రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మరికొన్ని అరుదైన పాటలు

రచన: పరుచూరి శ్రీనివాస్
అక్టోబర్ 2017

ఈ సంచికలో మరికొన్ని అరుదైన పాటలు విందాం. ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోని ఒక కోరస్ పాట. దీనిలో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు. అంతకు ముందు ఆయన కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో నాటక సమాజాల్లో నాటకాలు ఆడేవారన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తరవాత కూడా ఆయన కొన్ని సినిమాల్లో – ఉదాహరణకి. మాయాలోకం (1945), ముగ్గురు మరాఠీలు (1946), పల్నాటియుద్ధం (1947), బాలరాజు (1948) – తనపై చిత్రీకరించిన పాటల్ని తానే స్వయంగా పాడుకున్నారు. ఈ సినిమాకి సంగీతం నిర్వహించింది ప్రభల సత్యనారాయణ, ఓగిరాల రామచంద్రరావు. ప్రభల తెలుగు సినిమా తొలి సంగీత దర్శకుల్లో ఒకరు, 1934లో వచ్చిన లవకుశ సినిమాకు ఆయనే సంగీత నిర్వహణ చేశారు.

  1. కౌసల్యా సుప్రజారామా
  2. //eemaata.com/Audio/oct2017/01kausalyaasuprajaa-raama_seetaaraamajananam(1944)_akkinEni-naagESwararaavu.mp3

    కౌసల్యా సుప్రజారామా: ఈ రికార్డులో మొదటి భాగం విశ్వామిత్ర పాత్రధారిపైనా (బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి, హరిశ్చంద్ర నాటక రచయితగానూ సినిమా పాటల రచయితగానూ సుప్రసిద్ధులు!) తరువాతి భాగం, గురుబ్రహ్మ రామలక్ష్మణుల పైనా (అక్కినేని, B.N.రాజు) చిత్రీకరించబడ్డాయి.

    తరువాతి 4 పాటలు టంగుటూరి సూర్యకుమారి పాడినవి. రఘుపతి రాఘవ రాజారామ్, వైష్ణవజనతో (నరసి మెహ్తా లేక నరసి భగత్ 1414-1481 రచన) పాటలు 1947-48 ప్రాంతంలో కొలంబియా లేబుల్ రికార్డుపై వచ్చాయి కానీ నాకు తెలిసినంతలో ఇంతవరకు సూర్యకుమారి పాటల సంకలనాల్లో ఎక్కడా చేర్చబడలేదు. మిగిలిన రెండు పాటలు The songs of India – Suryakumari అన్న లాంగ్ ప్లే రికార్డు పైన వచ్చినవి (Polydor కంపెనీ, 1973). సూర్యకుమారి ఇంగ్లండులో స్థిరపడిన తరువాత రెండే రికార్డులు చేశారు. మరొకటి Columbia లేబుల్‌పై 1973 లోనే వచ్చింది. ఇక్కడ మీరు వినబోయే శివోహం పాట మరొక వర్షన్, ఆకాశవాణి భక్తిరంజనిలో (1975) పాడింది, ఈమాట మార్చ్, 2012 సంచికలో విని వుంటారు. అలాగే, డూడూ వెంకన్న అన్న పాట ఆమె 1948-1950 కాలంలో 78rpm రికార్డుపైన ఇవ్వడం జరిగింది. ఆ వర్షన్ తేలికగానే అందుబాటులో ఉంది కాబట్టి మరల ఇక్కడ వినిపించడం లేదు.

  3. రఘుపతి రాఘవ రాజారామ్
  4. //eemaata.com/Audio/oct2017/02raghupati-raajaaraam_Tanguturi-Suryakumari.mp3
  5. వైష్ణవజనతో
  6. //eemaata.com/Audio/oct2017/03vaishNavajanato_Tanguturi-Suryakumari_Narasinha-Mehta.mp3
  7. శివోహం
  8. //eemaata.com/Audio/oct2017/04SivOham_Tanguturi-Suryakumari.mp3
  9. డూడూ వెంకన్న
  10. //eemaata.com/Audio/oct2017/05ANDHRA-FOLK-SONG_DooDoovenkanna_Tanguturi-Suryakumari.mp3

    చివరి మూడు పాటలు సీత, అనసూయగార్లు పాడినవి. వీటిలో, మధూదయంలో మంచి ముహూర్తం అన్న దేవులపల్లి రచన చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాటని దేవులపల్లి బెజవాడ గోపాలరెడ్డి వివాహ సందర్భంలో రాస్తే, అనసూయగారు బాణీ కట్టి పెళ్ళిలో పాడారని విన్నాను. ఇది నిజమో కాదో తెలిసిన వారు చెప్పగలరు. జాబిల్లి వస్తున్నాడు అన్న పాట రజనీకాంతరావుగారి రచన.

    శివోహం, డూడూ వెంకన్న పాటల్ని తప్పిస్తే మిగిలినవన్నీ మట్టి (78rpm) రికార్డులపైన వచ్చినవి.

  11. అన్నాడే వస్తానన్నాడే
  12. //eemaata.com/Audio/oct2017/06annaaDE-vastaanannaaDe_sita-anasuya.mp3
  13. మధూదయంలో మంచి ముహూర్తం
  14. //eemaata.com/Audio/oct2017/07madhuudayamlo-manchi-muhurtam_sita-anasuya_Devulapalli.mp3
  15. జాబిల్లి వస్తున్నాడు
  16. //eemaata.com/Audio/oct2017/08jaabilli-VastunnaaDu_sita-anasuya.mp3

    
   

8అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    amarendra dasari October 1, 2017 10:35 am

    మధూదయం గురించి విన్నాను. ఇపుదు వినగలిగాను. థాంక్సండి.

  2. 2
    నరసింగ October 1, 2017 11:05 am

    అసమాన అనసూయ అనే ఆమె స్వీయచరిత్ర లో ‘ మధూదయంలో’ పాట ప్రస్తావన చదివినట్టు గుర్తు ..ఒకసారి చూడండి.

  3. 3
    RAVI KRISHNA C October 4, 2017 5:29 am

    అలనాటి ఆ మధురిమలను అనంద డోలికల మనసు ఆర్ద్రత తో నిండింది.
    మీ ఈ సంగీత,సాహిత్య సేవలు మరువలేనివి శ్రినివాస్ గారు.

  4. 4
    విశ్వనాధ్ October 6, 2017 4:40 pm

    ఆపాత మధురాలను అందిస్తున్న శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. వీటిని download చేసుకునే అవకాశమేమైనా ఉందా? తెలియజేయగలరు.

  5. 5
    పి. వెంకట రమణ October 7, 2017 11:02 am

    అరుదైన పాటలు అందించినందులకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అడవి బాపిరాజు గారి గేయం “ప్రభువు గారికీ దణ్ణం పెట్టూ” గేయంలో సూర్యకుమారి గారు “తనన తనన” అనటం, దానికి డ్రమ్స్ బీట్ చాలా బావుంది. ఈ ఎల్. పి. రికార్డు లోని పాటలు దొరుకుతాయేమోనని నెట్లో చాలా వెతికాను. మొత్తానికి మీ సేకరణ ద్వారా వినగలిగాను, సంతోషం. అనసూయాదేవి గారి “మధూదయంలో” ఇంకో వర్షన్ “శోభనాచల” బ్లాగులో ఆగష్టు 2013 లో అలాగే “డూ డూ డూ డూ బసవన్న” పాత వర్షన్ జూన్ 2014 లో పోస్ట్ చెయ్యటం జరిగింది.

  6. 6
    lyla yerneni October 22, 2017 3:58 pm

    About these rare Telugu songs:

    గాయకుడెవరో గాని – కౌసల్యా సుప్రజా రామా! – అంటూ శ్రీరాముడిని నిద్ర లేపే విశ్వామిత్రుడి శ్లోకం చక్కగా పాడారు. కంఠం, గంభీరమూ, శ్రావ్యమూ ఐ ఉంది. పాడిన పద్ధతి అర్థవంతంగా, మధురంగా ఉంది. తల్లిదండ్రుల నుండి, మెత్తని పరుపులనుండి, వేరు చేసి తీసుకు వచ్చి, సరయూ నది ఒడ్డున, నేలపై పడుకోబెట్టిన ఇద్దరు రాకుమారులను పొద్దున్నే గురువు నిద్ర లేపాలి. ఆ రోజు వారికి దైవం నియమించిన పనులు చేయటానికి వారిని ప్రోత్సహించాలి.

    తల్లి పేరు పలుకుతూ ఆ పిల్లలను నిద్రలేపటం, ఎంతో కరుణ కలిగినది గురువు హృదయం అని తెలుపుతూనే ఉంది. ఐనా, కంఠంలో, శిష్యులకు విషాదం వినిపించనీయడు. రాముడికి తన తల్లి పేరు, లక్ష్మణుడికి రాముడి పేరూ, వినిపిస్తూ – ఏదో ఎత్తునుండి దూరంలోకి చూస్తూ, విస్తరిస్తున్న ప్రభాత సంధ్యను దర్శిస్తూ పలుకుతున్నాడు. దూరం నుంచే పలుకుతున్నాడు. గురువు చైతన్యశీలి. కార్యశాలి. అది ఒక కొత్త రోజు. కొత్త పనులు. రామలక్ష్మణులు చిన్నవాళ్లైనా వారితో పెద్ద పనులు చేయించటానికే విశ్వామిత్రుడు తీసుకు వచ్చింది. అతని గొంతు ధృడత్వం, ఆదరం, మర్యాదతో కూడి ఉండాలి. అతడి గొంతు శాసించగలిగీ ఉండాలి. ఉన్నది.

    ఈ శ్లోకం ఇంతా అంతా అందమైనదా! వినటానికి మనసు తపించి పోతుంటుంది. ఎన్నాళ్లో కొన్నాళ్లకు దూరంగా ఎక్కడి నుండో గాలిలో తేలివచ్చి పొద్దున్నే చెవుల బడితే, చాలు, దైవమా! అనిపిస్తుంది. ఈ శ్లోకం సంపూర్ణ రామాయణం సినిమాలో ఉంది. పాడినదెవరో నాకు తెలియదు. శ్రీ కృష్ణాంజయనేయ యుద్ధం సినిమా లో ఘంటసాల పాడగా వింటాము. ఇంకా, వెంకటేశ్వర సుప్రభాతం లో, మొదటి శ్లోకంగా కూడా, వేర్వేరు గొంతులలో నేను విన్నాను. ఎన్ని విధాల విన్నాగాని, మన మనసులో చూసే దృశ్యం, వినిపించే ధ్వనికి, న్యాయం జరగలేదనే అనిపిస్తుంది.

    ఇప్పుడు ఇక్కడ ఉంచిన శ్లోకం నాకు బాగుంది. గాయకుడు మరి ఎవరో! పూర్వా సంధ్యా అన్న దగ్గర పూర్వా సంధ్వా అన్నట్టుగా వినిపిస్తున్నది. అలా ఎందుకు పలికారో మరి. ‘సంధ్వా’ అని పలకటం తప్పు. ‘సంధ్య’ అనాలి, అసలు ‘సంధ్వ’ అన్న మాట లేనే లేదు, మాట సరీగా అనకపోతే నేను వినలేను అనవచ్చు కొంతమంది. అది నిజమే. ఐనా, మాటలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయనీ, ఉంటాయనీ; కొత్తమాటల పుట్టుకకు ఒక కారణం ఎక్కువమంది ఒక మాటను తప్పుగా పలకటమేననీ, బూదరాజు రాధాకృష్ణ ‘ భాషా శాస్త్ర వ్యాసాలు’ పుస్తకంలో అంటారు. అదీ నిజమేగా. సీతా, సీతా అని లవకుశ సినిమాలో, N.T.R లా పలవరించే తెలుగు వాళ్లు, ‘సీతే’ అని మరో భాషలో అంటే లేచి వెళ్లిపోతారు, అందులో ఏ తప్పూ లేకపోయినా. ఏ భాష వారికి ఆ భాష బంగారం కాబోలు.

    ఈ కౌసల్యా సుప్రజా రామా అన్న మేలుకొలుపు తప్పించి, మిగతా వేవీ నాకు నచ్చలేదు. నాకు, సీత, అనసూయలు, సూర్యకుమారి గొంతులు, పాటలు ఏం బాగులేవు. గాత్ర సంగీతం లో ముందు నచ్చవలసినది ఏమిటి? మనిషి గొంతే. అలా తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. గోపాలరత్నం కొన్నిసార్లు వేరే అనేకానేకమైన స్త్రీ గొంతుల్లో కలిసిపోతుంది. గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    ఈ తెలుగు పాటలు, పాడింది తెలుగు వాళ్లు అని వింటమే తప్ప, వినదగిందిగా ఏదీ లేదు. తెలుగును ఉబ్బేస్తే, ఆ కవిత్వం బాగున్నట్టే నని, దైవం పేరు పాటికి పన్నెండు సార్లు తీసుకొస్తే, ఆ కవితలను భక్తి గీతాలుగా భావించాలని, డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    I am Sorry! విశ్వామిత్రుడికి కూడా ఉన్నట్టు లేవు. ఉంటే పనిగట్టుకుని, నలుగురు సోదరులలో, రామలక్ష్మణులను మాత్రమే తన వెంట తీసుకువెళ్లటమెందుకు? వారిద్దరిలోనూ కూడా రాముడికే -బల, అతిబల అన్న మంత్రాలు ఉపదేశించి “సౌందర్యం, సామర్ధ్యం, జ్ఞానం, బుద్ధి నిశ్చయం, ప్రత్యుత్తరం” అన్న ఐదు విషయాల్లో రాముడిని అధికుడుగా చెయ్యటమెందుకు!
    Lyla

  7. 7
    Sreenivas Paruchuri November 3, 2017 3:55 pm

    Lyla: The verse “kausalyaa suprajaa raama” was sung by Balijepalli Lakshmikantam (a.k.a Lakshmikanta kavi), who played the role of Viswamitra in that film. Obviously I won’t tell you who he is, etc.

    Regarding other songs, there is no dispute about taste. But my motivations, or selection criterion for picking them are different, not necessarily “good quality” singing. But, I would particularly disagree with you about the song “madhoodayaMlO …”. But, we can take that off-line!

    తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. snip … snip … గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    I have been saying the same for a while. So …

    But, Rohini Prasad gaaru put it quite well here: http://eemaata.com/em/issues/201003/1556.html#comment-19094

    డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    same here!!

    Best,
    Sreenivas

  8. 8
    lyla yerneni November 6, 2017 5:48 pm

    But, Rohini Prasad gaaru put it quite well here:

    It is a different context. At that point of time of his comment – ‘rp’ is thinking of playback singing in Indian movies, and why certain singers are chosen over others. (Read it before, enjoyed it. Liked the singing.)
    In here, I am not thinking about movies, actors, voice lending to actors. No.

    Still, since he brought up the names of Lata Mangeshkar and Suseela, I don’t think for one minute he would estimate – as musicians – Lata and Suseela are of the same caliber.

    In the song – నిదురపోరా తమ్ముడా, Lata transforms the words into Music.

    జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే…….చితికి పోయిన జీవితమంతా

    Where am I? In the Land of Music.

    Whereas, when listening to Suseela’s song:

    ఎదురుగా ఉన్నాను నేను. ఇంకెవరినో కాను మీ అమ్మను.
    నువు రోజుకొక్క ఏడూ పెరగాలనీ, నీ ముద్దూ మురిపాలూ చూడాలనీ…

    Where are you? I am with the Telugu words, in Telugu Land. I am In Vijayawada.

    Lyla
    PS: Always a Pleasure hearing you! Sreenivas Paruchuri.
    I was thinking of Rohini Prasad when I noticed a Sarod event of Amzad Ali Khan on Nov 4th at Carnegie Hall.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి
  • విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు
  • తెన్నేటి సూరి చెంఘిజ్ ఖాన్: రేడియో నాటకం
  • మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు
  • మరికొన్ని అపురూపమైన గొంతుకలు

ఇటువంటివే…

  1. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు
  2. రజని పాటలు మరికొన్ని
  3. ఉగాది పాటలు
  4. మరికొన్ని అపురూపమైన గొంతుకలు
  5. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు

అక్టోబర్ 2017 సంచికలో ...

  • This play without me! నేను లేని ఈ నాటకం!
  • Walmart
  • అక్కరలేనితనం
  • అక్టోబర్ 2017
  • ఏదో కనికట్టు
  • కొత్త కథకులు
  • గడి నుడి -12
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2
  • గతం
  • జాగారం
  • తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా!
  • తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం
  • తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు!
  • నాకు నచ్చిన పద్యం: పినవీరుని పద్యరచనలో గుబాళింపు
  • పవిత్ర
  • పుస్తక పరిచయం: ఎర్రని ఆకాశం
  • మరికొన్ని అరుదైన పాటలు
  • మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం
  • మోహన్ దోస్తీలో ఆ కిక్కే వేరప్పా!
  • శిక్ష
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10
  • ℞: మారేజ్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.