పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. రచయితలకు సూచనలు గురించి ఆకుండి శైలజ అభిప్రాయం:

    10/11/2012 11:37 am

    పత్రిక ను మీ స్వీయ పుత్రిక లా తీర్చిద్దినందుకు ప్రధమంగా ఆభినందనలు. మా తండ్రి గారైన స్వర్గీయ ఆకుండి రాజేశ్వరరావు గారి కధలు ఆలనాటి భారతి, ఆంధ్ర పత్రిక(1960-70) మధ్య కాలంలో ప్రచురించబడి యున్నాయి. వాటిని మీ పత్రికలో పాఠకుల కొరకు ప్రచురించడం సాధ్యపడుతుందా… సాధ్య పడితే తెలియ చేయగలరు.

    శైలజ ఆకుండి.

  2. సుప్తశిల – నాటక పుస్తకం గురించి jagadeeshwar reddy gorusu అభిప్రాయం:

    10/02/2012 12:24 pm

    తిలక్‌గారి ‘సుప్తశిల’ నాటిక ప్రతి చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అది నాటకమా? రమణీయ అద్భుత దృశ్య కావ్యం. దీన్ని చదివినప్పుడు కలిగిన అనుభూతే గతంలో శ్రవణ నాటికగా వినప్పుడూ కలిగింది. అహల్యగా శారదా శ్రీనివాసన్‌గారి నటన నభూతో నభవిష్యతి. ఎన్ని సార్లు విన్నా గానీ, ‘ఈ మాట’లో పెట్టిన ఈ సుప్తశిల ప్రతిని చదివేసరికి మనసంతా మబ్బు పట్టేసినట్టు అయింది. తిలక్‌ లాంటి కవి మళ్లీ పుట్టగలడా అనిపించింది.
    – గొరుసు

  3. ఒక సరళ నిర్వచనం గురించి NARAYANA అభిప్రాయం:

    10/01/2012 9:54 pm

    ఆదిత్య గారు,

    ఎంతో ఓపికగా నా కవితను సమీక్షించడమే కాక, మరొక చక్కని కవితను ఉదాహరణగా ఇచ్చారు. ధన్యవాదాలు. చక్కని చిక్కని ఉపమానాలను పదచిత్రాల పూర్వకంగా బాగా అల్లింది. నేను తప్పకుండా మీరు చెప్పిన విషయాలను పరిశీలిస్తాను.

    ధన్యవాదాలు.
    నారాయణ.

    గౌతం గారు,

    మీ తెలుగు భాషాభిరుచికి జోహార్లు. మీ అభిరుచికి ఈమాట ఒక మంచి వేదిక. ఫేసుబుక్కులో మీరు కేవలం లింక్ (URL) ని మాత్రమే షేర్ చేసుకుంటారు కాబట్టి ఈమాటకు మరియు రచయిత (లేదా) కవి కి ఏమీ అసౌకర్యం ఉండదనే అనుకుంటున్నాను.

    ధన్యవాదాలు,
    నారాయణ.

  4. ఒక సరళ నిర్వచనం గురించి gouthampullela అభిప్రాయం:

    10/01/2012 3:19 am

    నారాయణ గారు ,
    చాలా ఆనందంగా ఉన్నది “ఈమాట” చూసిన తర్వాత. నేను మీలా మేధావి వర్గానికి చెందిన వాడను కాను. మీలా కవితలు రాయలేను, పద్యాలు రాయలేను, పదాలని కూర్చలేను, నాకు తెలిసినదల్లా తెలుగు భాష నా మాతృభాష. నా తెలుగు తల్లికి నాకు చేతనయినంత చెయ్యాలన్న ఒక్క సంకల్పమే ఈ రోజున నన్ను ఇక్కడ ఉంచింది. మీరు అనుమతి ఇస్తే నేను ఫేస్‌బుక్ లో మీ ఈ కవితలని, పద్యాలని రచనలని తెలుగు జాతికి మరింత చేరువ చెయ్యటానికి ప్రయత్నం చేస్తాను.

  5. ఒక సరళ నిర్వచనం గురించి aditya reddi అభిప్రాయం:

    09/30/2012 8:01 pm

    నారాయణ గారు ,మీరు దృశ్యాలను స్పురింప జేసే పదజాలం విరివిగా వాడిన మాట నిజమే.

    మనుషులంటే…
    అక్వేరియంలో ఈదులాడే
    ….
    పగటికి రంగులు నింపే సీతాకోకచిలుకలు
    చీకటిని వెలిగించాలని తాపత్రయపడే
    మిణుకు మిణుకు మిణుగురు పురుగులు

    స్వేచ్ఛగా రెక్కలు విప్పిన పావురాళ్ళు… వగైరా వగైరా.

    నేను విన్నది… ఒక మిత్రుడి కవిత కొంత భాగం:

    లోకం …వెలుగు చీరను విడిచి
    చీకటి పాతను చుట్టుకుంటున్న సమయం
    తనపిల్లలను తనేతినే పాములా
    అలల నాలుకలతో
    బుసలు కొడుతుంది సముద్రం
    తీరం పై
    పగిలిన దాక లాంటి గుడిశ లో
    ఎండు చేపల్లా ఉండచుట్టుకు పడుకున్నపిల్లలు
    కడుపాకలి కంట్లో యిసుకై కరకర లాడుతుంటే
    ….
    నీటిపై తాబేలులా కదలాడిన పడవను
    తెడ్డు సాయం తో ఒడ్డుకు చేర్చే సరికి
    చచ్చిన ఏనుగులా చతికిలబడింది

    ఉపమానం వాడటంలో మెళుకవలు, సందర్బోచితంగా వాడటము ,కొత్త కొత్త ఉపమనాలు వాడటము కవితను బలపరుస్తాయి, కదా.

  6. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/30/2012 5:24 pm

    శ్రీధర్, శ్యాం గార్లకి,

    మీరు నేను రాసిన వ్యాఖ్యలో మీకు నచ్చిన ముక్కలు ఏరుకొని మిగతావి వదిలేసారు.
    ­“రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.” అన్న ఒక్కటే మీరు ప్రస్తావించారు. దాని ముందు కొన్ని వాక్యాలున్నాయి. వాటికీ, దీనికీ సంబంధం ఉంది.

    “… ప్రతీ వ్యాఖ్యకి సమయం, సందర్భం ఉంటాయి కదా? వారు ఏ వయసులో, ఏ కాలంలో, ఏ సందర్భమ్లో అటువంటి వివాద వ్యాఖ్యలు చేసారో చూడ్డం చాలా అవసరం. అన్నింటికీ అన్నీ ఆపాదిస్తే వచ్చే చిక్కే ఇది… ” అన్న ఈ వాక్యం వదిలేసి, రాళ్ళ పల్లి వారంటే గౌరవం లేనట్లుగా రాసేసారు. రాళ్ళపల్లి వారు పండితులూ, మేధావీ కాదని నేనెక్కడా అనలేదే! రాళ్ళపల్లి వారు త్యాగరాజూ, మిగతా కొంతమంది వాగ్గేయకారుల పాటలు కొన్నింటిలో చక్కని సాహిత్యం అని మెచ్చుకున్న వారే మరొక సందర్భంలో తుక్కూ అన్నారు. మీకు కావాలంటే రుజువులు ఇవ్వగలను.
    ఒక్క చిన్న విషయంలో విభేదిస్తే వారంటే గౌరవం లేదని కాదు.
    రాళ్ళపళ్ళి వారు పండితులు కాదనీ, వారికి సంగీత సాహిత్యాల్లో అపార జ్ఞానం లేదనీ నేననలేదు.

    “…ముందుగా చెప్పినట్లు భావం ప్రధాన్యం, ఆ ఆక్రోశం పెల్లుబికడానికి ఆ భావం మాటలను/పదాలను/వాక్యాలను నిర్దేశిస్తుంది, కాబట్టి ఆ భావానికి వ్యక్తపరచ తగు మాటలు ఎన్నుకోబడతాయి. (గోంగూర పచ్చడి లో కారం దట్టిస్తే, రక్తమేమి, పంచ ప్రాణాలు మరగవచ్చు, అది వేరే చర్చ!) అందువల్లే, ప్రసిద్ధ వాగ్గేయకారులు చాలా మటుకు స్వరాలను బట్టి సాహిత్యం కూర్చారు అని వింటూఉంటాము…”
    భావం వ్యక్తపరచడానికే మాటలు అవసరం అన్న అర్థం మీ మాటల్లో గోచరిస్తుంది. ప్రసిద్ధ వాగ్గేయకారులందరూ స్వరాలకి సాహిత్యం సమకూర్చడం అని ఎందుకు విన్నారంటే సంగీతకారులందరికీ భాషా నైపుణ్యమూ, ఆసక్తీ వుండవు కనుక. పైగా సంగీతానికి మీటరు ఉంటుంది. అంటే అందులో ఇరికించే పదాలే వాడాలి. ఎంతో పద సంపంద వుంటే కానీ సరిగ్గా ఇమడవు. త్యాగరాజూ, పురందరదాసూ వంటి వారూ ఆశువుగానే కీర్తనలు పాడారనీ వింటూ ఉంటాం.
    చర్చించుకుంటే చాలా వున్నాయి.

    “కేవలం నిరాకార సంగీతానికి సాహిత్యం అనవసరం.” – నిరాకార సంగీత స్థితికి సామాన్యులు చేరడానికి ఓ జీవితకాలం పడుతుంది. ఒకళ్ళో, ఇద్దరో ఆ స్థాయికి చేరి – ‘ఇది అనవసరం, ఇది అవసరం’ అని ప్రతీ దానికీ ఆపాదించడం ఎంతవరకూ సబబు?

    ” అసలు “సాహిత్యం” అనే పదమే ఒక పెద్ద చిక్కు..” పాటకి భావం కావాలి. భావానికి భాష కావాలి. దానికి అందమైన అమరిక కావాలి. అంటే భావం లేని ఒక పాట మామూలు జనాలకి ఎక్కదు కాక ఎక్కదు. వారికి సంగీతంలో ప్రవేశం ఉంటే తప్ప. ఒక పక్క భావం అవసరం లేదంటూ, మరొక పక్క కావాలని చెప్పడం గందరగోళంగా అనిపిస్తోంది.

    నాకు రాళ్ళపల్లి వారంటే అపార గౌరవం వుంది. అలాగే శ్రీపాద పినాకపాణి గారన్నా కూడా. ( అందుకే వ్యాసం రాసాను, ఊసు పోక కాదు )

    -బ్రహ్మానందం

  7. నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి Versa Kay అభిప్రాయం:

    09/30/2012 7:23 am

    Those times were different. Alien concepts of prudishness had not clouded their imagination, Sculptors chiseled great figures of celestials explicitly. Painters painted them in two dimensions. And poets depicted them in multiple dimensions. We are fortunate that a few of these classics still survive, to enthrall people like you and me, time and patience permitting. Nice article.

    I have had occasion to write about another famous poem about the trunk of an elephant, nay, that of Ganesa, in a recent post on my blog.

    Thought you may like to go through.

  8. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/29/2012 1:04 pm

    శ్రీధర్ గారూ, శ్యాం గారూ! మీ అభిప్రాయంలో ఆవేశం పాలు మరీ అధికమైనందువలన కాబోలు, మీరు వ్యక్తపరిచిన విషయం సంపూర్తిగా అర్థస్ఫూర్తిని ఇవ్వడం లేదు.

    సాహిత్యం అన్న పదం ఏ రకమైన సాహిత్యానికైనా వర్తిస్తుంది. కీర్తన కారులు రాసిన మాటలకి వేరే మరో పేరంటూ ఉండదు కదా?? అందునా ఆ వాగ్గేయకారుడు మహా కవులని తలదన్నిన మహా “మాటలెన్నో” [ ఇది మీరు వాడిన మాట సుమా ! ] వాడి వేల సంకీర్తనలని పాడినప్పుడు వాటికి ఒక సాధారణ మైన ఏదో “మాట” ఒకటి వాడటం పొసగదు. తెలుగులో లిరిక్ కి దగ్గరగా ఉన్న మరో పదబంధం వాడినా కూడా ఆయన రాసింది గాఢమైన కవిత్వం. అందువలన గేయ/ పద/పాటల/కృతుల సాహిత్య కారుడిగా కూడా అన్నమాచార్యుడు ముఖ్యమైన వ్యక్తి, తెలుగు సాహిత్యంలో! అందువలన ఏ రాగంలో ఆయన అక్షరాలకి సంగీతకారులు నిరాకార సంగీతాన్ని సమకూర్చినా ఆయన పాడీన ఆ సాకార భావం/కల్పన, విన్న/చదివిన వారి మనసుని గాఢంగా వశపరుచుకుంటాయి. దీన్ని రాళ్లపల్లి వారు స్పష్టంగానే గుర్తించారు. శ్రీపాద వారు అంతగా గమనించలేదు. ఇందుకు కారణం రాళ్లపల్లి సాహిత్యం తెలిసిన పండితులు. శ్రీపాద ఒక్క సంగీతంలో మాత్రమే పండితులు.

    ఇక్కడ అసలు విషయం మరుగున పడిపోయి వేరే విషయాలు ముందుకి చర్చకు వస్తున్నట్టు గా అనిపిస్తున్నది. మీభావం ప్రకారం సైతం మీ వాక్యాలలో ఉన్న అనేక “ఏమో” లు ఇవే చెబుతున్నాయి. మీరు కూడా సాహిత్యాన్ని పక్కకి పెట్టడం భావ్యం కాదనే కదా అంటున్నారు. మరి గొర్తి బ్రహ్మానందం సైతం అదే కదా అన్నది. మీరు ఆయనతో ఎక్కడ విబేధించారూ? బహుశా రాళ్లపల్లి వారి మీద ఆయన అన్నమాట కేమో!

    ఆమాటలో తప్పనిసరిగా తొందరపాటు వినిపిస్తోంది నిజమే! కానీ అది సాహిత్యాన్ని పక్కకు పెడితే కవులకి లేదా కవితాభిమానులకి వచ్చే కోపంలో భాగం గా మాత్రమే కదా గ్రహించాలీ? శ్రీపాద పినాకపాణి గారికి సంగీతం ప్రధానమూ, కృతి లోని సాహిత్యం అటు తరవాతాను. కానీ తెలుగు కృతి మీద ప్రేమ ఉన్న ఎందరికో సంగీతంతో పాటు అందులోని సాహిత్యమూ అంతే ముఖ్యమైనదని ఈ చర్చల పర్యవసానం! ఇందులో “సాకార భావం” సైతం ఆస్వాదించ గలిగిన తెలుగు వారు తప్పనిసరిగా సాహిత్యం వైపు మొగ్గే వీలుంది. శ్రీపాద పినాక పాణి గారు మొగ్గలేదు. అందుకు పైన ఒక అభిప్రాయంలో అరుణ గారు చెప్పినట్టు ఆయన మీద తంజావూరి బాణీ, అలాగే ఆయన మిక్కిలి గౌరవించిన ఆ అయ్యర్ గురువుల ప్రభావమూ రెండూ మరీ అధికం గా ఉండటమే! ఈ విషయం లో వారు తెలుగు భాష కన్నా, తమిళుల రాగ భావం వైపు/ నిరాకార భావం వైపే మొగ్గారు మరి. తమిళులు ఎలా అయితే తెలుగు భాష మీద శ్రధ్ధ చూపించరో అలాగే శ్రీపాద పినాక పాణి గారు సైతం శ్రధ్ధ చూపించలేదు అని ఆయన అన్నమాటలు మనకి చెబుతున్నవి కావా??

    మీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారమే సాహిత్యం లో ఉపమానాలు కల్పన వగైరాలు ముఖ్యమైనవి. అవే పదకర్త అయిన అన్నమయ్యకి ప్రేరణని ఇచ్చిన విషయాలు. అన్నమయ్య గారు కల్పనని / ఊహనీ భగవంతునికి మారుగా ప్రతిపాదించాడు తన ఉపమానాలలో తన పదాలలో. మరి ఆయన రాసింది అత్యుత్తమ సాహిత్యమేనని మీకు కూడా మీ నిర్వచనం ప్రకారమే స్పష్టపడి ఉంటుంది. ఆయన తన పదాలలో “నిరాకార భావానికన్నా” అలా “సాకార భావానికే” ఎక్కువ ప్రాధాన్యమిచ్చినాడు అందులకే! అచ్చమైన తెలుగు కవిగా !!

    రమ.

  9. వర్ష రచన గురించి తఃతః అభిప్రాయం:

    09/29/2012 7:25 am

    నిన్న…
    ఇంకా ఇరవై నాలుగు గంటలు కాలేదు ఒక బస్సులో యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసాను. నేను బస్సు ఎక్కిన ఊళ్లోనే ఒక ముప్ఫై ఏళ్ల యువకుడు ఎక్కి నా పక్కనే కూచున్నాడు. బస్సు కదిలిన కాసేపట్లో చిన్న వాన మొదలైంది. యువకుడు నాతొ “వాన పడుతోంది. ఈ ఏడు వానలు తగ్గాయి ” అన్నాడు నేను నవ్వి ఊరుకున్నాను.

    మళ్ళీ అతనే, “వానలు పడటం లేదని ఎవరూ అనుకోటం లేదు. వాన పనికి ఆటంకం అనుకుంటున్నారు” అన్నాడు. ‘వర్ష రచన’ బహుశః చదవక పోయినా అభిప్రాయం చెప్పాడనిపించింది.

  10. ఒక సరళ నిర్వచనం గురించి narayana అభిప్రాయం:

    09/29/2012 5:39 am

    రవి గారు, ధన్యవాదాలు.