రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు

రచన: విశ్వనాథ సత్యనారాయణ
జనవరి 2004

విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు.
సేకరణ: శ్రీనివాస్ పరుచూరి
/issue30/kinnerasani.mp3

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    ns murty March 23, 2017 1:07 pm

    మొదటిసారి విశ్వనాథవారి గొంతులో ఈ కిన్నెరసాని పాటను, వారు పరమపదించిన రోజు ఆకాశవాణి విజయవాడకేంద్రం వారు ప్రసారం చేసినప్పుడు విన్నాను. Amazing rendering.

  2. 2
    lyla yerneni April 15, 2017 7:12 pm

    ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.

    ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.

    కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.

    ఉదాహరణకు: నేను (లైలా)
    “శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
    నీ శ్రీపాదమే శరణు ఊ…..”
    అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.

    అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
    “కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
    కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
    అని నే పాడేస్తుంటాను.

    నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.

    అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.

    కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.

    లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
    చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?

    Lyla

  3. 3
    Sreenivas Paruchuri April 16, 2017 10:26 pm

    <> Rest of the insightful comment deleted for brevity.
    Lyla: I am completely with you! On a personal note, I was inspired to collect the poets’ voices in Telugu following a 78rpm disc of T.S. Elliott that I have seen during my early college days. A short time later came across a disc of Sarojini Nayudu reciting her own poetry. So, I started looking for such recordings in Telugu. The real motivation to submit them to eemaaTa came when I happened to visit British Library. Even today BL sells a CD of famous writers/poets voices :-). I am pretty sure that it was also the motivation for late Dr. Gutala Krishnamurti when he brought out SriSri’s (London) “mahaaprasthaanam” in 1980 with SS reciting his own poems.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను.

    Here I have come across people who believe that only the poet can bring out the beauty in his/her recitation. A cousin of mine hated the film version of “aanandam arNavamaitE” but liked SS’s version.

    Nitpicking: Are you referring to (Bedrich) Smetana’s Moldau (Vltava in Czech)?

    Thanks for a good piece of writing! — Sreenivas

  4. 4
    తమ్మినేని యడుకుల భూషణ్ April 16, 2017 10:47 pm

    తెలుగులో ఒక సైగల్ జన్మించనందుకు ఎప్పుడూ విచారపడుతుండే వాణ్ణి. పలువురు పెద్దలు విశ్వనాథ గళ ప్రాశస్త్యాన్ని ఉగ్గడించినా నాకు వినే భాగ్యం కలుగలేదు. కిన్నెరసాని పాటలు మహాకవి గొంతుకలో వినడం ఒక అద్భుతం .తెలుగులో సైగల్ లేని లోటుని తీర్చారు విశ్వనాథ. సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత వైదుష్యం జగమెరిగినదే. ఆ లలితమైన స్వరం ముందు పలువురి గొంతులు రాసబ స్వరాలే. గాయకుడు అనగా భాష వెనుక లోతులను ఎరిగి, ఉద్వేగపు టెత్తులను తడిమి అవలీలగా హృదయగతం చేయగలిగిన వాడు. సంగీతంలో కేవలం తాళ లక్షణాలను, రాగ జ్ఞానాన్ని ఒదిగించడం లో లేదు గాయకుని నేర్పు -అది చాలా ప్రాథమిక స్థాయి. ఛందోబద్దంగా పద్యం రాసి అదే కవిత్వమని భ్రమసి అదే కొలమానంతో నలుగురు మహాకవుల మారు మూల పద్యాల్లో యతి లేదు అని అల్పానందంతో మిడిసిపడే స్థాయి. లైలా గారి విశ్లేషణ కొద్దో గొప్పో వంగకవి రవీంద్రుని విషయంలో నిజం.

    విశ్వనాథ రసైక జీవి, సైగల్ ని వినడం అలవడితే విశ్వనాథను అందుకోవడం కష్టం కాదు. పాశ్చాత్య సంగీతం మాటకొస్తే Haydn, Beethoven ల మధ్య భేదాలను చక్కగా గుర్తుపట్టగలిగితే నేను క్లుప్తంగా రాసిన నాలుగు మాటలు వేగంగా అర్థమవుతాయి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు
  • గ్రామ్యమా? వాడుకభాషా?
  • శుక్లాంబరధరం …

ఇటువంటివే…

  1. శబ్ద తరంగాలు
  2. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు
  3. చెలియలికట్ట: విశ్వనాథ
  4. విశ్వనాథ నర్తనశాల
  5. ఉగాది పాటలు

జనవరి 2004 సంచికలో ...

  • కవి హృదయం
  • చెప్పులు
  • ఆత్మీయత ప్లస్‌ ఆలోచనా వెరసి ఇస్మాయిల్‌
  • ఇసక-2
  • ఇస్మాయిల్‌ కవితా సంస్మరణ
  • ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం
  • ఇస్మాయిల్‌ గారు
  • ఒకే ఒక్క ఇస్మాయిల్‌
  • కవిత్వంలో నిశ్శబ్దం
  • కొత్తకవులుకొన్ని సంగతులు
  • గడియారపు ముల్లులు
  • చెలగాటం
  • జనవరి 2004
  • దొంగాట
  • ధ్యానం
  • నా స్మృతి పథంలో
  • పల్లకీ..
  • మా బోసన్న ప్రేమ కత
  • రామానుజం (1887-1920)
  • విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు
  • వీరాభిమాని
  • శబ్ద తరంగాలు
  • సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మార్చ్ 2017
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.