చేరాలని, స్వేచ్ఛాస్వాతంత్రాల కోసం తాను పాడే పాట పదిమందికీ వినిపించాలని--అంటుంది మాయా ఏన్జెలో తన కవితలో. ఇటీవల ప్రపంచమంతా వెల్లువెత్తుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం మొదట అమెరికాలో ఇలానే గొంతు విప్పుకుంది. తరతరాలుగా లోపల వేళ్ళూనుకున్న ఆధిపత్యభావజాలం సాటి…
జాతీయ రహదారుల మీద పగిలి నెత్తురోడుతోన్న అరికాళ్ళ ముద్రలు. రోళ్ళు పగిలే ఎండల్లో నిండు నెలల గర్భిణుల నడకలు. నిలువ నీడ లేని దారుల్లో ప్రసవం. ఆగే వీల్లేని బ్రతుకుని మోసుకుంటూ తారురోడ్ల మీద పచ్చి కడుపులతో ఆ తల్లుల ఎడతెగని ప్రయాణం. గడ్డలు కట్టే రొమ్ములను నొక్కుకుంటూనే రోజుల పసిగుడ్లను హత్తుకుంటూనే కొనసాగిన నడకలు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు అందరిదీ అదే దారి. అదే వరస. ఊరెటో తెలీదు. ఇంకెంత దూరం వెళ్ళాలో లెక్కేలేదు.…
అభిరుచి, అధ్యయనం ఉన్న సంపాదకులు; భావనాగరిమ, రచనాపటిమ ఉన్న రచయితలు; ఆసక్తి గల పాఠకులతో తెలుగునాట పత్రికలకు స్వర్ణయుగమొకటి నడిచింది. అయితే రచనతో ఎదురైన సమస్యలకు ఏకపక్షంగా కత్తెర పట్టిన సంపాదకులు, తమ రచనలు వేరొకరు పరిష్కరించడం తమ ప్రతిభకు అవమానకరంగా భావించిన రచయితలు ఆనాడూ లేకపోలేరు. సాహిత్యం వ్యాపారమైన సమయంలోనే సాహిత్యంలో రాజకీయవాదాలూ ప్రబలమై ప్రచురణకర్తలే సంపాదకులూ అయినాక పత్రికల ఏకఛత్రాధిపత్యానికి రచయితలు, పాఠకులు తలొగ్గక తప్పలేదు. తిరస్కరణలు, ప్రచురణలూ ప్రశ్నార్థకంగా మారి, సమీక్షాపరిష్కరణల గురించిన…
“Each of us needs something of an island in his life—if not an actual island, at least some place, or space in time, in which to be himself, free to cultivate his differences from others" - John C. Keats. ప్రతి మనిషికీ జీవితంలో తానొక్కడూ మనగల్గిన ద్వీపపు అవసరం ఉంది, నిజంగా ద్వీపం కాకపోయినా కనీసం తనకు తానుగా ఉండగల్గిన ఒక…
సాహిత్యం అంటే ఇలానే ఉండాలి, ఇవి మాత్రమే చెప్పాలి, ఇలా మాత్రమే చెప్పాలి అన్నది కనపడని కంచె. సమాజపు కట్టుబాట్లను లెక్కచేయకుండా తమదైన అభిప్రాయాలని ధైర్యంగా వెల్లడించిన రచయితలు ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా ఎంతోమంది లేరు. అంతమాత్రాన అలా చెప్పిన వారు సమాజ వ్యతిరేకులో దేశద్రోహులో కారు. భిన్న ప్రవర్తనలను, విశ్వాసాలనూ నిరసించి హేళన చెయ్యడం, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారి పట్ల ద్వేషం కక్కడం, చివరకు హింసకు కూడా తెగించడం, మనముందున్న నేటి…
తెలుగులో మంచి కథలు లేవూ రావూ అంటాం, వస్తే మనం గుర్తు పట్టగలమా? మనకు అసలు కథ చదవడం వచ్చా? రచయిత-రచన-పాఠకుడు అని ఆగిపోతున్నాం కాని సాహిత్యంలో అటుపైన వచ్చే అతిముఖ్యమైన సాహిత్యచర్చను మనం మర్చిపోయాం. పాఠకుడు పెట్టుకున్న అద్దాలను బట్టి, రచన ఎన్నో రంగుల్లో తారసపడవచ్చు. అది సహజం. అయితే, ఈ రంగులను దాటుకుని రచనకు స్వతంత్రమైన అస్తిత్వమంటూ ఒకటి ఉంటుంది. కథ నిజంగా ఏం చెబుతున్నదన్నది పాఠకులు చూడగల్గుతున్నారా, విస్మరిస్తున్నారా, లేక తమకు నచ్చింది…