రచయిత వివరాలు

సాయి పద్మ

పూర్తిపేరు: సాయి పద్మ
ఇతరపేర్లు:
సొంత ఊరు: గజపతినగరం అనే పల్లెటూరు. విజయనగరంకి ప్రక్కనే.
ప్రస్తుత నివాసం: విశాఖపట్నం
వృత్తి:
ఇష్టమైన రచయితలు: బాగా రాసే అందరూనూ (మానవత్వం ఉండే రచనలు, సున్నితంగా అవిష్కరించేవి ఎక్కువ ఇష్టం).
హాబీలు: సంగీతం. పాడటం , నేర్చుకోవటం రాయటం కూడా. సంఘ సేవ
సొంత వెబ్ సైటు: http://www.globalaid.in
రచయిత గురించి: రచయిత మాటల్లో "ఎవరి గురించైనా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఒక్కో సారి ఏమీ ఉండదు. చెప్పాలనుకున్నవన్నీ నా కవితల్లో అక్కడక్కడా అప్పుడప్పుడూ తొంగి చూస్తూ, ఒక్కోసారి నేను జాగ్రత్తగా వేసుకున్న లౌక్యపు పరదాలను దాటి, వాటి మాట నన్ను వినమంటాయి. అలా వినే ప్రయత్నాలే ఇవి!" సొంత బ్లాగు: తమ్మి మొగ్గలు

 

క్లిక్ మని శబ్దంతో డిస్కనెక్ట్ చేసిన టోన్ వచ్చింది. గౌతమ్‌కి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఒక్కసారి గడియారాలన్నీ కదలటం మొదలెట్టాయి. కేవలం శబ్దమే. సమయం కదలటం లేదు. వెన్నులో చలి పుట్టటం అంటే ఏమిటో మొదటి సారి అనుభవం లోకి వచ్చింది. అన్ని గడియారాల కదలిక గుండెల్లో దడ పుట్టించేదిగా అనిపించింది.

నెరవేరని కాంక్షలతో సహజీవనం
కన్నీరుతో చిరునవ్వుతో సహజీవనం
పట్టువిడుపులు తెలియని స్వార్ధపు బిగింపులతో
జనం మెచ్చిన చట్రాలతో సహజీవనం