గడినుడి – 34 సమాధానాలు

అడ్డం

  1. అభ్యంజనము చెయ్యాలంటే వెనుకనుండి చూడుము తీగ (5)
    సమాధానం: తలమునుక
  2. పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపించేది? (4)
    సమాధానం: పట్టుచీర
  3. నాలుక మాత్రమే పసిగట్టేది (2)
    సమాధానం: రుచి
  4. ఆరబెట్టు దిక్కు (3)
    సమాధానం: తూరుపు
  5. 32 నిలువులోనిది (4)
    సమాధానం: కంకేరువు
  6. రాజకీయపక్షాలలో తరచూ జరిగే భాగోతం (3)
    సమాధానం: చీలిక
  7. అతివ గనుక తిరిగిచూస్తే ఇవీ చూస్తాయి (4)
    సమాధానం: కనుగవ
  8. చెక్కిలిమీదున్న నుయ్యితో నీటికి కొదవలేదు కాబోలు (4)
    సమాధానం: బుగ్గబావి
  9. కాకిలో నేర్పు కొంచెం తక్కువైతే కృత్రిమంగా ఉంటుంది (5)
    సమాధానం: కాపటికము
  10. తడిసిముద్దయితే ఆ జల్లుని ఇలా అంటాం (5)
    సమాధానం: చిత్తడివాన
  11. పంది మాతృక (3)
    సమాధానం: వారాహి
  12. రామి మనవలను చేర్చుకుని జరుపుకునే ఉత్సవం (5)
    సమాధానం: రామనవమి
  13. పాలిక మాల ధరించిన సర్వజ్ఞుడు (3,2)
    సమాధానం: కపాలమాలి
  14. “తెలివిలేని వాళ్ళు” అనిపించినా శిరోజాలని కట్టిపడేసేవి (3)
    సమాధానం: జడలు
  15. నాది నయము కాకపోతే సూర్యపుత్రి ఏరు అవుతుంది (5)
    సమాధానం: యమునానది
  16. కంకులు రాటకి కట్టే రాక్షస స్త్రీ (5)
    సమాధానం: కంటకురాలు
  17. జక్కవపక్షి గురించి తెలుసుకోవాలంటే ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవిగారిని అడగాలి! (4)
    సమాధానం: చక్రవాకం
  18. జంబూ ద్వీపం (4)
    సమాధానం: తొలుదీవి
  19. ఏడ్పు కన్నీరు (3)
    సమాధానం: రోదన
  20. నీడ ఒక సంవత్సరంలా వెంబడిస్తుంది (4)
    సమాధానం: భావానుగ
  21. బాపిరాజు అరణ్యం! (3)
    సమాధానం: అడివి
  22. కారం కలిస్తే మాట చమత్కారమౌతుంది. (2)
    సమాధానం: నుడి
  23. వెన్నెముక టకీమని విరిగి తలకిందులుగా పడితే పురుగు బయటపడింది (4)
    సమాధానం: కీటకము
  24. మోసం చేసేవాడు పుణ్యక్షేత్రాలకి వెళ్ళక్కర్లేకుండానే పెట్టేవి (5)
    సమాధానం: పంగనామాలు

నిలువు

  1. సుడిగాలి గబ్బిలం (5)
    సమాధానం: తరుతూలిక
  2. ఇది చెల్లిస్తేనే దేవత కటాక్షిస్తుంది (3)
    సమాధానం: ముడుపు
  3. ఒక రకం చుక్క – కరక్కాయ నీటితో వ్రాసిన కొన (4)
    సమాధానం: కరకంచు
  4. ఆకుపచ్చని వికసించని పుష్పం (5)
    సమాధానం: పసరుమొగ్గ
  5. చిట్టడవిలో దూరలేనిది (2)
    సమాధానం: చీమ
  6. చి. చీ..కమ్మటి గాఢాంధకారము (5)
    సమాధానం: చిమ్మచీకటి
  7. వేకువజామున కూసే ప్రాణి (5)
    సమాధానం: ఉషాకలము
  8. హి! అవి వాతలు! దారితప్పిన పెళ్ళికాని వనితలు (6)
    సమాధానం: అవివాహితలు
  9. ఊసుపోక కబుర్లు (7)
    సమాధానం: లోకాభిరామాయణం
  10. సాము చెయ్యాలంటే ఇక్కడికి రావాలి (5)
    సమాధానం: గరిడిసాల
  11. వర్షం దయతలిస్తే పిట్ట హంసగా మారుతుంది (7)
    సమాధానం: వానజాలిపులుగు
  12. తామరకంటి (6)
    సమాధానం: వారిజలోచన
  13. ప్రాణశక్తి ప్రవహించే ఈ మార్గాలు కుంగిపోతే అంతం (5)
    సమాధానం: నవనాడులు
  14. చూడ్డానికి మెడలో దండలా కనిపించినా ఇదో జబ్బు (5)
    సమాధానం: కంఠరోగము
  15. అణగిమణగి పడి ఉండేది (5)
    సమాధానం: కుక్కినపేను
  16. వారి శకటము మధ్యన లేకపోతే చినుకుదారి పట్టాల్సిందే (5)
    సమాధానం: వారివాహము
  17. ఇద్దరు కవులు తిరిగితే ఆ నవ్వులధ్వని (5)
    సమాధానం: వికవికలు
  18. చూడ్డానికి వేదాధ్యయనంలా కనిపించినా లోలోపల దీనికి ద్రోహబుద్ధి ఉంటుందని లోకోక్తి (4)
    సమాధానం: కొంగజపం
  19. సందిగ్ధంలో పడితే వ్యతిరేకం కాదా? (3)
    సమాధానం: అవునా
  20. జంజాటములో దాగున్న సమం కాని దొందు (2)
    సమాధానం: జంట