పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. కాపరి భార్య గురించి శారద అభిప్రాయం:

    05/22/2016 10:00 pm

    భాస్కర్ గారూ: మీ స్పందనకు ధన్యవాదాలు. వైవిధ్యమైన కథాంశాలనీ, కథనా రీతులనీ పరిచయం చేయాలనే నా ఆశ.

    మూర్తి గారూ: పరిస్థితులతో, జీవితంతో ఒంటరి పోరాటానికెన్నో పార్శ్వాలు కదండీ!

    విజయ్ గారూ: మూల కథ లింకు కథలో వుందండీ. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    శ్యామలరావు గారూ: మీ సూచనలకీ, స్పందనకీ ధన్యవాదాలు.

    అయ్యవారు గారూ: మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    శారద

  2. కాపరి భార్య గురించి పవన్ కుమార్. బల్లంకి అభిప్రాయం:

    05/22/2016 6:58 am

    మూల కథ, మరియు అనువాదము రెండూ బాగున్నాయి. ఇటువంటి కథలు ఇంకా అనువాదము చేయగలరు.

  3. మే 2016 గురించి lyla yerneni అభిప్రాయం:

    05/21/2016 12:25 am

    Greetings! Editors.

    About the news release in reference to Emory/Telugu:

    Interested to see the invitees list, and the places they are from. Will you be able to release it kindly, ahead of publication of the essays, please.

    Also, when you say translations, are the essays in eemaata going to be in English or in Telugu?

    Love criticism. Perhaps more than original Literature/art sometimes. Currently reading “Better Living Through Criticism- How to think about Art, Pleasure, Beauty and Truth” (by A.O. Scott,) a book published this year. The author is a film critic.

    I will look forward to the essays from Emory- Telugu division. Quite excited.

    Thanks,
    Lyla

  4. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు! గురించి Sita అభిప్రాయం:

    05/20/2016 3:43 pm

    నమస్కారములు
    చాలా బాగుంది!

  5. ఇది చాలు నాకు గురించి ratnam అభిప్రాయం:

    05/20/2016 8:14 am

    ఇదీ క‌విత్వం. వైర‌ముత్తు విర‌చితం. ఇదే ఉత్త‌మోత్త‌మ వ‌చ‌న ప్ర‌వాహం. రండి సంద్రం ఒడ్డున సాయంత్రం ప్రేయ‌సి ఊహ‌ల‌తో ఒంటరిగా గ‌డిపేందుకు .. వెన్నెల ఆడుకునే అక్ష‌రాల తారంగం ఆస్వాదించేందుకు .. రాత్రి కాలాన్ని మ‌రికొంచెం పెంచి త‌నివి తీర‌గ స్వ‌ప్న స్ర‌వంతిలో విహ‌రిద్దాం.

  6. జానపద సాహిత్యంలో స్త్రీలు – 1 గురించి నాగరాజు. ఉపాధ్యాయులు అభిప్రాయం:

    05/20/2016 3:11 am

    మీ ప్రయత్నం అభినందనీయము. దశావతారముల పాట అందించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ…

  7. చిరంజీవి గురించి డా .రాధేయ అభిప్రాయం:

    05/19/2016 11:04 pm

    మానస గారూ! కన్నీళ్ళకు చాలా ప్ప్రేమ కదా, ఆనందాన్నీ తట్టు కోలేదు, ఆవేదననూ భరించలేదు. మీ కవిత లాగా, కవితలో ఇంకిన కన్నతల్లి ప్రేమ లాగా …

    డా .రాధేయ

  8. నిర్ణయం గురించి తః తః అభిప్రాయం:

    05/17/2016 12:29 am

    గుండెని మెలిపెట్టే మాటలు రాసారు మానసా
    అయినా పాషాణాలు కరగవు
    విషాలు విరగవు.
    తః తః

  9. తేలిక తెలుగు గురించి desikachary అభిప్రాయం:

    05/17/2016 12:07 am

    వేమూరిగారూ,
    మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. మీ బాలవ్యాకరణంలో నున్న సమాచారం సరియైనదే. శకటరేఫాన్ని అచ్చతెనుఁగు వర్ణమాలలో చేర్చుకొని 37 అక్షరాలుగా పరిగణించాలని కొందఱు, అది లేకుండ 36 అక్షరాలుగానే పరిగణించాలని కొందఱు సూత్రీకరించినారు. ఆంధ్రవైయాకరణమునిత్రయంలో పతంజలిస్థానీయులుగా భావింపబడుచున్న బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిగారు వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అనే గ్రంథములో శకటరేఫాన్ని పరిగణిస్తూ 37 వర్ణములని సూత్రీకరించినారు. వారు చిన్నయసూరిగారి సూత్రములను కొన్నిచోట్లను, సూరిగారి సూత్రములను సవరించి వారే సృష్టించిన సూత్రములను కొన్ని చోట్లను ఇస్తూ, విస్తృతమైన విశ్లేషణతో, విమర్శనాత్మకమైన వివరణతో నీగ్రంథమును వ్రాసినారు. ఇది తెలుగువ్యాకరణమునకు కూర్పబడిన ఉత్తమగ్రంథము. సందర్భానుసారముగా ఈగ్రంథములో బ్రాకెట్లలో సూరిగారి సూత్రసంఖ్యలను కూడ పేర్కొన్నారు. పై వర్ణమాలాసూత్రసందర్భంలోనూ వారు సూరిగారి సూత్రసంఖ్యను ఇచ్చినారు. కాని సూరిగారు 36 అక్షరములనే చెప్పినారని వారు చెప్పలేదు. నావద్ద కేవలము వజ్ఝలవారి గ్రంథమే ఉండుటవల్ల నేను సూరిగారి సూత్రమును చూడలేదు. ఇదియే ఈ అక్షరసంఖ్యలో గల వ్యత్యాసమునకు కారణము. 15వ శతాబ్దమునకు చెందిన అనంతామాత్యుని ఛందోదర్పణములోను ‘తెనుఁగున ఱళ లనఁగ రెండధికమండ్రు హరీ’ అని శకటఱేఫను వర్ణమాలలో చేర్చినట్లు వ్యాకరణవిద్వాంసులైన డా. అమరేశం రాజేశ్వరశర్మగారు తెలుపుతున్నారు. ఈవిధంగా కొందఱు శకటరేఫాన్ని గణించడం, లేక అపగణించడంవల్ల వర్ణముల సంఖ్య 37 లేక 36గా చెప్పడం జరుగుచున్నది.
    మఱొకవిషయం:
    తపఃఫలం > తపోఫలం
    వయఃపరిమితి > వయోపరిమితి
    తపోఫలం, వయోపరిమితి అనేవి అపశబ్దాలు. అట్లాంటివి భాషలో నుండవు. విసర్గకు ‘క,ఖ’లు, ‘ప,ఫ’ లు పరమైనపుడు విసర్గ అర్ధవిసర్గగానో (అంటే జిహ్వామూలీయంగానో, ఉపధ్మానీయంగానో), అట్లు గాకున్న యథాతథంగామారకుండానో ఉంటుంది. అందుచేత వయః+పరిమితి -> వయఃపరిపమితి, తపః +ఫలం ->తపఃఫలం అని ఔతుంది కాని, తపోఫలం, వయోపరిమితి అను రూపాలు సిద్ధింపవు. వివరములకు సంధిప్రకరణములో ‘విసర్గసంధి’ని చూడగలరు.

  10. తేలిక తెలుగు గురించి మోహన అభిప్రాయం:

    05/15/2016 5:38 pm

    శకట రేఫము (ఱ) య వ ల వలె ప్రయత్న భేదముచే మృదు కఠినత్వములయిన రెండు విధములు సిద్ధించును కావున అది ప్రత్యేక అక్షరముగా గ్రహింపబడలేదు. కాని ళ-కారమునకు స్వంతముగా నిర్దిష్టమైన శబ్దము ఉన్నందువలన దానిని ప్రత్యేక అక్షరముగా గ్రహించారు. అందుచేత తెలుగులో 36 అక్షరముల సంఖ్యనే చూపినారు.

    విధేయుడు – మోహన