ఈ ప్రత్యేక జనరంజని కార్యక్రమంలో పెండ్యాలగారు సినీ సంగీతం గురించి, గాయకుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన వర్ధమాన గాయనీ గాయకులకు యిచ్చిన సూచనలు ఆలోచించదగ్గవి.

30 మార్చ్ 2014 ప్రచురణ: ఉగాది సందర్భంగా గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కొన్ని లలిత గేయాలు మీకోసం అందిస్తున్నాను. జయ నామ సంవత్సర శుభాకాంక్షలతో – శ్రీనివాస్.

ఆయన ప్రఖ్యాత రచన ‘శివతాండవా’న్ని ఆయనే గానం చేశారు. ఈ రచనని చాలా మంది చాలా రీతుల్లో ప్రదర్శించ ప్రయత్నించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది 1993లో నాగపద్మినిగారు ‘శివతాండవాన్ని’ రేడియో ప్రసారణ కోసం చేసిన అనుసరణ.

మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో … ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి. కానీ మీకు ఇక్కడ వినిపించబోయే జ్ఞాపకాలు వారి శతజయంతి సందర్భంలో నా నివాళి.

ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వివిధభారతి కార్యక్రమం ద్వారా సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఈమాట పాఠకులకోసం అందిస్తున్నాను.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుంచి ‘అలబేలా సజన్ ఆయో రీ’ అనే గీతం ఆధారంగా. ఈ గీతాన్ని సృజించినది మొగల్ చక్రవర్తి రోషన్ అఖ్తర్ (మొహమ్మద్ షా) ఆస్థానంలో భూపత్‌ఖాన్ అనే విద్వాంసుడని, ఆయన కలం పేరు ‘మనరంగ్’ అనీ చరిత్ర.

పాలగుమ్మి విశ్వనాథం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి.

ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు; రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

సినీ నటుడు నాగభూషణం నటించి సమర్పించిన సాంఘిక నాటకం రక్తకన్నీరు గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత ప్రసిద్ధమైన నాటకం అది. ఎంతో అపురూపమైన ఆ నాటకం పూర్తి ఆడియో ఈమాట పాఠకుల కోసం…

ఈ సంచికలో రెండు అపురూపమైన ఉగాది కవిసమ్మేళనాలను సమర్పిస్తున్నాను. ఇవి 1964, 1969 సంవత్సరాలలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో రికార్డయినవి. తల్లావఝల శివశంకరశాస్త్రి, వెంపరాల, జరుక్ శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆరుద్ర లాంటి వార్ల గొంతుకలు, వారి కవితలు వినటం ఒక ఎత్తైతే విశ్వనాథ వారి పద్యపఠనం మరొక ఎత్తు.

ది త్రిపుర 1999 ప్రారంభంలో విజయవాడలో తమ బంధువులింటికి వచ్చినప్పుడు పన్నాల సుబ్రహ్మణ్యభట్టు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించి చేసిన ఇంటర్వ్యూ. మో (వేగుంట మోహనప్రసాద్), వి. చంద్రశేఖరరావు కూడా త్రిపురగారిని ‘కదిలించారని’ జ్ఞాపకం.

సుమారు 1972-73 ప్రాంతంలో, ఈ నాటకాన్ని సత్యం రాశారు. రేడియోలో బాగా ప్రాచుర్యం పొందిన తరువాత స్టేజి నాటకంగా కూడా మలచబడి చాలా పర్యాయాలు ప్రదర్శింపబడింది. ఆయనకి బాగా పరిచయస్తులైనవారు చెప్పేదేమంటే ఆయన అమరావతి కథల కంటే ఈ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని.

అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.

ఆలిండియా రేడియో 1965లో ప్రసారం చేసిన భాస మహాకవి ప్రతిమా నాటకం నుంచి ఒక సన్నివేశం ఆడియో, సంస్కృత, తెలుగు పాఠ సహితంగా ఈమాట పాఠకుల కోసం పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్నారు.

జువ్వాడి గౌతమరావు పద్యపఠనానికి సుప్రసిద్ధులు. వారు పఠించిన రుక్మిణీ కళ్యాణం పూర్తి పాఠం (ఇంట్లో పాడుతుండగా రికార్డు చేసినది,) జువ్వాడి రమణ గారి సౌజన్యంతో ఈమాట పాఠకులకు అందిస్తున్నాం.

సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది.