సెప్టెంబరు 2009 ఈమాటకు స్వాగతం

ఈమాట సెప్టెంబరు 2009 సంచికకు స్వాగతం. ఈ సంచికలో మీకోసం:

అనివార్య కారణాల వల్ల కొడవళ్ళ హనుమంతరావు కంప్యూటర్ పూర్వాపరాలపై రాస్తున్న వ్యాసాలను రాయలేకపోడంతో గత రెండు సంచికలనుండీ అవి లేని లోటు మనకు తెలుస్తూనే ఉన్నది. తమ పని ఒత్తిడి తగ్గగానే ఒకటీ రెండు నెలల్లోనే మళ్ళి ఈ వ్యాస పరంపరను కొనసాగిస్తానని హనుమంతరావు తెలియచేశారు. త్వరలోనే వారు మళ్ళీ ఈ వ్యాస శీర్షికను పునరుద్ధరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.

అలానే, ఈసారి లక్ష్మన్న రాసిన పాపాయి పద్యాల వ్యాసానుబంధంగా కొడవటిగంటి రోహిణీప్రసాద్ కొన్ని సంగీతపరంగా ఆసక్తికరమైన విషయాలను, అంతే కాక పట్రాయని సంగీతరావు గారు వారికి ఒక ఉత్తరంలో ముచ్చటించిన సంగతులను పంచుకున్నారు. చదవడం మర్చిపోకండి.

మీ ఆదరాభిమానాలూ, విశ్లేషణాత్మక సద్విమర్శలూ మాకిలా కొనసాగుతూనే ఉంటాయని ఆశిస్తున్నాం.

– ఈమాట సంపాదకులు.