శీతాకాలపు సాయంత్రం
ఆకులన్నీ రాలిన
శిఖరాగ్రపు చెట్టు కొమ్మమీద కూర్చుని
లోయల లోతుల్లోకి
తదేకంగా చూస్తూ…
ఒంటరి పిట్ట
చటుక్కున
ఎటో ఎగిరిపోయింది
రాలిన కొన్ని
పసిడి వన్నె రెక్కల్ని
ప్రపంచం
కళ్ళకద్దుకుంది!
శీతాకాలపు సాయంత్రం
ఆకులన్నీ రాలిన
శిఖరాగ్రపు చెట్టు కొమ్మమీద కూర్చుని
లోయల లోతుల్లోకి
తదేకంగా చూస్తూ…
ఒంటరి పిట్ట
చటుక్కున
ఎటో ఎగిరిపోయింది
రాలిన కొన్ని
పసిడి వన్నె రెక్కల్ని
ప్రపంచం
కళ్ళకద్దుకుంది!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి:
2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొక దివ్వెగా” నవల (2019), “సెలయేటి సవ్వడి” కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.
... పూర్తిగా »