పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి sreedhar అభిప్రాయం:

    06/29/2012 1:29 am

    వ్యాసం చాలా చక్కగా నేటి కాలానికి అణుగుణంగా తేలికగా వివరించినందుకు ధన్యవాదాలు. నిజంగానే ఇది చాలా సున్నితమైన విషయం. మనిషి ఏదైన మానసిక అస్తవ్యస్త పరిస్తితుల్లొ కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇలా జాతకాల వెంట పడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సారి సృతి మించి జీవితాలే నాశనం అయేలా తయారవుతై. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జీవితం పట్ల మంచి ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలి.

  2. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి రాజీవుడు అభిప్రాయం:

    06/28/2012 8:51 pm

    “ప్రభావతీ విధేయుడైన ప్రద్యుమ్నుడు అనబడే నేను ఎదురు ప్రశ్న లేకుండా ఆ ఆజ్ఞ పాటించాను.” పంక్తి మొదలుకొని చివరి దాకా మహా సరదాగా రాసారండి. జంధ్యాల గారి శ్రీలక్ష్మి పాత్ర కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు, బాదొచ్చినట్టు కనిపించింది.
    మీరు పంచిన నవ్వులకు మా ధన్యవాదాలు!

  3. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    06/28/2012 7:07 pm

    అవునండి. తెలంగాణలో తోటికోడలు అన్న అర్థంలో యారాలు (ఏఱాలు) అన్న మాటే ఎక్కువగా వాడుతారు. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఏఱాలు అన్నది అచ్చతెలుగు పదమేనండి. చివర్లో ఉన్న -ఆలు అన్న పదమే అది అచ్చతెలుగు పదమని చెబుతుంది. ఏఱాలు అన్న పదం వేఱాలు అన్న పదం నుండి వచ్చింది.

    ఏఱాలు < వేఱాలు < వేఱు + ఆలు = వేరే భార్య/కోడలు ఇంటిలో ఉండే వేఱే కోడలు కాబట్టి ఆ స్త్రీ ని వేఱాలు అని పిలిచారని చెప్పుకోవచ్చు. సవతిని కూడా ఏఱాలు అని పిలుస్తారు. వేఱు అన్న పదం ఇలాంటి అర్థంలోనే ప్రయోగించడం తమిళంలో కూడా కనిపిస్తుంది: వేఱ్ తాయి (=వేఱే తల్లి) అని సవతి తల్లిని పిలుస్తారట. సవతి అన్న పదం మాత్రం సంస్కృతం లోని సపత్ని (ఒకే భర్తగల స్త్రీలు) నుండి ప్రాకృతంలో సపత్తిగా మారి ఆపై సవత్తి అయి తెలుగులో సవతి అయ్యింది. తమిళంలో ఇప్పటికీ సవతిభార్యను సవత్తి/చవత్తి అనే అంటారు.

  4. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    06/28/2012 8:25 am

    “తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు.” అని అన్నారు. నేనెక్కువగా విన్నది మాత్రం – ‘యారాలు’ అని. (ఇది తెలుగు పదం కాకపోవచ్చు కానీ, వాడుకలో ఈ పదాన్నే ఎక్కువగా విన్నాను.)

    ‘పలుకుబడి’ లో ఎన్నో తెలీని సంగతులు తెలియచేస్తున్నందుకు ధన్య వాదాలు సురేశ్ గారూ!

    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

  5. కోనసీమ కథలు: సత్తెవతి గురించి రాజీవుడు అభిప్రాయం:

    06/27/2012 8:01 pm

    మీ కథ చాలా బావుందండీ బ్రహ్మానందం గారూ! గురువుకి శిష్యుల పైన వుండే ప్రేమను సునిశితంగా చెప్పారు.

  6. ఒక పుస్తకం గురించి rama bharadwaj అభిప్రాయం:

    06/27/2012 2:07 pm

    రవికిరణ్! మీకు ఇంకా ఇలాంటి అనుమానాలు రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది సుమా! ఇంతటి కవికి “వెనక మాటలు” రాసిన విమర్శకులు ఏదో నాడు దీనికీ భాష్యం చెప్తారు. అందాకా ఆగాలి కదా! ప్రశ్నలు కూడదు. మీకు కావలసిందల్లా కాస్త ఓపిక. అంతే!!

    రమ.

  7. ఒక పుస్తకం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    06/26/2012 9:31 pm

    ఇవి నానీలా హెచ్ అర్కే గారు? ఇవి నానీలయితే ఒకటి రెండు బాగున్నాయి, కానీ ఇది కవిత అయితే మాత్రం మీ మనసులో తోచిన భావం మా మనసులకి చేరలా. మీరు చెయ్యి తిరిగిన గొప్ప కవితా పెయింటర్ అయుండొచ్చు, నిజంగానే అంత గొప్ప కవులే మీరు, కానీ మీ భావం మీ కవిత లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి, పాఠకులని చేరకముందే డిసిపేట్ అయిపోయినట్టుంది.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. శ్రీనాథుని చాటుపద్యములు గురించి Chakradhara Rao Lade అభిప్రాయం:

    06/26/2012 5:57 am

    పైన ఇచ్చిన పద్యములకు భావములు కూడా ఇవ్వగలిగితె, చాలా సంతొషకరం.

  9. నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన గురించి raj kumar అభిప్రాయం:

    06/26/2012 12:48 am

    అతిశయోక్తిగా కనిపించే స్వభావోక్తిని అత్యున్నతంగా తీర్చిన “చెమకూర పద్యంపు పొట్లం”ఇది. పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

    మరో సాయం కోరుతున్నా సహకరించ ప్రార్థన. ఇంటర్ తెలుగు పుస్తకం లో కళ పాఠం లో “పోట బంటునై అచ్చటి కేల పోయితి మహాగుణ భూషణు గోలు పొయితిన్” అభిమన్యుని కోల్పోయిన అర్జునుని బాధను తెలిపే పద్యం కొంత భాగం ఇచ్చారు. దానిపూర్తి పాఠం కావాలి తిక్కన భారతం అందుబాటులో లేదు. తెలిసినవాళ్ళు దయచేసి సహకరించండి

  10. పాఠకులకు సూచనలు గురించి గంటి లక్మీ నరసింహమూర్తి అభిప్రాయం:

    06/22/2012 10:59 am

    “ఈ మాట” సంపాదకులకు నమస్కారం.ఈ పత్రిక గురించి ఈ రోజే పూర్తిగా చదివి తెలుసు కొన్నాను. చాలా ఆనందంగా ఉంది.వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుంది.నేను క్రీడాభిరామము గురించి నెట్లో శోధించుచుండగా “ఈ-మాట” తగిలింది. తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ బహుధా ప్రశంసనీయము. మీరు నా ఇ-మెయులు నిర్ధారణ చేసుకొని మీ పత్రికలో చర్చా వేదికలో కూడ నా అభిప్రాయములు తెలియ జేయడానికి అనుమతిస్తే (అభిప్రాయములు కొత్త విషయములు తెలియ జేయుటకు మాత్రమే.వాదనలకు తావు లేదు) నేను గూడ తెలుగు సాహిత్య యాగానికి సమిధ నొక్కటి ఆహుతిస్తాను.

    భవదీయుడు-గంటి లక్ష్మీ నరసింహమూర్తి(బెంగుశూరు)

    [మూర్తిగారూ – అభిప్రాయాలు తెలియజేయడానికి మీకు ఎవరి అనుమతీ అవసరం లేదు. మీ అభిప్రాయాలు నిస్సంకోచంగా తెలియజేయవచ్చును. – సం.]