ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు

ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు

సంగీతం, గానం: నచికేత యక్కుండి
రచన: కనక ప్రసాద్
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.

సాహిత్యం

పల్లవి:
ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు
రగిలే ఎడారిలో
మిగిలే నిరాశలో
పొగిలే విరాగికి
అగుపించని సహాయమై వాలు            |ఒగి|
చరణం:
అమవత్ తమోమయాంతరంగాన
క్రమ శేముషీ ప్రదీప్తమై లోన
నిశి దినము నీ దృగంచలం పైన
ఒగి నీ దయార్ద్ర దృక్కదే చాలు            |ఒగి|
చరణం:
అదిరే పెదాలపై అదే మాట
మదిలో అనాది నీవనే చోట
చెడి ఈ హృదాలయం చెఱై పోగా
వణికే స్వరాన వేడ్కొనే పాట            |ఒగి|
చరణం:
ఈ జీవనార్ణవము
ఆభీల నీరవము
ఏకాంత హారవము
జగమే భయార్తమై మనే తావు            |ఒగి|

“I dedicate this song to the memory of my dear uncle, whom I affectionately called ‘Raja Mama,’ and who passed away very recently. Raja Mama was an ardent connoisseur of music and he especially loved to listen to me sing.” – నచికేత యక్కుండి.



రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్‌ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...


నచికేత యక్కుండి

రచయిత నచికేత యక్కుండి గురించి:

కర్ణాటకకు చెందిన నచికేత శర్మ యక్కుండి ప్రసిద్ధ భారతీయ హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు, సంగీత దర్శకుడు, ఇంజనీర్. ప్రస్తుతం అమెరికాలో హిందుస్తానీ సంగీత ప్రదర్శనలు ఇస్తూ, సంగీత ప్రియులకు శిక్షణ ఇస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ థియేటర్ సంస్థ ‘నాటక్’ (Naatak) కోసం ఆయన దాదాపు 5 నాటకాలకు సంగీతాన్ని సమకూర్చడమే కాక, ప్రధాన గాయకుడిగా కూడా పనిచేశారు.

 ...