పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి somesh అభిప్రాయం:

    07/02/2012 11:21 pm

    మధురానుభూతిని కలిగించే సాహిత్యాన్ని, ఆందులోను పింగలి వారిని స్మరణకు తెచ్చే కళాపూర్ణోదయం అందించినందుకు కృతజ్ఞతలు.

  2. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:

    07/02/2012 9:02 pm

    సురేశ్‌గారు, మంచి వ్యాసము, జోహారులు.
    1. కవిచింతామణి – వెల్లంకి తాతంభట్టు – తరువాతి లాక్షణికులు ఎంతగానో ప్రశంసించిన ఈ గ్రంథం మనకు పూర్తిగా లభ్యం కాకపోవడం మన దురదృష్టం. ఇందులో ఐదు అధికారములు ఉన్నాయి. దొరసామి శర్మ పుస్తకములో పద్యములలో కొన్ని మార్పులు చేసినానని చెప్పారు. కాని ఈ ఐదు అధ్యాయాలకంటె ఎక్కువ ఉన్నట్లు తెలుపలేదు.
    2. పుస్తకము యిప్పటిదే అయినా కూడ, క్రీ. శ. 1000 కి ముందటి కాలపు వ్యాకరణమును గురించి కోరాడ మహాదేవ శాస్త్రిచే వ్రాయబడిన Historical Grammar of Telugu with Special Reference to Old Telugu (200 BC to 1000 AD) ఒక అద్భుతమయిన గ్రంథము.
    3) ఓగిరాల రంగనాథకవి ద్విరేఫ వర్ణ దర్పణము అనే పుస్తకము రేఫద్వయమును గురించి విస్తారముగా చర్చిస్తుంది.
    విధేయుడు – మోహన

  3. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి వేణు అభిప్రాయం:

    07/02/2012 12:31 pm

    సురేశ్ గారూ! తెలుగు వ్యాకరణాల గురించి వివరంగా, ఆసక్తికరంగా రాశారు. ముఖ్యంగా కేతన ‘ఆంధ్ర భాషాభూషణము’ గురించి రాసింది బాగుంది.

    చిన్నప్పటినుంచీ ‘చిన్నయసూరి’ అని చదువుకున్నాం. ఆ పేరును మీరు ‘చిన్నయ్యసూరి’ గా రాశారు. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కూడా పద విభాగం చేసి కొత్త అర్థంతో ఎద్దేవా చేసింది ‘చిన్నయసూరి’ నే కదా? మరి సరైన రూపం అది కాదా?

  4. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Rama krishna Reddy అభిప్రాయం:

    07/02/2012 11:52 am

    చాలా బాగున్నాయి. ఇంత మంచి పద్యాలను అందించినందుకు మీకు ధన్యవాదములు. కానీ పద్యాలకు అర్థం అందించినచో అది మాలాంటి వారికి ఇంకా బాగుండేది.

    అన్యధా భావించరని ఆశిస్తూ……

  5. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి jayaprabha అభిప్రాయం:

    07/02/2012 10:43 am

    సి యెస్ రావు గారూ !!

    కొత్త మాటలు చెప్పేరు ‘యజ్ఞం’ కధ మీద! మీ ముందటి విమర్శకుల దృక్పధం మీద కూడా వ్యాఖ్యానించేరు. knee jerk reaction గా భావిస్తారో లేక మీ అభిప్రాయాన్ని పరిగణిస్తారో నారాయణ రావు లాంటి వారు??

    నాకు తెలిసీ ఒక రచయితగా ఈ కధని గురించి కాళీపట్నం మాస్టారు ఏమనుకుని ఉన్నదీ కూడా ముఖ్యమే అనుకుంటాను. ఆయన మీద ఉన్న రాజకీయపు ప్రభావాలు ఆ కధని అలా రూపొందించేయని మనం భావించాలి. శ్రీరాములు నాయుడు కాంగ్రేసు పార్టీ లాంటి వాడూ, అప్పల్రాముడు కమ్యూనిస్టు పార్టీ లాంటి వాడూ, అతడి కొడుకు యెం యెల్ పార్టీల పంథా లోని వాడూను.

    తన మీద ఉన్న విప్లవ రాజకీయాల ప్రభావమూ తన గురువులైన రావి శాస్త్రీ , కొడవంటిగంటి కుటుంబరావు ల ప్రభావమూ, తాను చూసిన సమాజమూ దాని స్థితిగతులూ, ఆ సమాజం పట్ల తన “ప్రాపంచిక దృక్పధమూ” ఇవన్నీ “యజ్ఞం” కధావిర్భావానికి కారణాలుగా మాస్టారు చెబుతారు ఇప్పటికీ!!

    అందువలన మీకు “అకృత్యం”గా అనిపించిన బాలుని హత్య రచయితకి నూతన విప్లవ సంకేతంగా తోచింది. బానిసత్వం పట్ల అది తన నిరసనగా రచయిత చేసిన ప్రకటనగా అనుకోవాలి. తన ఆ దృక్పధం నించి మాస్టారు ఇవాళ్టికీ ఏమీ విడివడలేదు గనక, యజ్ఞం కధని అర్ధం చేసుకోవడంలో ఆ కధ చెప్పబడిన రాజకీయాలని కూడా పరిగణన లోకి తీసుకోవాలేమో? అది రాజకీయాతీతమైన కధ కాదు కదా?

    జయప్రభ.

  6. ఇటు నేనే – అటు నేనే గురించి మోహన అభిప్రాయం:

    07/02/2012 10:33 am

    పఠించాను పఠాభి కూర్పుల నేర్పుల తీర్పులతో తహతహలాడుతూ తఃతఃగారి కడుపుబ్బ కవ్వించే విత కాని కత కాని కవితను. సులోచనాల లోచనాలతో చదివిన పదాల ఆ ముదాలు, ఆముదాలు, ఆసాముల ఆ సాములు, మాయల లోయలలోకి తీయగా తీసికొని వెళ్లింది. గ్రే ఫుల్లీ గ్రేస్‌ఫుల్లీ ఆర్ డై ఫుల్లీ – ఇవి రెండు చెయ్యలేను. బహుశా విత్ గ్రేస్ ఫుల్లీ డై ఫుల్లీ విల్లీనిల్లీ. మంచి కొమ్మంచి కవితకు జోహారులు. విధేయుడు – మోహన

  7. అంతరం గురించి మోహన అభిప్రాయం:

    07/02/2012 9:20 am

    కథావస్తువు మామూలే అయినా, కథారచన ప్రశంసనీయము. నేను పుట్టాక, నా జీవితంలో మొదటి సారిగా అమ్మా, నేను వేరయ్యాం. మావి వేర్వేరు శరీరాలయ్యాయి. ఇది నాకు అమ్మకి మధ్య మొదటి ఎడబాటు. వంటి వాక్యాలు చిన్న కవితలే. కథారచయిత శివ్ గౌతం గారికి, అనువాదకులు సోమశంకర్ గారికి అభినందనలు.
    విధేయుడు – మోహన

  8. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/02/2012 9:15 am

    సురేశ్! ఈ వ్యాస రచన లో మీ వాక్యాలు సరళంగా ఉన్నాయి. చదవడానికి బాగున్నాయి. విషయ వివరణలో క్లుప్తమైన వాక్యం బాగుంటుంది.

    ర-ఱ లని గురించి అన్నమయ్య కొడుకైన పెద తిరుమలయ్యగారు కూడా చెప్పారు. రేఫ -ర కార నిర్ణయాన్ని చేస్తూ తిమ్మ కవి , సూరకవుల కన్నా ముందుగానే పెద తిరుమలయ్య రాశారు. అయితే ఆయన చూపించిన రేఫ రకార నిర్ణయాన్ని తన రచనలలో మాత్రం [సమకాలీన వాడుక భాషనే వాడాలన్న ఉద్దేశ్యం వల్ల కావొచ్చునేమో మరి…] ఆయనే అతిక్రమించారని విమర్శ ఉంది. ఈయన పెద్దకొడుకు చినతిరుమలయ్య భాషల మీద పనిచేశారు. చినతిరుమలయ్య అష్టభాషా దండకాన్ని రాసేరు. ఐతే, ఇందులో తెలుగు మాత్రం లేదు. ఇందులోని ప్రాకృతం కొరకరాని కొయ్యగా ఉందని భావించారు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ . ఈ చినతిరుమలయ్య కుమారుడు తిరువేంగళనాధుడు అమరానికి ఆంధ్రంలో టీక రాసేరు. గురుబాల ప్రబోధిక పేర ఇది తెలుగునాట పాఠ్యపుస్తకంగా ఇంగ్లీషు చదువులు మొదలుకాక ముందటి దాకా బాగా చెలామణిలో ఉండేదిట.

    సీతారామాచార్యుల తరవాత ఎందుకని మనకి వ్యాకరణం మీద మరో పుస్తకం రాలేదూ? ఏమి కారణం? తెలుగు వాక్య నిర్వచనంలో మరింక మనం సాధించవలసిన ప్రయోగాలేవీ లేవా? సూత్రాలేవీ లేవా? అంటే, కొత్త వాడకం తెలుగు భాషలో మరింక లేదని మనం అనుకోవచ్చునా? తత్సమాలు తద్భవాలు సరే. అన్యదేశ్యాల వాడుకలో వచ్చే మార్పుకి సంబంధించి మనం కొత్త ప్రకరణాలని పుస్తకాలలో తయారుచేసి చేర్చుకోవలసిన పనిలేదా? తెలుగులో ఇటీవల బాగా పెరిగిన ఇంగ్లీషు పదాల సంగతీ వాటి విశ్లేషణ, ఇటీవలి తెలుగు వాక్యపు తీరు తెన్నులూ వీటి గురించి ఎవరూ మాట్లాడేదీ? ఈ విషయాల మీద కూడా మీ వ్యాసంలో కొసమెరుపు ఒకటి ఉంటే బాగుండేదేమో కదా?

    రమ.

    పి.యెస్: సురేశ్! మీ చివరి పేరా చదివిన తరవాతనే నేను నా ప్రశ్నలని అడిగేను అని గమనించగలరు. మీరు అన్న ‘ఎన్నో’లో నాకు తెలిసిన వ్యాకరణ పుస్తకాలు తక్కువ. ‘ఎన్నో’ అన్నది పెద్ద విశేషణమేమో?

  9. బింబం గురించి మోహన అభిప్రాయం:

    07/02/2012 9:15 am

    కదిలించే కథ. ఇంత మంచి కథ వ్రాసిన చూడామణిగారికి, చక్కగా అనువదించిన గౌరిగారికి అభినందనలు. ఈ క్రింది వాక్యాలు మెదడులో కలకాలం ఉంటాయి –
    అగరుబత్తి కాలిన తర్వాత అదే ఆకారంలో క్రింద పడే బూడిద అగరుబత్తి ఎలా అవుతుంది? అది వట్టి బూడిద. “నీవు ఎవరు?” “నేను నేనే.”
    విధేయుడు – మోహన

  10. అమ్మ గోపెమ్మ గురించి తః తః అభిప్రాయం:

    07/02/2012 9:13 am

    రాధ గారూ – యశోద బాల కృష్ణుణ్ణి తాటితొ రోటికి కడితే, మీరు ఆ తల్లిని పొతన మాటలతో మా కళ్ళకు కట్టారు. [తాటితొ కన్నా మాటలతో కట్టిందే గట్టిగా ఉంటుంది.]

    తః తః