[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఈ కేబినెట్ మేకర్ ని వడ్రంగి అనకూడదు
సమాధానం: ప్రధాని
- ఒకానొక కాలం
సమాధానం: వేసవి
- విరిసిన దిరిసెనలో వెనుకటి భాగ్యం
సమాధానం: సిరి
- నడిచేది నాలుగోవంతు
సమాధానం: పాదం
- తార (తెరమీద కాదు)
సమాధానం: మఖ
- వెన్నెలతో పోలుస్తారు (తలకిందులు)
సమాధానం: వ్వునలే
- రీతికి మారు పేరు
సమాధానం: తీరు
- నరస భూపాలీయంలో నలిగిన అభిరుచి
సమాధానం: రసన
- విలాసం చిరునామా కాదు
సమాధానం: రువారం
- పరమ భాగవతోత్తముడు
సమాధానం: పోతన
- పడితే కడతేరినట్లే
సమాధానం: పిడుగు
- తోక తెగిన రచయిత సంఖ్య
సమాధానం: ఆరు
- వంచనాశిల్పి
సమాధానం: టక్కరి
- బంధించు (తలకిందులు)
సమాధానం: ట్టుక
- కొండకి నేస్తం?
సమాధానం: కోన
- దూరపు కొలత
సమాధానం: కిమీ
- ఒక పండుగ
సమాధానం: సంక్రాంతి
- ఇంకొక పండుగ
సమాధానం: దసరా
నిలువు
- ఊపిరి లేని రూపు
సమాధానం: ప్రతిమ
- సగటు మానిసిలో చీకటేనా?
సమాధానం: నిసి
- వింటే అయిదవదే వినాలి
సమాధానం: వేదం
- చెవికి పని చెప్పరు.
సమాధానం: విసరు
- వడిగా
సమాధానం: రివ్వున
- కష్టం ఇతనిది ఫలితం కామందుది
సమాధానం: పాలేరు
- తీక్షణమైన సంవత్సరము
సమాధానం: ఖర
- గంగకద్దరి
సమాధానం: తీరం
- పొలిటీషియన్ల ఊతపదం
సమాధానం: సమత
- నోటి దురుసుతనం అందామా?
సమాధానం: వాగుడు
- యుద్ధానికి వెళ్ళరు
సమాధానం: పోరు
- అభినయ విశేషం
సమాధానం: నటన
- – తనం హర్షించదగనిది
సమాధానం: పిరికి
- రహస్యం
సమాధానం: గుట్టు
- అయోమయం
సమాధానం: ఆయసం
- ఉన్నారా అనే జబ్బు
సమాధానం: కలరా
- రామదాసు
సమాధానం: కోతి
- పై
సమాధానం: మీద