కానీ తిరిగి చిగురవ్వడానికే
కొంచెం ఊపిరి పోసుకోవాలి
ఇంకొంచెం రేపటిని కలగనాలి
ఒంటరి శరమై లోలోన
ఒక యుద్దం పరంపరవ్వాలి
గెలవాలి. వెల్తురు చీలిక చూడాలి
రచయిత వివరాలు
పూర్తిపేరు: శ్రీ వశిష్ఠ సోమేపల్లిఇతరపేర్లు:
సొంత ఊరు: గుంటూరు
ప్రస్తుత నివాసం: గుంటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు: ఫొటోగ్రఫీ, కవిత్వం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
శ్రీ వశిష్ఠ సోమేపల్లి రచనలు
ఇది
మిణుగురు గుండెలోని
ఉదయపు వేడీ
రాత్రుల చీకటీ
ఊగే చెట్లూ, పారే వ్యర్ధాలూ
ఊపిరాడనివ్వని కమరుతో పాటు
తనకంటూ దాచుకున్న గుప్పెడు గాలి.
కానీ
ఎప్పట్లాగా అప్పటి నేను ఎగరలేదు
మళ్ళీ చిగురవ్వలేదు…
కళ్ళు నలిపాక వాడిపోనూలేదు.
ఈసారి ఇప్పటి నేనే
మళ్ళీ కొత్తగా మోడవ్వక్కర్లేదు!
ఎక్కడో ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది
ఇంకెక్కడో రెక్కలు ముడిచిన పావురం మాటలు వినిపిస్తాయి
మహానగరపు ఖాళీలేనితనం
గోల చేస్తూనే వుంటుంది
గదిలో మాత్రం
నిశ్శబ్దపు పోట్లు.