చాల చక్కని కధ. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కధ ఇది. మీనాక్షి తల్లిలా ఎంతమంది స్త్రీలు తమ ఆశలను ఆశయాలను చంపుకుని భర్త కోసం పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారొ అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్త్రీ మూర్తులు ప్రతి ఇంటికొకరు ఉంటున్నారు. చక్కని కథ వ్రాసిన చూడామణిగారికి అభినందనలు.
” …..ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, గ్విన్ (1985) రాసిన వ్యాకరణం వరకూ గత రెండు శతాబ్దాల కాలంలో ఎన్నో తెలుగు వ్యాకరణ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఈ ఆధునిక వ్యాకరణ గ్రంథాల గురించి మరింకెప్పుడైనా చర్చించుకుందాం.”
స్వర రచన: మనం ఏదైతే ఒక పాటకి సంగీతంలో ఒక రాగాన్ని తీసుకుని ఆ రాగంలో స్వర పరిచి పాడతామో అది. అదే పాటకి చివరలో ఏదైనా ఒక మంచి అర్ధవంతమైన లైనుకి ఆ రాగంలో స్వరస్థానాలు తప్పకుండా వివిధ ప్రయోగాలతో స్వరవిన్యాసాలు చేస్తూ పాడితే అది స్వరకల్పన.
‘ఆధునికత’ అంటే ఎలాంటిది. అమ్మానాన్నల్ని లంగా, ఓణీలతో బడికి వెళ్తున్నప్పుడు చూసిన కళ్ళతో కాక కోకా రైకలతో ఇద్దరు ఎదిగిన పిల్లల్ని పక్కనుంచుకుని, వారసత్వపు చట్టాల పరిజ్ఞానంతో ఆస్తులు పంపకానికి వచ్చినప్పుడు చూసే కళ్ళతో చూడటం లాంటిదా? వాల్మీకినీ, నన్నయనీ ఇప్పుడు యెలా చూడాలి? ‘మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక’ అన్నాడు త్యాగరాజు. ఆయనని ఇప్పుడు యేం చేద్దాం?
జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి నేనింతకు ముందు కొంత విన్నాను. కొందరు ప్రముఖులు ఆయన గురించి రాయగా చదివాను. కానీ, నేనెప్పుడూ ఆయన రచించిన పుస్తకాన్ని చూడలేదు. చదవలేదు.
అలాంటి జరుక్ శాస్త్రి గారు! ఎంత మంచి కథ రాసారూ!? అని ఆశ్చర్యమైంది, అబ్బురమైంది- నాకు. ఈ కథ పూర్తిగా చదివాక, నా మనసుకేమీ తోచనట్టైంది. ఉక్కపోతేసింది. కాసేపు చల్ల గాలి కావాలనిపించింది. కారణం -ఆ స్త్రీ మూర్తి నా కళ్ళ ముందే – మంటల్లొ పడి కాలిపోయిన భావన వల్ల కావొచ్చు. అలా అని ఈ కథ బాగుంది అని పొగిడినా, లేదా -, ఈ రచయిత ఆ కారెక్టర్ ని భలే అద్భుతంగా చిత్రీకరించాడని సంబర పడ్డా, అది చాలా దుర్మార్గ గుణమై పోతుంది.
కారణం – ఇది కథ కాదు. జీవితం. ఇందులోనివి పాత్రలూ కావు. అవి అచ్చు- పోత పోసిన మనం. మన్లోని మన మొచ్చి ఇక్కడ మనకెదురుగా కనిపిస్తున్నట్లుంటాయి. ఎప్పుడూ ఎవరమూ చూడని సంకుచితాలు హనుమంతునిలో తాండవమాడుతున్నట్టుంటాయి.
ఈ రచనలో పాఠకులని కదిలించే విషయం ఏమిటంటే: ‘పెళ్ళినాడే మొగుడు. ఆ తర్వాత యముడు..’ అనే పెద్దల పెద్ద సూక్తి మనకుచప్పున స్ఫూరణకొస్తుంది- ఈ రచన చదివాక! ఆనాటి హనుమంతరావు – అప్పట్నుంచీ కథలోనే కాదు, ఇప్పటికీ ఈ సమాజంలో (చావకుండా) ఇంకా ఇంకా బ్రతికే వున్నాడు. విషాదమేమంటే – అప్పట్నుంచి వరసగా చస్తోంది కేవలం నరసమ్మ లాంటి భార్యలు మాత్రమే! పెళ్ళి పేరు మీద హోమ గుండానికి ‘ పవిత్ర బలి’ అవుతున్న నరసమ్మ వంటి ఇల్లాళ్ళు నానాటికీ సంఖ్యా పరంగా పెరుగుతున్నారే తప్ప తరగడం లేదనేది అక్షర సత్యం. కాదు, అంకెల సాక్ష్యం.
అందుకే ఈ కథ 60 యేళ్ళ తర్వాత చదువుతున్నా, – ఈ రచన ఈ కాలందే అని తోస్తుంది. ఇప్పుడే తాజాగా రాసినట్టుంటుంది. రాతి యుగం నుంచి, నేటి యుగం దాకా మానవ జీవనం లో ఎన్నెన్ని ఆధునిక మార్పులు జరిగినా, మారంది మాత్రం ఒకటే – స్త్రీ సామాజిక స్థితి. “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకానికి నిజమైన సమాధానం వుందా? వుంటుందా? ఈ అంశం మీద రాసిన కథే ఈ హోమ గుండం. కథకి భాష్యం ఈ వాక్యం.
‘కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి. – అని మీరన్నారు కానీ, నా కైతే ఈ కొటేషన్ ఆరంభం లో వుండటమే నూటికి నూరు పాళ్ళు సమంజసమనిపించిందండీ! (కారణం. వ్యక్తి గతం కావొచ్చు. నాక్కూడా ఇలా ప్రముఖుల జీవన సత్యాల సూక్తుల్ని ముందుంచి కథలు రాయడం అంటే ఎందుకో ప్రియం! కథకి మంచి పట్టు వుంటుందనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే.)
ఇది మాత్రం నిజం: మీకు నచ్చిన కథగా ఇది ఈమాట లో చదవకుంటే అస్సలకీ కథ నేనెప్పటికీ చదివే అవకాశం నాకు వచ్చుండేది కాదు. నరసమ్మ- నా కళ్ళల్లో కన్నీరై మిగిలేదీ కాదు. ఇది మాత్రం నిజం.
ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ మీకు నచ్చిన వైనాన్ని చదివి, ఇంప్రెస్సయి – అప్పుడు కథలోకి వెళ్ళాను. ఆ వివరణే లేకుంటే ఈ శాస్త్రి గారి కథ చదవడాన్ని పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత చదవనూ చదివేదాన్ని కాదు. ఇంత గుర్తైన జ్నాపకం మిగిలేదీ కాదు. ఇది వాస్తవం.
అసలు కధ లో కొస్తే: హనుమంత రావు లాంటి మగాళ్ళు కొందరు గొప్ప కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆ తర్వాత తెగ పశ్చాత్తాపంలో ముణిగి తేలుతారు. ఆ మూణ్ణాళ్ళ ముచ్చట తీరాక ‘ఆపరేషన్ తర్వాత వెన్నుకి పొడిచిన మత్తు వొదిలి, కేవలం నొప్పి మాత్రమే మిగిలిన పేషెంట్ లా గిలగిలా కొట్టుకుంటాడు. ఆశయం కోసం ప్రయాసగా ఆశ్రయించిన కరుణా, జాలి, ఉన్నత తత్వం అంతా కూడా దయ్యం వొదిలినట్టు వొదిలి, ఇహ అసలు స్వరూపం చూపిస్తారు. ఇట్లా! హనుమంతునిలా! ఇతగాడు పెళ్ళి చేసుకోకుంటే నరసమ్మ గారు ఏ పాచిపనో చేసుకుని హాయిగా బ్రతికుండేది కాదూ? ఈయనగారూ చేసుకున్న ‘వెధవ వివాహం వల్ల కాదూ’ దహనమై పోయిందీ!? అనే నిజాన్ని నిగ్గు తేల్చారు శాస్త్రి గారు!
ఏ కాలం కథా? ఇదెప్పటి కథా!? ఈ హోమ గుండం 1945 కాలం నాటిదైతే మాత్రమేం ఈ నాటి పురుషహంకార ప్రపంచానికి చక్కగా మచ్చ లేని అద్దంలా నిలుస్తుంది.
వేలూరి గారి మాటల మీద నాదొక మాట: ‘అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!‘ అని మీకు అనిపించింది కానీ నాకైతే ఆ కారణం శుభ్రంగా కళ్ళక్కట్టినట్టు కనిపించనూ కనిపించింది.
* ఎవరో దోస్త్ ఏదో అనుంటాడు. ‘తొందర పడ్డావురా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలని. ఎలాగూ ఆదర్శ వివాహం చేసుకునే వాడివి. పెళ్ళం వెనక కాసింత వున్న దాన్ని చేసుకుంటే కష్టాలుండేవి కావుగా అంటూ ఫలానా వారమ్మాయిని ఉదహరించి వుండొచ్చు. లేదా ఆ బుధ్ధి హనుమంతుని లోనే కలిగీ వుండొచ్చు. (కోతి కదా!, పురుషుణ్ని కాదు నేనంటోంది. అతని బుధ్ధిని.)
‘ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో – రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు. ‘- వేలూరి గారు.
* ఎవర్ని విమర్శించినా, ఇంచకున్నా ఒక కుత్సిత మనస్కుణ్ని మన ముందుంచారు రచయిత. ఇంకా నిజం చెప్పాలంటే – ఒక స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోగల మనస్తత్వం కేవలం ఒక పురుషునికి మాత్రమే సాధ్యం అనే నాలాంటి వారి ఒక అంచనాని, ఇక్కడ ఈ రచయిత అక్షర సాక్షిగా నిరూపించారు.
రచనలో రవ్వల్లాంటి మాటలివి:
* నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట యెంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. (నాకెంతో అద్భుతం అ నిపించిన కొటేషన్ ఇది.)
* కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన ఫుర్రల్లాగా పనిచేస్తై.
* తాను ఏంచేసినా తప్పే అవుతోంది. పోనీ – యిది చెయ్యి. నాకు యిలాగ వుండాలి అనడు. తన బుధ్ధికి తోచినట్లు చేస్తే – పురుగేరినట్లు మాట్లాడతాడు. (దరిదాపు ఈ కథ రాసి అరవై యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ సగటు మగవాని మనస్థత్వం ఈ పంధా లోనే సాగుతోంది)
* బందిలి దొడ్లో పడ్డా ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే- లోకంలో చోటు తక్కువా.
* దేవుడి పఠాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందటా అనుకున్నారు! (భార్యని చంపేసిన – ప్రతి మొగుడూ చెప్పే కారణం ఇలాగే వుంటుంది.)
ముగింపు – స్త్రీ లోకాన్ని ఆవేశానికి గురి చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. పొరబాటున హనుమంతుడి వంటి వాణ్ణి వివాహమాడినా నరసమ్మలా చావకూడదు అనే నిజాన్ని చెబుతుంది.
నా కితాబు: కథలందరూ రాస్తారు. అందరు రాసేవీ అవే అక్షరాలు. కాని, కొందరి చేతుల్లోనే అవి జీవితాలవుతాయి. గుండె మీద రాలి పడే కన్నీటి పుష్పాలవుతాయి.
ముగింపు: రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ( జరుక్ శాస్త్రి ) గారికి అంజలి ఘటిస్తూ.. తనకు నచ్చిన ఈ అపురూప కథని ఈ మాట పాఠకులకందించి, సాహిత్య పిపాసుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి కృతజ్ఞాభినందనలు తెలియ చేసుకుంటూ,
ఎన్నో తెలియని ఆసక్తికరమైన విషయాలను ఎంతో ఓపికతో పరిశ్రమతో సంగ్రహించి అందించినందుకు సురేశ్‌కు చాలా కృతజ్ఞతలు.
ఆలోచింపజేసే వ్యాసం. తెలుగుభాష దినదిన ప్రవర్ధమానంగా కాక, దినదిన గండంగా నెట్టుకొచ్చే స్థితికి చేరుకోవడానికి కొన్ని కారణాలను కూడా అందిస్తుంది. మన పండితులు, వ్యాకరణవేత్తలు ఎప్పుడో వెయ్యేళ్ళ కింద నన్నయ “చేసిరి యడవిన్’ అన్నాడనీ, “చేసిరడవిన్” అనలేదని, లేక ఎన్నో శతాబ్దాల కింద తిక్కన “చేసిరి యంత” అన్నాడనీ, “చేసిరంత” అనలేదనీ, ఎత్తిచూపడం, విమర్శించడం ఆశ్చర్యపరుస్తుంది. వ్యాకరణానికి ఒక ప్రామాణిక గ్రంథంగా గౌరవించబడే “అప్పకవీయం” సైతం, శ్రీనాథుడు “కూర్చుండిరి యొండొరున్” అని సంధి చేయలేదని విమర్శించడం ఆశ్చర్యకరం.
ఉటంకించిన ఉదాహరణలలో, తప్పు అన్న రూపాలకన్నా, సరి యని చూపినవి ఏ రకంగా ఎక్కువ స్పష్టంగా, లేదా తక్కువ అస్పష్టంగా ఉన్నాయో, లేదా, పాఠకునికి ఎట్లా ఎక్కువ సాయపడతాయో కనబడదు. “చేసిరి యడవిన్” అన్నదే “చేసిరడవిన్” అన్నదానికన్నా సుళువుగా ఉంది, త్వరగా అర్థమవుతుంది. నిత్య సంధి నిత్యం ఎందుకు చేయాలి అన్నదానికి మన వ్యాకరణ వేత్తలు ఎటువంటి కారణాలు చెప్పలేదు, చూపలేదు. వైదిక ఆచారంలో నిత్యజీవితంలో సైతం నిత్యకర్మలకు సడలింపు ఉన్నప్పుడు, భాషలో నిత్య సంధులకు ఎందుకు సడలింపు ఉండకూడదో అర్థంకాదు.
ఎంతసేపూ పూర్వకవులు ఇట్లా వ్రాయలేదనే ఎత్తి చూపడంలో కనపరచే పాండితీ ప్రకర్ష(అది పాండిత్యం కాకపోయినా సరే!) భాషను చైతన్యవంత పరచే రకంగా, బహుళంగా వాడుకలోకి తేవడానికి సాయపడే రీతిలో ప్రామాణికాలను ఏర్పరుచుకుంటూ పోవాలనే దార్శనికత
లేకపోవడం వర్తమానంలో మాత్రమే కనిపిస్తున్న లోపం కాదని తెలుస్తుంది. శతాబ్దాలనుంచి మనకు సంక్రమిస్తున్న దీర్ఘకాలిక రుగ్మత అనిపిస్తుంది. అంటే, ఎవరు ఎట్లా వ్రాసినా స్వీకరించి ఆదరించాలని కాదు. ఏ ఏ రూపాలను ఎత్తి చూపి విమర్శించినప్పుడు అవి ఏ విధంగా సరిగ్గా లేవు, ఏం చేస్తే మెరుగైన స్పష్టమైన రీతిలో వ్యక్తపరచవచ్చు, ఏ రూపాలను స్వీకరిస్తే భాష వ్యాప్తికి దీప్తికి కారకాలు, అన్నదానిపై ధ్యాస తక్కువగా, ఏదో ఒక సూత్రానికి విరుద్ధంగా ఉంది కాబట్టి చెల్లదు అనడం లో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాకరణ సూత్రాలకోసం భాషను నియంత్రించడం మన వ్యాకరణవేత్తల ప్రధాన కర్తవ్యంగా కాకపోయినా, బలమైన వ్యసనంగా అనిపిస్తుంది. భాషకు బలం కూర్చి, వరం కావలసిన వ్యాకరణం, బలహీన పరచే శాపంగా మారిందేమో అని పెద్ద చెడ్డ అనుమానం.
===========
విధేయుడు
శ్రీనివాస్
రామారావు గారూ!! దబాయించవలసిన అవసరం నాకేమీ లేదు. మీరు అంత ఎమోషనల్ గా మాట్లాడ వలసిన పని కూడా లేదు. ఇది విమర్శకి సంబందించిన విషయం. “ఆధునిక” దృష్టి కానిది అసలు ఎలా ఉంటుందో అన్న వెటకారపు గొంతుని మీరే ప్రదర్శించారు. అందుకు మనం ఎంతగా ఈ “ఆధునికత” ని నెత్తిన వెసుకుని మోస్తున్నదీ నేను చెప్పవలసి వచ్చింది. సమస్య నాకేమీ లేదు. ఆధునికంగానే క్లాసిక్స్ తాలూకు పరిశీలన ఉండాలని, ఉంటుందనీ మీ భావన కావొచ్చు. అందువలనే ఆధునికత లేనిది అసలు ఎలా ఉంటుందో కూడా మీరు ఊహించలేకపోయారు మరి. ఇంతకీ అది తెలియనిదీ అర్ధం కానిదీ మీకే గనక అది మీ సమస్య. నా సమస్య కాదు. ఇంక వ్యాసకర్తకి ఈ అనువాదకుని సహాయం అంత అవసరం లేదనుకుంటాను తన వ్యాఖ్యానానికి గానీ తన విశ్లేషణకి గానీ! బ్రిటీషు విద్యలు “ఆధునిక మైనవని” మనదేశం లోని “ఆధునిక” ప్రభావాలకి కారణం ఇంగ్లీషు విద్యలని నేనే చెప్పనఖ్ఖర లేదు. అది నారాయణ రావు వ్యాసమే చెబుతున్నది. ఆయన శీర్షికా అదే! విశ్లేషణా అదే!! విషయమూ అదే!! మీరు అన్నీ కట్ట కలిపేసి దెబ్బలాటకి దిగుతున్నారు మరి ఎందుకో?? నేను అన్న మాటలకి సంబంధించి మాత్రమే నేను మాట్లాడగలను గానీ మీరు చేసే రకరకాల వ్యాఖ్యానాలకి నేను బదులు ఇవ్వను. వ్యాసం లోని విషయాలకీ వివరాలకీ వ్యాసకర్త మాత్రమే భాద్యుడు గానీ అనువాదకుడు కాదు. అది మీ వ్యాసం కాదు కద.
మీకు ఆధునికం కాని విషయాలూ వ్యాఖ్యానాలూ ఉంటాయనీ వాటికి కూడా అంతే విలువ ఉంటుందనీ తెలిస్తే నా అభిప్రాయం అర్ధం అవగలదు. మీరు అన్నమాటకే నేను జవాబు ఇచ్చినది. మీరసలు ఆ మాటే అనలేదని అంటే అక్కడే అచ్చు అయి ఉంది మీ అభిప్రాయం. వెనక్కి వెళ్ళి మరోసారి మీ అభిప్రాయాన్ని చదువుకోగలరు.
బింబం గురించి Sri Krishna అభిప్రాయం:
08/20/2012 7:24 am
చాల చక్కని కధ. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కధ ఇది. మీనాక్షి తల్లిలా ఎంతమంది స్త్రీలు తమ ఆశలను ఆశయాలను చంపుకుని భర్త కోసం పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారొ అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్త్రీ మూర్తులు ప్రతి ఇంటికొకరు ఉంటున్నారు. చక్కని కథ వ్రాసిన చూడామణిగారికి అభినందనలు.
ఉరుము ఉరిమి… గురించి sairam అభిప్రాయం:
08/18/2012 1:37 pm
దమయంతి గారూ! కథ బాగుందండీ.
స్మృతి గురించి Kalyan అభిప్రాయం:
08/17/2012 10:46 am
హృదయం లో బాధ యధాతధంగా కవిత రూపం లో ఆవిష్కృతమైంది
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తః తః అభిప్రాయం:
08/16/2012 11:29 pm
” …..ప్రముఖ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, గ్విన్ (1985) రాసిన వ్యాకరణం వరకూ గత రెండు శతాబ్దాల కాలంలో ఎన్నో తెలుగు వ్యాకరణ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఈ ఆధునిక వ్యాకరణ గ్రంథాల గురించి మరింకెప్పుడైనా చర్చించుకుందాం.”
సురేశ్: మీ ఈ వ్యాసం కొసం ఎదురు చూస్తున్నను.
తః తః
దీపఖేల గురించి pardhasaradhi అభిప్రాయం:
08/16/2012 8:33 pm
స్వర రచన: మనం ఏదైతే ఒక పాటకి సంగీతంలో ఒక రాగాన్ని తీసుకుని ఆ రాగంలో స్వర పరిచి పాడతామో అది. అదే పాటకి చివరలో ఏదైనా ఒక మంచి అర్ధవంతమైన లైనుకి ఆ రాగంలో స్వరస్థానాలు తప్పకుండా వివిధ ప్రయోగాలతో స్వరవిన్యాసాలు చేస్తూ పాడితే అది స్వరకల్పన.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి తఃతః అభిప్రాయం:
08/15/2012 5:56 am
‘ఆధునికత’ అంటే ఎలాంటిది. అమ్మానాన్నల్ని లంగా, ఓణీలతో బడికి వెళ్తున్నప్పుడు చూసిన కళ్ళతో కాక కోకా రైకలతో ఇద్దరు ఎదిగిన పిల్లల్ని పక్కనుంచుకుని, వారసత్వపు చట్టాల పరిజ్ఞానంతో ఆస్తులు పంపకానికి వచ్చినప్పుడు చూసే కళ్ళతో చూడటం లాంటిదా? వాల్మీకినీ, నన్నయనీ ఇప్పుడు యెలా చూడాలి? ‘మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక’ అన్నాడు త్యాగరాజు. ఆయనని ఇప్పుడు యేం చేద్దాం?
హోమగుండం: కథ నచ్చిన కారణం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
08/15/2012 2:09 am
స్త్రీ సహనానికి అగ్ని గండం
ఈ హోమ గుండం!
ముందు మాట:
జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి గురించి నేనింతకు ముందు కొంత విన్నాను. కొందరు ప్రముఖులు ఆయన గురించి రాయగా చదివాను. కానీ, నేనెప్పుడూ ఆయన రచించిన పుస్తకాన్ని చూడలేదు. చదవలేదు.
అలాంటి జరుక్ శాస్త్రి గారు! ఎంత మంచి కథ రాసారూ!? అని ఆశ్చర్యమైంది, అబ్బురమైంది- నాకు. ఈ కథ పూర్తిగా చదివాక, నా మనసుకేమీ తోచనట్టైంది. ఉక్కపోతేసింది. కాసేపు చల్ల గాలి కావాలనిపించింది. కారణం -ఆ స్త్రీ మూర్తి నా కళ్ళ ముందే – మంటల్లొ పడి కాలిపోయిన భావన వల్ల కావొచ్చు. అలా అని ఈ కథ బాగుంది అని పొగిడినా, లేదా -, ఈ రచయిత ఆ కారెక్టర్ ని భలే అద్భుతంగా చిత్రీకరించాడని సంబర పడ్డా, అది చాలా దుర్మార్గ గుణమై పోతుంది.
కారణం – ఇది కథ కాదు. జీవితం. ఇందులోనివి పాత్రలూ కావు. అవి అచ్చు- పోత పోసిన మనం. మన్లోని మన మొచ్చి ఇక్కడ మనకెదురుగా కనిపిస్తున్నట్లుంటాయి. ఎప్పుడూ ఎవరమూ చూడని సంకుచితాలు హనుమంతునిలో తాండవమాడుతున్నట్టుంటాయి.
ఈ రచనలో పాఠకులని కదిలించే విషయం ఏమిటంటే: ‘పెళ్ళినాడే మొగుడు. ఆ తర్వాత యముడు..’ అనే పెద్దల పెద్ద సూక్తి మనకుచప్పున స్ఫూరణకొస్తుంది- ఈ రచన చదివాక! ఆనాటి హనుమంతరావు – అప్పట్నుంచీ కథలోనే కాదు, ఇప్పటికీ ఈ సమాజంలో (చావకుండా) ఇంకా ఇంకా బ్రతికే వున్నాడు. విషాదమేమంటే – అప్పట్నుంచి వరసగా చస్తోంది కేవలం నరసమ్మ లాంటి భార్యలు మాత్రమే! పెళ్ళి పేరు మీద హోమ గుండానికి ‘ పవిత్ర బలి’ అవుతున్న నరసమ్మ వంటి ఇల్లాళ్ళు నానాటికీ సంఖ్యా పరంగా పెరుగుతున్నారే తప్ప తరగడం లేదనేది అక్షర సత్యం. కాదు, అంకెల సాక్ష్యం.
అందుకే ఈ కథ 60 యేళ్ళ తర్వాత చదువుతున్నా, – ఈ రచన ఈ కాలందే అని తోస్తుంది. ఇప్పుడే తాజాగా రాసినట్టుంటుంది. రాతి యుగం నుంచి, నేటి యుగం దాకా మానవ జీవనం లో ఎన్నెన్ని ఆధునిక మార్పులు జరిగినా, మారంది మాత్రం ఒకటే – స్త్రీ సామాజిక స్థితి. “స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకానికి నిజమైన సమాధానం వుందా? వుంటుందా? ఈ అంశం మీద రాసిన కథే ఈ హోమ గుండం. కథకి భాష్యం ఈ వాక్యం.
‘కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి. – అని మీరన్నారు కానీ, నా కైతే ఈ కొటేషన్ ఆరంభం లో వుండటమే నూటికి నూరు పాళ్ళు సమంజసమనిపించిందండీ! (కారణం. వ్యక్తి గతం కావొచ్చు. నాక్కూడా ఇలా ప్రముఖుల జీవన సత్యాల సూక్తుల్ని ముందుంచి కథలు రాయడం అంటే ఎందుకో ప్రియం! కథకి మంచి పట్టు వుంటుందనిపిస్తుంది. ఇది కేవలం నా వ్యక్తిగత ఇష్టం మాత్రమే.)
ఇది మాత్రం నిజం: మీకు నచ్చిన కథగా ఇది ఈమాట లో చదవకుంటే అస్సలకీ కథ నేనెప్పటికీ చదివే అవకాశం నాకు వచ్చుండేది కాదు. నరసమ్మ- నా కళ్ళల్లో కన్నీరై మిగిలేదీ కాదు. ఇది మాత్రం నిజం.
ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే ఈ కథ మీకు నచ్చిన వైనాన్ని చదివి, ఇంప్రెస్సయి – అప్పుడు కథలోకి వెళ్ళాను. ఆ వివరణే లేకుంటే ఈ శాస్త్రి గారి కథ చదవడాన్ని పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత చదవనూ చదివేదాన్ని కాదు. ఇంత గుర్తైన జ్నాపకం మిగిలేదీ కాదు. ఇది వాస్తవం.
అసలు కధ లో కొస్తే: హనుమంత రావు లాంటి మగాళ్ళు కొందరు గొప్ప కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆ తర్వాత తెగ పశ్చాత్తాపంలో ముణిగి తేలుతారు. ఆ మూణ్ణాళ్ళ ముచ్చట తీరాక ‘ఆపరేషన్ తర్వాత వెన్నుకి పొడిచిన మత్తు వొదిలి, కేవలం నొప్పి మాత్రమే మిగిలిన పేషెంట్ లా గిలగిలా కొట్టుకుంటాడు. ఆశయం కోసం ప్రయాసగా ఆశ్రయించిన కరుణా, జాలి, ఉన్నత తత్వం అంతా కూడా దయ్యం వొదిలినట్టు వొదిలి, ఇహ అసలు స్వరూపం చూపిస్తారు. ఇట్లా! హనుమంతునిలా! ఇతగాడు పెళ్ళి చేసుకోకుంటే నరసమ్మ గారు ఏ పాచిపనో చేసుకుని హాయిగా బ్రతికుండేది కాదూ? ఈయనగారూ చేసుకున్న ‘వెధవ వివాహం వల్ల కాదూ’ దహనమై పోయిందీ!? అనే నిజాన్ని నిగ్గు తేల్చారు శాస్త్రి గారు!
ఏ కాలం కథా? ఇదెప్పటి కథా!? ఈ హోమ గుండం 1945 కాలం నాటిదైతే మాత్రమేం ఈ నాటి పురుషహంకార ప్రపంచానికి చక్కగా మచ్చ లేని అద్దంలా నిలుస్తుంది.
వేలూరి గారి మాటల మీద నాదొక మాట: ‘అయితే, హనుమంతరావులో నరసమ్మ పరంగా ఎందుకు అసహ్యం కలిగిందో చెప్పటం కష్టం. అతనికి చిరాకు పెరగటం, చివరకి నరసమ్మని కొట్టడం కూడా జరుగుతూంది; అనుమానంతో!‘ అని మీకు అనిపించింది కానీ నాకైతే ఆ కారణం శుభ్రంగా కళ్ళక్కట్టినట్టు కనిపించనూ కనిపించింది.
* ఎవరో దోస్త్ ఏదో అనుంటాడు. ‘తొందర పడ్డావురా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలని. ఎలాగూ ఆదర్శ వివాహం చేసుకునే వాడివి. పెళ్ళం వెనక కాసింత వున్న దాన్ని చేసుకుంటే కష్టాలుండేవి కావుగా అంటూ ఫలానా వారమ్మాయిని ఉదహరించి వుండొచ్చు. లేదా ఆ బుధ్ధి హనుమంతుని లోనే కలిగీ వుండొచ్చు. (కోతి కదా!, పురుషుణ్ని కాదు నేనంటోంది. అతని బుధ్ధిని.)
‘ఆర్యసమాజపు సంస్కర్తలని విమర్శిస్తున్నాడో, సమాజంలో గొప్ప కోసం వేసుకున్న అభ్యుదయపు ముసుగులో ఇమడలేక నలిగిపోయే అసమర్థులను ఎత్తిచూపుతున్నాడో – రచయిత ఉద్దేశ్యం మనకు అర్థం కాదు. ‘- వేలూరి గారు.
* ఎవర్ని విమర్శించినా, ఇంచకున్నా ఒక కుత్సిత మనస్కుణ్ని మన ముందుంచారు రచయిత. ఇంకా నిజం చెప్పాలంటే – ఒక స్త్రీని సరిగ్గా అర్థం చేసుకోగల మనస్తత్వం కేవలం ఒక పురుషునికి మాత్రమే సాధ్యం అనే నాలాంటి వారి ఒక అంచనాని, ఇక్కడ ఈ రచయిత అక్షర సాక్షిగా నిరూపించారు.
రచనలో రవ్వల్లాంటి మాటలివి:
* నా కోసం అనే ముక్క ప్రేమ ఉన్న చోట యెంత దివ్యాస్త్రమో, కాని చోట అంత విషం. (నాకెంతో అద్భుతం అ నిపించిన కొటేషన్ ఇది.)
* కోపం మీద ఉన్నప్పుడు సర్వేంద్రియాలు బెదిరిన ఫుర్రల్లాగా పనిచేస్తై.
* తాను ఏంచేసినా తప్పే అవుతోంది. పోనీ – యిది చెయ్యి. నాకు యిలాగ వుండాలి అనడు. తన బుధ్ధికి తోచినట్లు చేస్తే – పురుగేరినట్లు మాట్లాడతాడు. (దరిదాపు ఈ కథ రాసి అరవై యేళ్ళు కావస్తోంది. ఇప్పటికీ సగటు మగవాని మనస్థత్వం ఈ పంధా లోనే సాగుతోంది)
* బందిలి దొడ్లో పడ్డా ఆవులాగా ఆమె ఆ రాత్రి ఏమీ తినలేదు. సుఖపెట్టి సుఖపడదామంటే- లోకంలో చోటు తక్కువా.
* దేవుడి పఠాలకు హారతి వెలిగిస్తుంటే- చీర అంటుకుని నరసమ్మ చచ్చిపోయిందటా అనుకున్నారు! (భార్యని చంపేసిన – ప్రతి మొగుడూ చెప్పే కారణం ఇలాగే వుంటుంది.)
ముగింపు – స్త్రీ లోకాన్ని ఆవేశానికి గురి చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. పొరబాటున హనుమంతుడి వంటి వాణ్ణి వివాహమాడినా నరసమ్మలా చావకూడదు అనే నిజాన్ని చెబుతుంది.
నా కితాబు: కథలందరూ రాస్తారు. అందరు రాసేవీ అవే అక్షరాలు. కాని, కొందరి చేతుల్లోనే అవి జీవితాలవుతాయి. గుండె మీద రాలి పడే కన్నీటి పుష్పాలవుతాయి.
ముగింపు: రచయిత శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ( జరుక్ శాస్త్రి ) గారికి అంజలి ఘటిస్తూ.. తనకు నచ్చిన ఈ అపురూప కథని ఈ మాట పాఠకులకందించి, సాహిత్య పిపాసుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారికి కృతజ్ఞాభినందనలు తెలియ చేసుకుంటూ,
నమస్సులతో –
అభిమాన పాఠకురాలు
-ఆర్.దమయంతి.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/15/2012 12:13 am
ఎన్నో తెలియని ఆసక్తికరమైన విషయాలను ఎంతో ఓపికతో పరిశ్రమతో సంగ్రహించి అందించినందుకు సురేశ్‌కు చాలా కృతజ్ఞతలు.
ఆలోచింపజేసే వ్యాసం. తెలుగుభాష దినదిన ప్రవర్ధమానంగా కాక, దినదిన గండంగా నెట్టుకొచ్చే స్థితికి చేరుకోవడానికి కొన్ని కారణాలను కూడా అందిస్తుంది. మన పండితులు, వ్యాకరణవేత్తలు ఎప్పుడో వెయ్యేళ్ళ కింద నన్నయ “చేసిరి యడవిన్’ అన్నాడనీ, “చేసిరడవిన్” అనలేదని, లేక ఎన్నో శతాబ్దాల కింద తిక్కన “చేసిరి యంత” అన్నాడనీ, “చేసిరంత” అనలేదనీ, ఎత్తిచూపడం, విమర్శించడం ఆశ్చర్యపరుస్తుంది. వ్యాకరణానికి ఒక ప్రామాణిక గ్రంథంగా గౌరవించబడే “అప్పకవీయం” సైతం, శ్రీనాథుడు “కూర్చుండిరి యొండొరున్” అని సంధి చేయలేదని విమర్శించడం ఆశ్చర్యకరం.
ఉటంకించిన ఉదాహరణలలో, తప్పు అన్న రూపాలకన్నా, సరి యని చూపినవి ఏ రకంగా ఎక్కువ స్పష్టంగా, లేదా తక్కువ అస్పష్టంగా ఉన్నాయో, లేదా, పాఠకునికి ఎట్లా ఎక్కువ సాయపడతాయో కనబడదు. “చేసిరి యడవిన్” అన్నదే “చేసిరడవిన్” అన్నదానికన్నా సుళువుగా ఉంది, త్వరగా అర్థమవుతుంది. నిత్య సంధి నిత్యం ఎందుకు చేయాలి అన్నదానికి మన వ్యాకరణ వేత్తలు ఎటువంటి కారణాలు చెప్పలేదు, చూపలేదు. వైదిక ఆచారంలో నిత్యజీవితంలో సైతం నిత్యకర్మలకు సడలింపు ఉన్నప్పుడు, భాషలో నిత్య సంధులకు ఎందుకు సడలింపు ఉండకూడదో అర్థంకాదు.
ఎంతసేపూ పూర్వకవులు ఇట్లా వ్రాయలేదనే ఎత్తి చూపడంలో కనపరచే పాండితీ ప్రకర్ష(అది పాండిత్యం కాకపోయినా సరే!) భాషను చైతన్యవంత పరచే రకంగా, బహుళంగా వాడుకలోకి తేవడానికి సాయపడే రీతిలో ప్రామాణికాలను ఏర్పరుచుకుంటూ పోవాలనే దార్శనికత
లేకపోవడం వర్తమానంలో మాత్రమే కనిపిస్తున్న లోపం కాదని తెలుస్తుంది. శతాబ్దాలనుంచి మనకు సంక్రమిస్తున్న దీర్ఘకాలిక రుగ్మత అనిపిస్తుంది. అంటే, ఎవరు ఎట్లా వ్రాసినా స్వీకరించి ఆదరించాలని కాదు. ఏ ఏ రూపాలను ఎత్తి చూపి విమర్శించినప్పుడు అవి ఏ విధంగా సరిగ్గా లేవు, ఏం చేస్తే మెరుగైన స్పష్టమైన రీతిలో వ్యక్తపరచవచ్చు, ఏ రూపాలను స్వీకరిస్తే భాష వ్యాప్తికి దీప్తికి కారకాలు, అన్నదానిపై ధ్యాస తక్కువగా, ఏదో ఒక సూత్రానికి విరుద్ధంగా ఉంది కాబట్టి చెల్లదు అనడం లో ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాకరణ సూత్రాలకోసం భాషను నియంత్రించడం మన వ్యాకరణవేత్తల ప్రధాన కర్తవ్యంగా కాకపోయినా, బలమైన వ్యసనంగా అనిపిస్తుంది. భాషకు బలం కూర్చి, వరం కావలసిన వ్యాకరణం, బలహీన పరచే శాపంగా మారిందేమో అని పెద్ద చెడ్డ అనుమానం.
===========
విధేయుడు
శ్రీనివాస్
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/14/2012 2:11 pm
రమ గారు: ఎవరు దబాయిస్తున్నారో దెబ్బలాటలకి దిగుతున్నారో ఎమోషనల్ గా వున్నారో పాఠకుల్ని నిర్ణయించుకోనివ్వండి. You’ve made your points. Time to move on.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
08/14/2012 1:43 am

రమ.