వాంఛల్ని దాచుకున్న అలలు
ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే
వెన్నెల వేళ్ళతో నిమిరి
చంద్రుడు ఓదారుస్తుంటే
సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకుని
రెప్పలకిందకి చేరుతుంటే
మౌనంగా
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను!
వాంఛల్ని దాచుకున్న అలలు
ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే
వెన్నెల వేళ్ళతో నిమిరి
చంద్రుడు ఓదారుస్తుంటే
సముద్రం నుంచి
పల్చటి నీటి పొర
రెక్కలు కట్టుకుని
రెప్పలకిందకి చేరుతుంటే
మౌనంగా
ఆ తీరాన ఆమె
ఈ తీరాన నేను!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...