రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ముద్ర

రచన: పద్మావతి రాంభక్త
ఆగస్ట్ 2024

వచ్చిన ప్రతివారు
ఒక ముద్ర వదిలే పోతారు

కొన్ని తలుపులు తీసో
మరికొన్ని కిటికీలు మూసో
మనలోకి నదులను వంపో
మనలను సముద్రాలను చేసో వెడతారు

కొన్నిసార్లు
గుండెను తొక్కుకుంటూ వెడతారు
ఒకోసారి పగిలిన అద్దాలకు
అతుకులేసి వెడతారు

కొందరు
అందమైన రంగులను పులిమి
సీతాకోకలను చేసి ఎగరేస్తారు
మరి కొందరు
నడివేసవిలో నిప్పులు చల్లి
కొలిమిని రాజేస్తారు
చిరునవ్వుపొదలను
చాటు చేసుకుని
అదాటున కాటేస్తారు

స్నేహితులుగానో
రక్తబంధాలుగానో
ఆఖరికి శత్రువుగానో
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో అక్కడ
పెదవులపై పేరై వెలుగుతారు
మాటల్లో నలుగుతారు

ఇక్కడ అడుగు మోపిన ప్రతివారు
తమదైన ఒక ముద్ర
తప్పక వదలిపోతారు
అవే కదా
మొలకలై మానులై వనాలై
పుష్పించేది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అప్పుడిక
  • బాల్కనీ అతిథులు
  • ఒక్కోసారి
  • నిరీక్షణ
  • తెరుచుకోవు

ఇటువంటివే…

  1. అనుభవం- జ్ఞాపకం
  2. భయోద్విగ్నక్షణంలో
  3. నడిరేయి
  4. హిమబిందు
  5. ఊగిసలాట

ఆగస్ట్ 2024 సంచికలో ...

  • ఆగస్ట్ 2024
  • ఆమె – దాసు
  • ఒంటరి మరణం
  • కరుణశ్రీ: తపోభంగము
  • కొళాయిలో నీళ్ళు వచ్చినవి
  • కోట
  • తాళపత్రాల మీద కవిత్వం
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 6
  • దొంగముద్దు
  • నడిరేయి
  • బాధిత స్వరం
  • మధుమేహం – రక్తపోటు 2
  • ముద్ర
  • యూట్యూబ్‍లో ఈమాట: జూలై 2024
  • వాయవ్య అమెరికా వసంతం
  • షాపింగ్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నడిరేయి
షాపింగ్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.