పరి పరి తెఱగుల పరదేశీ
రాగం: షణ్ముఖప్రియ
తాళం: ఆది
గానం: శ్రీమతి జి. జానకి
స్వర రచన: వేంకట రామన్ సత్యనారాయణ
రచన, స్వర కల్పన: కనకప్రసాద్
సాహిత్యం
పల్లవి:
పరి పరి తెఱగుల పరదేశీ
సరిరా నీ… తిరుగాటా
సరిరా నీ… తిరుగాటా
చరణం:
అటునొక చూపూ ఇటునొక చూపూ
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత |పరి పరి|
అడఁగారదు ఈ తగులాట
అదియొక తీరూ ఇదియొక తీరూ
ముదిగారము నీ తలపోత |పరి పరి|
చరణం:
పై పై మెఱుగుల బేహారీ
ఇది కైలాటములకు మైఁపూత (2)
పైనొక తీరూ లోనొక తీరూ
నయవంచనపై మరియాద.
పొడి పొడి ౙోతల పొసగే… నా
మిడిమేలపు నీ పడి పూజ? |పరి పరి|
ఇది కైలాటములకు మైఁపూత (2)
పైనొక తీరూ లోనొక తీరూ
నయవంచనపై మరియాద.
పొడి పొడి ౙోతల పొసగే… నా
మిడిమేలపు నీ పడి పూజ? |పరి పరి|
చరణం:
అఱకొఱ చదువుల సంచారీ
ఇది నిఱునీలుగులా పెఱదారి
అటనొక మాటా ఇటనొక మాటా(2)
తటమటలన్నీ తలవంపు
నిలువున కలిగిన కన్నీరొకటి
తిరువణ్ణామల తిరుకాపు. |పరి పరి|
ఇది నిఱునీలుగులా పెఱదారి
అటనొక మాటా ఇటనొక మాటా(2)
తటమటలన్నీ తలవంపు
నిలువున కలిగిన కన్నీరొకటి
తిరువణ్ణామల తిరుకాపు. |పరి పరి|
స్వర రచన
[స్వరం పై గీత తారా స్థాయికి, క్రింద గీత మంద్ర స్థాయికి గుర్తు. స్వరాల్ని కలుపుతూ క్రింద చుక్కల గీత తాళ గతికి సూచనలు.]
స స స ని స ని ద ప మ ప ద ని ని స ప రి ప రి తె ఱ గు ల ప ర దే శీ స స స ని స ని ద ప మ ప ద ని ని స ప రి ప రి తె ఱ గు ల ప ర దే శీ ని స రి ద ని ద ప మ గ మ రి స ని ప ద ని రి స స రి; రా ; ; ; ; ; ; ; ; నీ తి రు గా టా స స స స స ని స ని ద ప మ ప ద ని గ రి స ప రి ప రి తె ఱ ; ; గు ల ప ర ; దే ; ; శీ ని స రి ద ని ద ప మ గ మ రి స ని ప ద ని రి స స రి; రా ; ; ; ; ; ; ; ; నీ తి రు గా టా ప ప ప ప ప మ గ రి స రి గ మ ప ద ప అ టు నొ క చూ పూ ఇ టు నొ క చూ పూ ప ద ని ని ద ప మ ప ద ని ని స అ డఁ గా ర దు ఈ త గు లా ట ప ప ప ప ప మ గ రి స రి గ మ ప ద ప అ టు నొ క చూ పూ ఇ టు నొ క చూ పూ ప ద ని ని ద ప మ ప ద ని ని స అ డఁ గా ర దు ఈ త గు లా ట స రి గ రి స రి స ప ద ని ద ప ద ప మ అ ది యొ క తీ రూ ఇ ది యొ క తీ రూ స స స ని స ని ద ప ప ద గ రి ని రి స ము ది ; గా ర ము ; నీ త ల పో త |పరి పరి| (మిగిలిన రెండు చరణముల స్వర రచన పై చరణముకు మల్లేనే.)
‘For Francis.’