పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. ఇటు నేనే – అటు నేనే గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    10/17/2012 12:30 pm

    నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.

  2. అస్తిత్వానికి అటూ యిటూ … గురించి MOHAN అభిప్రాయం:

    10/17/2012 3:01 am

    మీరు స్వయంగా అనుభవించిన బాధల్ని సంజీవి రూపంలో చూపారని చదవగనే అర్థం అవుతోంది. కానీ, నాలుగు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని నాలుగు పేజీలకు లాగిన మీ రచనకు కించిత్తు ఆశ్చర్య పోతిని. మొత్తమ్మీదా శైలి బాగుంది. అంతా చదివాక ఓస్ ఇంతేనా అనిపించింది.

  3. తెలుగు భాష వయస్సెంత? గురించి sukanya అభిప్రాయం:

    10/16/2012 10:05 am

    మన మాతృభాష తెలుగునకు ఇంతటి ఘనమైన చరిత్ర ఉందని మీ వ్యాసం చదివే వరకు తెలియదు. నిజంగా గర్వంగ ఉంది. దేసభాషలందు తెలుగు లెస్స అన్న నానుడి నిజం. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు ఈ వ్యాసం చదివి తెలుగు గురించి తెలుసుకోవాలి.

  4. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి sravan bharadwaja అభిప్రాయం:

    10/15/2012 3:49 pm

    Excellent writing! Better late than never. I love Tyagayya’s compositions and I somehow still fail to understand as to why a Teluguite never embraces Tyagayya as easily as he does when it comes to Annamayya and Sri RamaDasu. May be it’s time we’ve made a movie on him that can encompass all his life’s mysteries. Thank you once again for writing this wonderful article and I believe Eemata is doing a FINE job indeed!

  5. మస్తానీ గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:29 am

    బాజీరావు-మస్తానీల అపురూప ప్రణయగాథ ఉత్తరభారతదేశవాసులకు పరిచయం ఉన్నంత దక్షిణాత్యులకు తెలియదు. కాని ఇదొక అపూర్వగాథ. అతను యుద్ధరంగంలో పోరాడిన ప్రతి పోరూ గెలిచిన జగదేక వీరుడు ఆమె అలౌకిక సౌందర్యం మూర్తీభవించిన అతిలోకసుందరి. నిజానికి ఈ గాథ షాజహాన్ ముంతాజ్ ల ప్రణయాన్ని మించి ప్రాచుర్యం పొందవలసింది. ఇద్దరి పరిణయాన్నీ చాలా చక్కగా వర్ణించారు.

  6. స్మరణ: కథ నచ్చిన కారణం గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:19 am

    కథ నచ్చిన కారణం అనగానే కాస్త విశ్లేషణ ఊహించుకుని ఉస్సూరన్నాను చివరికి. ఈ వ్యాసం పేరే నన్నలా తప్పుదోవ పట్టించింది. కథాపరిచయం అంటే సరిపోయేది.

  7. రచయితలకు సూచనలు గురించి pavan santhosh surampudi అభిప్రాయం:

    10/14/2012 10:11 am

    గత కొన్నాళ్ల నుండి ఈమాట చూస్తున్నాను. తెలుగు ప్రింట్ మీడియాలో గాని అంతర్జాలంలొ కాని ఈమాటకి సరితూగగల సాహిత్య పత్రిక లేదని నా అభిప్రాయం. ప్రత్యేకంగా నాకు ఇది ఒక నిధిలా ఉంది. పాత సంచికల ఖజానా ఎంత చదివినా మరిన్ని ఆణిముత్యాలు దొరికి నన్ను మురిపిస్తొంది.
    వేనవేల ధన్యవాదాలతో,
    సూరంపూడి పవన్ సంతొష్,
    తాడేపల్లిగూడెం.

  8. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి G.L.N.Murthy అభిప్రాయం:

    10/13/2012 11:46 am

    ఈ పాటలు నా చిన్నతనంలో వింటూ యుండేవాడిని.కానీ సాహిత్యం తెలిసేది కాదు.సాహిత్యం తెలిసినపుడు పాడడం తెలియలేదు.ఇప్పుడు రెండూ శ్రవణానందకరంగా వినడం ఎంతో ఆనందాన్నికలిగిస్తోంది.ఈ విధంగా ఇటువంటి పాటలు భద్రపరచి ముందు తరాల వారికి అందిస్తూన్న శ్రీ పరచూరి వారు ఎంతైనా అభినందనీయులు. వారికి నా అభినందనలు-గంటి లక్ష్మీ నరసింహమూర్తి-(బెంగుళూరు).

  9. చెట్టు కింది మనుషులు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    10/12/2012 1:16 pm

    Prasad garu:

    Its just based on my observation,about such poorest of the poor.

    No inner/hidden meanings.

    Thanks & Regards
    Indrani Palaparthy.

  10. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి sridevi అభిప్రాయం:

    10/11/2012 12:05 pm

    మా అమ్మ ఈ పాట గురించి ఎంతో చెప్పేది. ఈ పాత వింటె మా అమ్మే గుర్తుకు వచ్చింది మీకు ఎలా thanks చెప్పాలో తెలీడం లేదు. కస్తురి రంగ పాట మా అమ్మ ఎంత బాగ పాడేదొ. మీకు ఎన్నిసార్లు thanks చెప్పినా సరిపోదు. పరుచూరి శ్రీనివాసు గారి email గాని phone number గాని వీలైతే చెప్పరా pl.

    sridevi