పాలగుమ్మి విశ్వనాథం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి.

ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు; రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

సినీ నటుడు నాగభూషణం నటించి సమర్పించిన సాంఘిక నాటకం రక్తకన్నీరు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత ప్రసిద్ధమైన నాటకం అది. ఎంతో అపురూపమైన ఆ నాటకం పూర్తి ఆడియో ఈమాట పాఠకుల కోసం…

ఈ సంచికలో రెండు అపురూపమైన ఉగాది కవిసమ్మేళనాలను సమర్పిస్తున్నాను. ఇవి 1964, 1969 సంవత్సరాలలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డయినవి. తల్లావఝల శివశంకరశాస్త్రి, వెంపరాల, జరుక్ శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆరుద్ర లాంటి వార్ల గొంతుకలు, వారి కవితలు వినటం ఒక ఎత్తైతే విశ్వనాథ వారి పద్యపఠనం మరొక ఎత్తు.

ది త్రిపుర 1999 ప్రారంభంలో విజయవాడలో తమ బంధువులింటికి వచ్చినప్పుడు పన్నాల సుబ్రహ్మణ్యభట్టు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించి చేసిన ఇంటర్వ్యూ. మో (వేగుంట మోహనప్రసాద్), వి. చంద్రశేఖరరావు కూడా త్రిపురగారిని ‘కదిలించారని’ జ్ఞాపకం.

సుమారు 1972-73 ప్రాంతంలో, ఈ నాటకాన్ని సత్యం రాశారు. రేడియోలో బాగా ప్రాచుర్యం పొందిన తరువాత స్టేజి నాటకంగా కూడా మలచబడి చాలా పర్యాయాలు ప్రదర్శింపబడింది. ఆయనకి బాగా పరిచయస్తులైనవారు చెప్పేదేమంటే ఆయన అమరావతి కథల కంటే ఈ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని.

అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.

ఆలిండియా రేడియో 1965లో ప్రసారం చేసిన భాస మహాకవి ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం ఆడియో, సంస్కృత, తెలుగు పాఠ సహితంగా ఈమాట పాఠకుల కోసం పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్నారు.

జువ్వాడి గౌతమరావు పద్యపఠనానికి సుప్రసిద్ధులు. వారు పఠించిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం (ఇంట్లో పాడుతుండగా రికార్డు చేసినది,) జువ్వాడి రమణ గారి సౌజన్యంతో ఈమాట పాఠకులకు అందిస్తున్నాం.

సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది.

ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ ఆది శంకరుని రచనగా భావించబడే “నిర్వాణ షట్కం” (లేక నిర్వాణ శతకం) రికార్డింగు చేయబడింది. ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.

ఈమాట కోసం ప్రొ. మలయవాసినిగారు ప్రత్యేకంగా పాడి, రికార్డ్ చేసి పంపించిన అపురూప శబ్ద తరంగం ఊర్మిళాదేవి నిద్ర అనే ఈ జానపద గీతం.

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న 1930లనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట పాడిన శ్రీమతి బి. సుబ్బులు గురించి ఇంకే వివరాలు మాకు దొరకలేదు.

రేడియోలో ప్రసారమైన శ్రవ్యరూపకాల విషయంలో సంఖ్యాపరంగా కానీ, శ్రోతల ఆదరణ విషయంలో కానీ కృష్ణశాస్త్రిగారిదే అగ్రస్థానం. ఆయన పనిచేసిన కాలంలో రికార్డయినవి చాలావరకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.