రచయిత వివరాలు

రాధ మండువ

పూర్తిపేరు: రాధ మండువ
ఇతరపేర్లు:
సొంత ఊరు: మండువవారిపాలెం, ప్రకాశం జిల్లా.
ప్రస్తుత నివాసం: రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు: పుస్తకాలు చదవడం, పిల్లలకి కథలు చదివి వినిపించడం, వాళ్ళ చేత కథలు రాయించడం.
సొంత వెబ్ సైటు: radhamanduva.blogspot.com
రచయిత గురించి: భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి.

 

ఉద్యోగం లేదని చిరాకు ఒక వైపు. ఆమె నన్ను తనింట్లోకి రానియ్యకుండా నా ముఖం మీదే తలుపులు మూసేసిందని దిగులు మరో వైపు. ఆమెని అల్లరి చేశాను, ఆమె తోనే ఉండాలని, ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనిపించి పిచ్చి పట్టినట్లయి ఆమెని ఎన్ని మాటలో అన్నాను. నేనట్లా మాట్లాడినా కూడా ఆమెకి నా మీద అంతే అభిమానం వుండింది. తను నాతో మాట్లాడకపోయినా తమ్ముడి చేత ఫోన్లు చేపిస్తూ నన్ను వచ్చేయమని అడిగిస్తూనే ఉంది.

తనడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏమీ లేదు. హద్దులు లేని మంచితనం, స్నేహం, అభిమానం, సహాయం ఆవిడ అని నాకూ తెలుసు. కాని ఇదేమిటి ఈ రోజు నాలో ఇంత ఈర్ష్యని కలగచేస్తుంది? లోపం నాలోనా లేక ఆవిడ లోనా? అసలు ఇక్కడ నాకు జరిగే హాని ఏమిటి? ఆవిడ స్త్రీ కాబట్టి ఈయనతో స్నేహం చేయకూడదా? అది ధర్మానికి విరుద్ధమా? ఆ స్నేహం నా భర్తతో కాకుంటే నా ఆలోచన ఇలానే ఉండేదా?

నా ఒళ్ళో నుంచి జారిపడ్డ గుండ్రటి గంగిరేణు కాయలను ఏరుకుంటూ తల ఎత్తి నా వైపు చూశాడు చిలిపిగా. అతని కళ్ళల్లో వచ్చిన ఆ మెరుపు దేని తాలూకుదో నాకు తెలుసు. పుస్తకాలు చదివిన నాకు ఆమాత్రం తెలీదా. కాని నాకెమంత గొప్పగా అనిపించలేదు. మూతి ముడుచుకుని వాళ్ళతో ఒక్కమాట కూడా చెప్పకుండా వచ్చేశాను.

గూటికి చేరిన పక్షులు తమ పిల్లలకి కబుర్లు చెప్తూ పగలంతా వెతికి తెచ్చిన పళ్ళని తినిపిస్తున్నాయి. పక్షిపిల్లల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. ఆమె తల ఎంతకీ పైకెత్తడం లేదు. పొందిగ్గా, ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె రూపం ఆకర్షిస్తోంది. ఆ పూర్తి రూపాన్ని నా గుండెల్లో దాచుకోవాలనే తపన నన్ను దహించివేస్తోంది.