[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఏ పక్షి ఒంటరి
సమాధానం: ఏకాకి
- ఇది చెయ్యడం మన విస్తరిముందు
సమాధానం: మనవి
- పిల్లికి బిచ్చం పెట్టడు
సమాధానం: లోభి
- సంపెంగవనంలోని తిరిగీ దుఖమా ?
సమాధానం: వగ
- ఇక్కడే నా ఈతకు ముందు మేత
సమాధానం: లంక
- తేనే తాగే ఛందోవిశేషం
సమాధానం: షట్పది
- మతం మార్కు ప్రసాదం
సమాధానం: మత్తు
- ఇంగ్లీషు ఔషధం
సమాధానం: టానిక్కు
- ఆప్రాచీనం
సమాధానం: నవీనం
- కొత్త దారిలో కాదు, పాత రస్తాలో బయటపడుతుంది
సమాధానం: పాతర
- మూడువందలు
సమాధానం: త్రిశతీ
- భూమి విషయంలో ఒప్పందం
సమాధానం: కౌలు
- గ్రహణం ముగింపు
సమాధానం: విడుపు
- తెనాలి రామలింగని రచనల్లోనిది.
సమాధానం: గని
- కొన్ని ఉపన్యాసాల ముడిసరుకు
సమాధానం: ఊక
- ఈ రమి సుమారు
సమాధానం: రమా
- దీపానికి ముందు స్వర్గం, తర్వాత తేనీరు
సమాధానం: దివిటీ
- భారతంలో ఒకరాజు
సమాధానం: యయాతి
నిలువు
- అడవి మృగం
సమాధానం: ఏకలం
- దూరం! భారం!
సమాధానం: కిలో
- సింహాలుకు జూలుండును
సమాధానం: మగ
- తీగకాని తీగ
సమాధానం: విద్యుత్తు
- నేటివు డాక్టరు
సమాధానం: భిషక్కు
- దగ్గర బంధువు
సమాధానం: వదిన
- అయ్యో!
సమాధానం: కటా
- నీవు, నేను, అదీ వాడూ!
సమాధానం: మనం
- చండశాసనుడు
సమాధానం: నియంత
- సారాకొట్లో వేదాంతి (చూ.కన్యాశుల్కం)
సమాధానం: వీరేశ
- భాగం తాగవచ్చు
సమాధానం: పాలు
- భారవి కవిత్వంలో కంచుకం
సమాధానం: రవిక
- ఒక రాష్ట్రం
సమాధానం: త్రిపుర
- 4 నిలువు
సమాధానం: తీగ
- కార్తిక పూర్ణిమ
సమాధానం: కౌముది
- నియమమే భాగ్యం
సమాధానం: నియతి
- టీ తోటల చల్లని సిటీ
సమాధానం: ఊటీ
- బుద్ధుని తల్లి తాడును చూసి పాము అని భ్రమపడటం
సమాధానం: మాయ