పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి శ్రీధర, శ్యాం అభిప్రాయం:

    09/28/2012 7:20 pm

    “రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.”

    రాళ్ళపల్లి వారు సంస్కృతాన్ధ్ర ప్రాకృత కన్నడ భాషా పండితులు, కవి, వాగ్గేయకారుడు, సంగీత శాస్త్రజ్ఞుడు. ఆయన విషయ జ్ఞాన పరిధి, లోతు రెండూ ఎక్కువే. (అయినా కూడా ఆయన అభిప్రాయం వేదంగా తీసుకోనవసరం లేదు, మన ఆలోచన స్వేచ్ఛ మనది).

    సంగీతం లో సాహిత్యం పై ఆయన AIR ముఖాముఖిలో క్లుప్తంగా “రామ నీ సమానమెవరు” పంక్తితో ఉదహరించినారు.

    భావం అనేది నిర్వికారం. దానిని వ్యక్తపరచడానికి భాష కావాలి. రాళ్ళపల్లి వారు మహా పండితులు, అన్నమాచార్యుల “project” కు ఒక రూపు ఇచ్చిన భక్తి సంపన్నులు, కాబట్టి “రామ నీ సమానమెవరు” ఎన్నుకున్నారు. (ఈ రెండు గుణాలు ఏ కోశాన లేని నేను) దీనికి ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మన గద్దర్ పాటలు శుభపంతువరాళి లో పాడుతే రక్తం ఉడికి ఉఱ్ఱూతలు ఊగదు సరి కదా, నేనైతే పోయి గద్దర్ ను తిరిగి కొట్టిఉండే వాడిని. పోనీ, గద్దర్ పాడినట్లుగానే, అదే ఊపుతో “గోంగూర పచ్చడి” గురించి పాడుతే, నీ రక్తం మరగదు కదా, కాబట్టి సాహిత్యం ప్రధానం, అని ఇచట సాహిత్య పిపాసులు అడగవచ్చు! కానీ, ముందుగా చెప్పినట్లు భావం ప్రధాన్యం, ఆ ఆక్రోశం పెల్లుబికడానికి ఆ భావం మాటలను/పదాలను/వాక్యాలను నిర్దేశిస్తుంది, కాబట్టి ఆ భావానికి వ్యక్తపరచ తగు మాటలు ఎన్నుకోబడతాయి. (గోంగూర పచ్చడి లో కారం దట్టిస్తే, రక్తమేమి, పంచ ప్రాణాలు మరగవచ్చు, అది వేరే చర్చ!) అందువల్లే, ప్రసిద్ధ వాగ్గేయకారులు చాలా మటుకు స్వరాలను బట్టి సాహిత్యం కూర్చారు అని వింటూఉంటాము.

    భావ ప్రకటనకు అనేకులు అనేక సాధనాలు వాడుతారు, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పాలు చెక్కడం, నాట్యం, సంగీతం ఇత్యాదివి.

    నాట్యానికి, సంగీతానికి ఒక చిక్కు ఏమిటంటే, అవి ఒక సకార/సగుణ సందేశం ఇవ్వదలుచుకుంటే, భాష అవసరమవుతుంది. నీళ్ళు, మంచు గడ్డ ల వలె, సంగీతానికి సాహిత్యం సకార రూపం ఇస్తుంది. కేవలం నిరాకార సంగీతానికి సాహిత్యం అనవసరం.

    సంగీత ప్రదర్శనలోని ముఖ్యాంశంలో, సింహ భాగం ఆలాపన, నెరవు, స్వరవిస్తారాలవే. పాడే సాహిత్యం లో కూడా పల్లవి లోని పదాలను రకరకాలుగా విరిచి, స్వర గమకాలతో వేరు వేరు కాలాలలో సంగీత విన్యాసాలతో అలంకరించి గాని అనుపల్లవి, చరణాలకు పోరు. అంటే ఆలాపన (నిరాకార రూపం) తో ఒక విస్తారమైన వేదిక ను ఏర్పాటు చేసి, దానిపై (సకార రూపం) సాహిత్యాన్ని ప్రవేశ పెట్టి, తరువాత స్వరకల్పన (మళ్ళా నిరాకార రూపం) తో ముగిస్తారు.

    అసలు “సాహిత్యం” అనే పదమే ఒక పెద్ద చిక్కు. “సాహిత్యం” అనే ప్రౌఢ శబ్దం వినగానే నాకైతే, ఛందస్సులు, అలంకారాలు, ఉపమానాలు, సమాసాలు ఇవన్నీ గుర్తొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. (ఈ సంచిక జెజ్జాల మోహన వ్యాసానికి గగుర్పాటు కూడా వచ్చింది). “సాహిత్యం” బదులు lyrics/మాటలు అనే కొంచం సాధారణ పదం వాడి ఉంటే, సాహిత్య పండితులు, పాటలలో తద్ సాహితీ సూక్ష్మాలు, విశేషాలు శోధించే వారు కారేమో!

    అన్నమయ్య కీర్తనకారుడు, కాబట్టి ఆయనను ఈ చర్చలోకి లాగకూడదేమో!

    ఇహపోతే, భావం ముఖ్యం, మిగతాది బావి లోకి అనేది కూడా పూర్తిగా సమర్థనీయం కాదేమో, ఎందుకంటే కృతికర్త యొక్క సందేశం సాహిత్యం లో పొసిగి ఉంటుంది. కాకపోతే భాషేతరులలో స్వల్ప సాహిత్య దోషం సంగీత దృష్టితో చూడాలి.

  2. నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి karthik అభిప్రాయం:

    09/28/2012 4:47 pm

    షడ్జా మాధ్జ కరాద్జ వీడ్జ వసుధ జాలాంస మాధ్జ కిరె
    కిద్జె కిత్కితి కిత్కితి కితిధరె సద్జూర విద్యబ్రమ
    లుద్బ్రహ్మ్ లుద్బ్రహ్ మరుద్బ్రహ్ రుద్బ్రహ్ విపిథాత్ ఘడ్ ఘడ్ ఘ ఘడ్ ఘడ్ ఘహ
    పౌతా టేటి పతేటి టేటి తుర సత్ప్రక్షాతి సత్యదయ :

    This poem was rendered by kalidasa in the court of bhoja raja (my speculation). Along this they were another three poems of same type — if any of you know those poems, kindly post them. I would be thankful to anyone for posting more details of the above poem as well.

  3. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Sridevi Josyula అభిప్రాయం:

    09/28/2012 3:16 pm

    శ్రి సాయి బ్రహ్మానందం గారు, మీ ఈ వ్యాసం చాలా బాగుంది. ఎన్నో మంచి విషయాలు విపులంగా వివరించారు, కృతజ్ఞతలు. శ్రిదేవి.

  4. ఒక సరళ నిర్వచనం గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    09/28/2012 9:58 am

    చాలా బాగుంది నారాయణ గారు.
    “ఒకరు(లు) మరొకరు(లు)ని
    కనుమరుగు చేసేస్తూ వ్యాపించే
    అందమైన అబధ్ధం లాంటి నిజం పేరు
    నాగరికత.”

    నచ్చింది.

  5. వర్ష రచన గురించి Prasad అభిప్రాయం:

    09/28/2012 9:06 am

    “ఊరి మీద వాన చినుకు లేదు
    చర్మం వలిచిచ్చినా
    చెమటారనియ్యని
    బంగాళాఖాతం”

    ఈ వాక్యాలతో Humidity ఉందని వివరిస్తున్నారా?

  6. చెట్టు కింది మనుషులు గురించి Prasad అభిప్రాయం:

    09/28/2012 8:56 am

    నాకు అర్ధం కాలేదు కొద్దిగా వివరిస్తారా? మీరు ఎంచుకున్న theme ఏంటి?

  7. రాత్రి నృత్యం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    09/27/2012 7:56 pm

    Just now seen this English translation.

    I am very happy that somebody actually took pain to translate this poem.

    Don’t know whether Mr. Satyananda kumar garu is still following eemaata or not, but I want to ask him if I can use this translation any where else.

    Thank you very much.
    Indrani Palaparthy.

  8. చెట్టు కింది మనుషులు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    09/27/2012 12:52 pm

    మాటల్లో రంగుల
    పూసల దండలున్న
    వీళ్ళ ఆకలి కేకలకు
    రంగుల అకాశం క్రింద ఉన్న
    ఊడల మర్రిచెట్టు మీదనుంచి
    పారిపోయిన బ్రహ్మరాక్షసుడు

  9. రంగనాధునివా రాతిబొమ్మవా గురించి sridevi అభిప్రాయం:

    09/27/2012 12:16 am

    పాట చాలా బాగుంది. రచన బాగుంది. పద్మావతి గారు చాలా బాగా పాడేరు. స్వరరచన కూడా చాలా చాలా బాగుంది. వీలుంటే ఇద్దరి ఫోన్ నం. ఇవ్వగలరు.

    sridevi

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి K.VENKATESWARLU K.V అభిప్రాయం:

    09/26/2012 12:06 pm

    ఇదొక అద్భుత శ్రవణం. జీవితములో నా కోరిక నేరవేరింది. శ్రీనివాస్ గారు మీ జీవితం ధన్యము.

    అఖిలాంధ్ర ఆబిమాన నటి సావిత్రి స్వరం విని మనసు వుయలూగింది. అంతలోనే హృదయం బరువెక్కింది. ఒక తోబుట్టువు ఎదుట నిలిచింది.