రచయిత వివరాలు

పూర్తిపేరు: పన్యాల జగన్నాథ్ దాస్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

పొదుపు చేసుకున్న‌
ప‌దాల‌ను ఖ‌ర్చుచేసి,
పాన‌శాల‌కు వెలుప‌ల‌
కాసింత మైకాన్ని కొనుక్కున్నాను.
అదుపు చేసుకోలేని
అనుభూతిని దాచిపెట్టి
పాఠ‌శాల‌కు అవ‌త‌ల‌
త‌గినంత క‌వ‌నాన్ని క‌నుక్కున్నాను.

చివ‌రికొచ్చిన క‌థ‌
కంచికి చేర‌లేదింకా-
తుదిని మొద‌లెట్ట‌లేక
తాక‌రాని తేనెతుట్టెను త‌ట్టి లేపుతోంది.

మ‌ర‌పుకొచ్చిన క‌ల‌
స్మృతిని వ‌ద‌ల‌లేదింకా-

చీక‌టి రాత్రి చిక్క‌బ‌డ‌క ముందే
గ్ర‌హ‌పాటుగా నా గుండెనెండ‌బెట్టుకుంటా.
చుక్క‌పొడుపు పొడిచేలోపే
ఏమ‌రుపాటుగా నా ఆశ‌లార్చుకుంటా.

గాలి దారిమ‌ళ్ళి గాయాలు రేపిన‌ప్పుడు,
న‌డిక‌డ‌లిలో నెత్తురు పోటెత్తిన‌ప్పుడు,
పోటెత్తిన నెత్తుటిలో
క‌ష్టాల కాగిత‌ప్ప‌డ‌వ‌లు విడిచినప్పుడు-
అప్పుడు కూడా
నేను నేనుగానే ఉండేవాణ్ణి.

మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మ‌నోహ‌ర‌మైన మ‌రీచిక‌ల‌ను,
మ‌రులుగొలిపే మ‌ధుమాసాల‌ను.

మ‌ళ్ళీ మ‌ళ్ళీ క‌ల‌గంటాను.
మధురాధ‌ర మంద‌హాసాల‌ను,
మ‌త్తిల్ల‌జేసే మ‌ల‌యానిలాల‌ను.