రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఉండి ఉంటే…

రచన: విజయ కర్రా
ఆగస్ట్ 2023

జేగంటల సవ్వడి – మేఘాలనందుకున్న గాలి గోపురం
అదిగో ఆ కొండపై వెలసిన మందిరం
బాల్యంలోనో కలలోనో – చూసినట్లే జ్ఞాపకం.

మెట్ల మీద లయగా నా మెట్టెల ధ్వని
పాదరక్షలు లేని కాళ్ళకి చీరకుచ్చిళ్ళే గొడుగు
కంటి చూపుకి లంకె వేసే ఇరు వైపుల పచ్చదనం
నడక ఆగి సేద తీరి – అచ్చంగా నాదనిపించే సమయం.

మెడలో పచ్చని పసుపు తాడు – చేతిలో చెయ్యి. వారితో పాటు కొన్ని నవ్వులేవో క్రిందకి దొర్లిస్తూ సులువుగా దిగి వస్తున్న కొత్త జంట.

ముందు మెట్లపైన ఎవరో ఆ నడివయసు దాటిన వ్యక్తి. మామధ్య దూరం పాతికనుండి ఇరవై మెట్లుగా మారేక్రమంలో మెరుపులా తోచింది – వెనుక నుండి అచ్చం నాన్నలా ఉన్నాడని!

నిండైన భుజాలతో కాసింత ఒంగిన వెన్ను
అలవాటుగా వేసుకునే లేత నీలి రంగు చొక్కా
ముందర జేబుకి ఇంకు పెన్ను మరక వుందో లేదో కానీ
యాబై ఏడేళ్ళ వయసులో వెళ్ళిపోకుండా వుంటే
బహుశా ఇలాగే ఉండేవాడు.

ఈ ఊహ ఇస్తున్న ఓదార్పో, అది ఇలాగే కొనసాగాలనో, ఎదుటపడి ఈ భావనలను పోగొట్టుకోలేకనో, మా మధ్య కనీస దూరం ఇలాగే వుంచే ప్రయత్నంలోనో నెమ్మదించాను – ఆగి కదిలాను.

ఈ ఆఖరి పిల్ల కూడా గట్టెక్కి వుంటే బావుండునని
ఇరవై ఏళ్ళ క్రితం బెంగపడిన నాన్న
కాల నిర్ణయానికి వెళ్ళిపోయిన నాన్న.

అలా వెళ్ళకుండా ఉండి ఉంటే పదేళ్ళక్రితం అన్నావదినల బదులు అమ్మతో కలిసి నా కల్యాణం జరిపించి ఉండే నాన్న – ఉండి ఉంటే బహుశా ఇలాగే ఉండేవాడు. అమ్మ పక్కన కూర్చుని – ఆకు వక్కలు పేర్చి మరింత లోతు సంతరించుకున్న నుదుటి గీతలతో కుడి బుగ్గలో తాంబూలంతో బహుశా ఈ నా ఊహకి తోచినట్లే వుండేవాడు.

ఉండి ఉంటే కుదురుగా కూర్చోకుండా పరుగులు పెట్టే నా ఆరేళ్ళ కూతురుని తన నవ్వులని అమ్మతో కలిసి చూసి మురిసి అప్పటిలాగే మొహం పైకెత్తి పకపకా నవ్వేవాడు.

అలాంటి మనిషిని కోల్పోయిన అమ్మ
బోల్తా పడిన బండిని సులువుగా పైకెత్తిన అమ్మ
రెండు చక్రాలు – నాలుగు చేతులు తానే అయి జీవిత రథాన్ని నెట్టుకొచ్చిన అమ్మ.
నాన్నే ఉండి ఉంటే తన తరువాతి జీవితం అంత క్లిష్టంగా వుండేది కాదని ఏనాడూ వ్యక్తపరచని అమ్మ…

ఈ స్పృహ కలిగిన మరుక్షణం నా ఊహల నాటకానికి తెరదించుతూ – అతడు వెనుతిరిగి చూశాడు!

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    శ్యామల కల్లూరి August 2, 2023 6:53 am

    ఇప్పుడు ఉండి వుంటే… అందరూ జీవితంలో ఒక్కసారైనావెళ్లపోయిన వాళ్లనిలా తల్చుకుంటారు.

  2. 2
    Vijaya Karra August 2, 2023 4:52 pm

    మీరన్నది నిజం!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నిశిరాతిరి
  • అజ్ఞాతవాసి
  • దిల్ ధడక్‌నే దో!
  • నల్లమందు
  • (నీ)వాళ్ళు

ఇటువంటివే…

  1. ఓ నాలుగు చిన్న కవితలు
  2. Replica
  3. మినీకవితలు కొన్ని
  4. ఇంకా తెలియలే…
  5. చెప్పు చేతలు

ఆగస్ట్ 2023 సంచికలో ...

  • Replica
  • అదే కాంతి: ఒక పరిశీలన
  • అవరోధికాహరణము
  • ఆగస్ట్ 2023
  • ఉండి ఉంటే…
  • ఊహల ఊట 27
  • ఎవరో ఎందుకో నిన్ను
  • కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ
  • గడినుడి-82
  • గౙల్ ఛందస్సు
  • చెప్పు చేతలు
  • తూనీగ తూనీగ
  • నమ్రత రాసిన పద్యం
  • నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం
  • భద్దర్రావు వస్తాడు
  • మనమెరుగని మధ్య అమెరికా – 4
  • యూట్యూబ్‍లో ఈమాట: జులై 2023
  • రచయితలకు ఆహ్వానం: డయస్పోరా తెలుగు కథానిక-17
  • రెండు కవితలు
  • వేస్ట్‌ లాండ్: 4. ది ఫైర్ సెర్మన్ 1
  • సోల్జర్ చెప్పిన కథలు: నేరము-శిక్ష
  • స్వీయచరిత్రలు: వలసకాలపు ఆంధ్రసమాజం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

Replica
నమ్రత రాసిన పద్యం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.