ఎప్పుడూ మృదువుగా తాకే మీ కవిత్వానికి ఎప్పటిలాగే జోహార్లు. ఈ ఆఖరిమనిషి ‘తన ఆఖరి రోజులలో మనిషి ‘ అనుకోవాలా? లేక ‘ఆఖరిగా పోయే మనిషి ‘ అనుకోవాలా? నాకు తెలియకుంది.
గ్రూప్‌ఫోటోలోనే కాదు అనేకానేక జ్ఞాపకాలలో సజీవంగా నిలిచిపోయిన మితృలంతా కూడా ఎప్పటికీ సజీవంగానే చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోతేనే బాగుండుననిపిస్తుంది.
చావు మాత్రమే ఆఖరి మజిలీ అని తెలిసినా అంతులేని ప్రేమ, వ్యామోహం పరిచయమైన ప్రతి సజీవ తలంపులపైనా ఉండిపోతోంది.
చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్న తరవాత కీకరకాయ అయ్యిందిట. అలాగా చదువు, కాదు స్వార్ధం మనిషిని తల్లి నుంచి దూరం చేస్తోంది. వీళ్ళకీ అనుభవం అవుతుందొకరోజు. తల్లి ప్రాణానికి తెగించి బిడ్డను కాపాడుకుంటుంది. రాయంటి బిడ్డ వెన్నంటి తల్లి సామెత కదా.
గుంపుల్లో సంచరించే ఆది మానవుల దశ నుండి ఒక చోట స్థిరపడి తెగ ఏర్పరచుకోవటం, ఒక భాష రూపుదిద్దుకోవటం, ఒక నాయకుడు ఉండటం దాకా ఎదిగిన వాళ్లు నిప్పును మొదటి సారి చూడ్టం అనే ఆలోచన నాకు కాస్త సబబుగా తోచలేదు. కానీ మనుషులకు నిప్పు మొదటి సారి పరిచయం అయితె ఇలానే ఉంటుందేమో అనిపించేట్టు, బాగా రాసారు గుల్జార్ గారు.
వేరే జంతువుల నుండి మనల్ని వేరు చేసే ఆలోచనా శక్తి, చుట్టూ జరిగే వాటిని గమనించే కొద్దీ – పరిసరాలని చూసే కొద్దీ మనిషి మెదడుని ఉక్కిరిబిక్కిరి చేసే వేల ప్రశ్నలు, అనుభవ లేమీ అజ్ఞానంతో కూడిన నిస్సహాయత, వెరసి మనిషి ఎలా తనకి అంతుబట్టని విషయాల్లో ఒక కాల్పనిక శక్తిని ముడిపెట్టి తనని తను సమాధానపర్చుకోటం మొదలుపెట్టాడో ఈ కథ ద్వారా రచయిత చెప్పారని నా అభిప్రాయం.
మీ శైలి చాలా బాగుంది. మళ్ళీ బుడుగు ని చదువుతున్నట్టుగా. చివర ముగింపు కూడా నచ్చింది. అప్పట్లో బాధ అనిపించినా అమ్మ కొట్టడం, అన్న తిట్టడం ఇప్పుడు మధురానుభూతులే. సుమారు అందరి బాల్యాలూ ఇంచుమించు ఒకలాగె ఉన్నా, దాన్ని కథ రూపం లో నవ్వు వచ్చేలాగా రాయగలగడం నిజంగా great.
క్రీడాభిరామామనే శృంగార గ్రంధాన్ని నెట్ లో పెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం (ఈ కృతి తొలి ప్రతులు పండితులకు మాత్రమే పరిమితం.) ఈ నెట్లో ప్రచురణకు మూలం ఏదో తెలియ జెయ్య లేదు.శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి పరిష్కారంతో ప్రచురించిన మణిమంజరి వారి ముద్రణ ప్రామాణికమని పండితాభిప్రాయము.
శ్రీఎమ్.ఎస్.ప్రసాదుగారన్నట్లుగా క్రీడాభిరామ కృతికర్త శ్రీనాధుడనే బహుళ ప్రచారంలో యున్నది. దానికి కారణం ఈ గ్రంధాన్ని క్షుణ్ణంగా చదివి, నిశితంగా పరిశోధించిన పండితులు ఈ కృతిలో శైలి పదగుంభనములు మెదలుగునవి శ్రీనాధుని ఇతర కావ్యములతో పోల్చి చూసి పుంఖానుపంఖాలుగా ఉదాహరణలు లభించుటచే ఈ గ్రంధము శ్రీనాధుని రచనయే అని నిర్ధారణకు వచ్చుట. వల్లభుని ఇతర కావ్యములు లభ్యము కాక పోవుట. ఇంకా కొన్ని ఇతర కారణముల చేత వల్లభుని పేరు మరుగున పడుట చేత.
సరివత్తురీవ అని మొదలయ్యే పద్యంలో జలద అనే యున్నది. అట్లాగే మందార వారుణీ అని మొదలయ్యే పద్యంలో మూడవ పాదం వెలఁది కోఱల మోము వేల్పు చేత అని యున్నది. గంధవతీ ప్రతీర పుర ఘస్మర అని మొదలయ్యే పద్యంలో చివరి పాదంలో బైచన మల్లన తిప్ప మంత్రులన్ అన్న వాక్యంలో మల్లనకు బదులుగా వల్లభుడు అని యుండాలని శ్రీ శాస్త్రి గారు సూచించేరు. అట్లాగే దాని తర్వాతి పద్యంలో చివరి పాదంలో డర్మవణికి బదులు డార్యమణి యనియుండాలని వారు సూచించేరు.
శృంగార కవిత్వం వ్రాసినంత మాత్రాన మనం శ్రీనాధుని ఏహ్యభావంతో చూడవలసిన పనిలేదు. అతడు ఈశ్వరార్చన కళాశీలుడు.బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు కల్గినప్పటికి దేశభాషలందు తెలుగు లెస్స యని తెలుగు వారి భాషా సంస్కృతులను ఢంకా మీద దెబ్బకొట్టి మరీ చాటి చెప్పిన మహాకవి. తెలుగువారిగా మనందరికి ఆయన గర్వకారణం.
ఆఖరి మనిషి గురించి m s naidu అభిప్రాయం:
07/02/2012 8:03 am
ఆఖరి మనిషి
ఒక శరీరం
కాదేమో
ఆఖరి మనిషి గురించి Narayana Ga. అభిప్రాయం:
07/01/2012 10:13 pm
రవిశంకర్ గారు,
ఎప్పుడూ మృదువుగా తాకే మీ కవిత్వానికి ఎప్పటిలాగే జోహార్లు. ఈ ఆఖరిమనిషి ‘తన ఆఖరి రోజులలో మనిషి ‘ అనుకోవాలా? లేక ‘ఆఖరిగా పోయే మనిషి ‘ అనుకోవాలా? నాకు తెలియకుంది.
గ్రూప్‌ఫోటోలోనే కాదు అనేకానేక జ్ఞాపకాలలో సజీవంగా నిలిచిపోయిన మితృలంతా కూడా ఎప్పటికీ సజీవంగానే చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోతేనే బాగుండుననిపిస్తుంది.
చావు మాత్రమే ఆఖరి మజిలీ అని తెలిసినా అంతులేని ప్రేమ, వ్యామోహం పరిచయమైన ప్రతి సజీవ తలంపులపైనా ఉండిపోతోంది.
అంతరం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
07/01/2012 8:13 pm
ఏదో కవిత్వం చదువుతున్నట్టు అనిపించింది, అభినందనలు.
అంతరం గురించి sarma అభిప్రాయం:
07/01/2012 7:48 pm
చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్న తరవాత కీకరకాయ అయ్యిందిట. అలాగా చదువు, కాదు స్వార్ధం మనిషిని తల్లి నుంచి దూరం చేస్తోంది. వీళ్ళకీ అనుభవం అవుతుందొకరోజు. తల్లి ప్రాణానికి తెగించి బిడ్డను కాపాడుకుంటుంది. రాయంటి బిడ్డ వెన్నంటి తల్లి సామెత కదా.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:
07/01/2012 9:38 am
లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతములో రెండవ శతకములో కొన్ని మందాక్రాంతములున్నాయి. అందులో మందం మందం మధుర నినదైః … అనే పద్యాన్నిలవకుశ (1934) చిత్రములో యిక్కడ వినవచ్చును. విధేయుడు – మోహన.
హాబూ నిప్పు గురించి రాజీవుడు అభిప్రాయం:
06/29/2012 4:28 pm
గుంపుల్లో సంచరించే ఆది మానవుల దశ నుండి ఒక చోట స్థిరపడి తెగ ఏర్పరచుకోవటం, ఒక భాష రూపుదిద్దుకోవటం, ఒక నాయకుడు ఉండటం దాకా ఎదిగిన వాళ్లు నిప్పును మొదటి సారి చూడ్టం అనే ఆలోచన నాకు కాస్త సబబుగా తోచలేదు. కానీ మనుషులకు నిప్పు మొదటి సారి పరిచయం అయితె ఇలానే ఉంటుందేమో అనిపించేట్టు, బాగా రాసారు గుల్జార్ గారు.
వేరే జంతువుల నుండి మనల్ని వేరు చేసే ఆలోచనా శక్తి, చుట్టూ జరిగే వాటిని గమనించే కొద్దీ – పరిసరాలని చూసే కొద్దీ మనిషి మెదడుని ఉక్కిరిబిక్కిరి చేసే వేల ప్రశ్నలు, అనుభవ లేమీ అజ్ఞానంతో కూడిన నిస్సహాయత, వెరసి మనిషి ఎలా తనకి అంతుబట్టని విషయాల్లో ఒక కాల్పనిక శక్తిని ముడిపెట్టి తనని తను సమాధానపర్చుకోటం మొదలుపెట్టాడో ఈ కథ ద్వారా రచయిత చెప్పారని నా అభిప్రాయం.
కొవ్వుపుంజి గురించి రాజీవుడు అభిప్రాయం:
06/29/2012 2:59 pm
దు:ఖం ఆవరించింది మనస్సుని. మొపాసా గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!
లెఖ్ఖల పరీక్ష గురించి Aparna Yeluripati అభిప్రాయం:
06/29/2012 11:08 am
మీ శైలి చాలా బాగుంది. మళ్ళీ బుడుగు ని చదువుతున్నట్టుగా. చివర ముగింపు కూడా నచ్చింది. అప్పట్లో బాధ అనిపించినా అమ్మ కొట్టడం, అన్న తిట్టడం ఇప్పుడు మధురానుభూతులే. సుమారు అందరి బాల్యాలూ ఇంచుమించు ఒకలాగె ఉన్నా, దాన్ని కథ రూపం లో నవ్వు వచ్చేలాగా రాయగలగడం నిజంగా great.
క్రీడాభిరామము:1 వ భాగం గురించి గంటి లక్ష్మీ నరసింహమూర్తి అభిప్రాయం:
06/29/2012 8:05 am
క్రీడాభిరామామనే శృంగార గ్రంధాన్ని నెట్ లో పెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం (ఈ కృతి తొలి ప్రతులు పండితులకు మాత్రమే పరిమితం.) ఈ నెట్లో ప్రచురణకు మూలం ఏదో తెలియ జెయ్య లేదు.శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి పరిష్కారంతో ప్రచురించిన మణిమంజరి వారి ముద్రణ ప్రామాణికమని పండితాభిప్రాయము.
శ్రీఎమ్.ఎస్.ప్రసాదుగారన్నట్లుగా క్రీడాభిరామ కృతికర్త శ్రీనాధుడనే బహుళ ప్రచారంలో యున్నది. దానికి కారణం ఈ గ్రంధాన్ని క్షుణ్ణంగా చదివి, నిశితంగా పరిశోధించిన పండితులు ఈ కృతిలో శైలి పదగుంభనములు మెదలుగునవి శ్రీనాధుని ఇతర కావ్యములతో పోల్చి చూసి పుంఖానుపంఖాలుగా ఉదాహరణలు లభించుటచే ఈ గ్రంధము శ్రీనాధుని రచనయే అని నిర్ధారణకు వచ్చుట. వల్లభుని ఇతర కావ్యములు లభ్యము కాక పోవుట. ఇంకా కొన్ని ఇతర కారణముల చేత వల్లభుని పేరు మరుగున పడుట చేత.
సరివత్తురీవ అని మొదలయ్యే పద్యంలో జలద అనే యున్నది. అట్లాగే మందార వారుణీ అని మొదలయ్యే పద్యంలో మూడవ పాదం వెలఁది కోఱల మోము వేల్పు చేత అని యున్నది. గంధవతీ ప్రతీర పుర ఘస్మర అని మొదలయ్యే పద్యంలో చివరి పాదంలో బైచన మల్లన తిప్ప మంత్రులన్ అన్న వాక్యంలో మల్లనకు బదులుగా వల్లభుడు అని యుండాలని శ్రీ శాస్త్రి గారు సూచించేరు. అట్లాగే దాని తర్వాతి పద్యంలో చివరి పాదంలో డర్మవణికి బదులు డార్యమణి యనియుండాలని వారు సూచించేరు.
శృంగార కవిత్వం వ్రాసినంత మాత్రాన మనం శ్రీనాధుని ఏహ్యభావంతో చూడవలసిన పనిలేదు. అతడు ఈశ్వరార్చన కళాశీలుడు.బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు కల్గినప్పటికి దేశభాషలందు తెలుగు లెస్స యని తెలుగు వారి భాషా సంస్కృతులను ఢంకా మీద దెబ్బకొట్టి మరీ చాటి చెప్పిన మహాకవి. తెలుగువారిగా మనందరికి ఆయన గర్వకారణం.
-గంటి లక్ష్మీ నరసింహమూర్తి.
దీవి సుబ్బారావు “మాటన్నది జ్యోతిర్లింగం” గురించి chavakiran అభిప్రాయం:
06/29/2012 4:05 am
ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభ్యం. వివరాలకు చూడండి http://kinige.com/kbook.php?id=946