పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. తేలిక తెలుగు గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/14/2016 7:13 pm

    శ్రీ తిరుమలకృష్ణ దేశికాచార్యులవారికి:

    మీలోని సరస్వతీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ వంటి పండితులు నా వ్యాసం చదవడమే ఒక అదృష్టం. చదివి స్పందించేరంటే అది నా వ్యాసానికి ఒక అలంకారం. మీకు సమాధానం రాస్తే హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేసినట్లే!

    నేను ఏయే నేపథ్యాల నుండి ఇక్కడకి వచ్చేనో కొద్దిగా వివరించనివ్వండి.

    మొదటి కోణం: నేను చదువుకునే రోజులలో ఈ దిగువ వాక్యాన్ని నా బల్లకి ఎదురుగా పెట్టుకునేవాడిని.

    “A man would do nothing if he waited until he could do it so well that no one could find fault.” – John Henry Cardinal Newman (1801-1890)

    తప్పో, ఒప్పో, సమగ్రమో, అసమగ్రమో అని మీమాంస పడకుండా ప్రయత్నించి చూడడం, ఫలితం అనుకున్నట్లు లేకపోతే, లేచి, దుమ్ము దులుపుకుని, మళ్లా ప్రయత్నించడం. ఈ పద్ధతిలో నెట్టుకొస్తున్నాను.

    రెండవ కోణం: గత 40 సంవత్సరాలుగా సైన్సుని నలుగురికీ అర్థం అయే రీతిలో, తెలుగులో, రాయడం నా ప్రవృత్తి. సైన్సులోని భావాలని సామాన్యులకి అర్థం అయే విధంగా రాయడం కష్టం; ఇంగ్లీషులోనే కష్టం, పదసంపద పుష్ఠిగా లేని తెలుగులో రాయడం ఇంకా కష్టం. ఈ సందర్భంలో సైన్సుని, జనరంజక శైలిలో అంగరంగవైభవంగా, సమగ్రంగా, సాధికారంగా రాయడం – ఏ భాషా మాధ్యమంలోనైనా సరే – కష్టం. అందుకని మూలంలో ఉన్న భావాన్ని సూక్ష్మీకరిస్తాం. ఆత్యవసరమైన అంశాలని ఉంచి, ప్రస్తుతానికి అవసరంలేని వివరాలని కత్తిరిస్తాం. అలా చెయ్యకపోతే నలుగురికీ అందుబాటులో ఉండేలా రాయలేము. అలా చేస్తే నిష్ణాతులకి కోపం రావచ్చు. “రావచ్చు” ఏమిటి? నేను ఈమాటలో రాసిన వ్యాసం ఒకటి పకడ్బందీగా లేదని గణితజ్ఞులు నా తోలు ఒలిచీసేరు. వారి స్పందనని చూసి కాసింత బిగించి రాసేసరికి “ఇది సామాన్య పాఠకులని ఉద్దేశించి రాసిన రాతేనా? గణితంలో పండితులని ఉద్దేశించి రాసేవా?” అంటూ మరొక పాఠకుడు మందలించేడు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం! అలాగని “పాపులర్ సైన్సు” కి స్థానం లేదనగలమా? సైన్సు ప్రభావం మనందరి జీవితాల మీద పడుతోంది కనుక సైన్సులోని మెలికలు అర్థం కాకపోయినా స్థూలంగా, చూచాయగా, అందరికి అర్థం అవాలి. అందుకని అసలు విషయాన్ని కాసింత తేలిక పరచే ధోరణి ప్రచారంలోకి వచ్చింది.

    మూడవ కోణం: నేను కూడ బాలవ్యాకరణం, సంజ్ఞా పరిచ్ఛేదం, తోటే మొదలు పెడదామనుకున్నాను. నా దగ్గర ఉన్న బాలవ్యాకరణం అట్ట చిరిగిపోయింది కనుక ప్రచురణ తేదీ తెలియదు కాని దాని మీద నా అక్క పేరు, నా చెల్లెలి పేరు, నా తమ్ముడి పేరు కనిపించేయి కనుక ఇది ఏ 1945 ప్రాంతాలలోనో ముద్రణ పొంది ఉంటుందని ఊహిస్తున్నాను! ముట్టుకుంటే కాగితాలు విరుగుతున్నాయి, చిరగడం కాదు! ఇందులో సంజ్ఞా పరిచ్ఛేదం, 3 వ సూత్రం ఇలా ఉంది:
    “తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు”
    మీరు చెప్పినదానికీ, దీనికీ మధ్య లెక్క తేడా వచ్చిందేమిటా అని విచారిస్తే నా ప్రతిలో – అంతా మీరు సూచించినట్లే ఉంది కాని – శకటరేఫ లేదు. అంతే కాదు. ఋ, ౠ, ఒత్తు అక్షరాలు, విసర్గ, ఞ్, ఙ్, శ, ష లు అనే సంస్కృతసమంబులన్నిటిని కలుపుకుంటే తెలుగు అని వ్యవహరించబడుతోంది అని నాలుగవ సూత్రం.

    బాలవ్యాకరణంలో మొదటి నాలుగు సూత్రాలూ చదివిన తరువాత మనం ఈ రోజుల్లో వాడుకునే భాష సంస్కృతమా? ప్రాకృతమా? తెనుగా? తెలుగా? అన్న అనుమానం నా బోంట్లకి వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులలో నాలాంటివాడు చెయ్యగలిగేది ఏమిటి?

    నమస్కారములతో

    వేమూరి

  2. తేలిక తెలుగు గురించి desikachary అభిప్రాయం:

    05/13/2016 10:26 pm

    ‘ఈ course ను తప్పు పట్టే వారందఱు దీనిని నేర్చుకొన్న విద్యార్థులు ఇంతటితో ఆగిపోతారు అని అనుకొన్నట్లుంది. దీనిలో ఉత్తీర్ణులయినవారు తఱువాతి మెట్టు course ను తీసికొని తమ భాషను మెఱుగు పెట్టుకోవచ్చును కదా? దానికి ఇది పునాదిగా భావించవచ్చును.

    లోపభూయిష్ఠమైన పునాది భవనానికే చేటు కాదా? ఇంగ్లీషులో ‘queue’ అనే పదాన్ని ‘q’ అని వ్రాయండని లోకంలో ఎవరైన నేర్పుతారా? ‘buy’, ‘by’ అనే పదాలను ‘bi’ అని వ్రాయండని నేర్పుతారా? తెలుగుకు మాత్రం ఎందుకీ అర్థరహితమైన అగచాట్లు?

    ‘ఒక సయిడుబార్ – అసలు అచ్చ తెలుగులో ఐ, ఔ లు ఉన్నాయా? ఐ, ఔలకు బదులు అయి, అవు వాడవచ్చును అనుకొంటాను, ఉదా. అయిదు, అవును, ఇత్యాదులు.’

    1. అచ్చతెనుఁగునకు వర్ణములు ముప్పదియేడు (బాలవ్యాకరణము – సంజ్ఞాసూత్రము -3)

    ‘అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ’ – అచ్చులు 12
    ం, ఁ (పూర్ణానుస్వారము, అర్ధానుస్వారము – ఇవి ఉభయములు)
    ‘క-గ-చ-ౘ-జ-ౙ-ట-డ-ణ, త-ద-న-ప-బ-మ, య-ర-ల-వ-స-హ-ళ-ఱ’ – హల్లులు 23
    వివరణ: తత్సమములు తెలుఁగే గాన ‘అచ్చతెనుఁగు’నకని సూత్రింపబడినది.

    2. ఆచ్ఛికంబులందు ‘అయి-అవు’ అనువానికి వరుసగా ‘ఐ-ఔ’ అనునవి బహుళంబుగా నాదేశములగును (బాలవ్యాకరణము – క్రియాసూత్రము -103)

    ఉదా: అయిరి-ఐరి, అవును-ఔను, అయిదు-ఐదు, అవుడు-ఔడు (పెదవి క్రిందిచోటు), గవుసెన-గౌసెన
    వివరణ 1: ‘ఐ-ఔ’లకు ‘అయి-అవు’ అనునవి కూడ ఆదేశములగుటయుఁ గలదు. ఉదా:కై – కయి (చేయి), కైత-కయిత, కౌను-కవును, కౌఁగిలి –కవుఁగిలి

    వివరణ2: ఆచ్ఛికంబులం దనుటచే నిది సంస్కృతసమములందు వర్తిల్లదు. ఉదా: దైవము దయివము, కైలాసము కయిలాసము, కౌమారము కవుమారము, గౌణము గవుణము – ఇటువంటి రూపములు సిద్ధింపవు. దీనికి కారణము ఈ సంస్కృతసమములకు మూలములైన సంస్కృతకృదంతములు ఆయాధాతువులపై పాణినీయవ్యాకరణప్రకారము వివిధప్రత్యయములు చేర్చుటచే ఏర్పడినవి. అట్టి పదములకు ఈ ఆచ్ఛికసూత్రమును వర్తింపజేసిన అవి అర్థరహితమగును. అందుచేత సంస్కృతసమములపై నిది సర్వదా నిషిద్ధము.

    వివరణ3: ఛందోబద్ధపద్యములందు ఇటువంటి ఆదేశములు గణ,యతిభంగములకు కారణమగును. ఉదా:
    ‘నలువై యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రౌఢిచేఁ’-ఈ మత్తేభవృత్తపాదాన్ని ‘నలువయి యత్తఱి నత్తలోదరియు వీణావాదనప్రవుఢిచేఁ’ — అని మారిస్తే రెండు గణభంగములూ, యతిభంగము అగుట గమనింపవచ్చును. అందుచేత ఛందోబద్ధపద్యముల కీ సూత్రమును వర్తింపఁజేయరాదు. కాని మాత్రాసమకవృత్తములలో క్వచిత్తుగా గణభంగము, యతిభంగము కానిచో ఆచ్ఛికపదములకు మాత్రమే దీనిని వర్తింపజేయవచ్చును.

  3. చిరంజీవి గురించి Seetha అభిప్రాయం:

    05/13/2016 9:36 pm

    మనసుకు హత్తుకుంది మానస గారు.

    లే రంగు ఇంద్రదన్సు… super ప్రయోగం

  4. నిర్ణయం గురించి Seetha అభిప్రాయం:

    05/13/2016 9:28 pm

    మలుపు మలుపులో
    ఎందుకు ప్రాణాన్ని మెలిపెట్టుకుందో
    ఉప్పునీట కలిసే ముందు
    ఏమని మనసును ఒప్పించుకుందో

    ఎంత బాగుందో మానస. మనసు దోచుకుంటున్నారు మీరు మీ అందమయిన కవితతో.

  5. నిప్పులు గురించి Seetha అభిప్రాయం:

    05/13/2016 7:09 pm

    ప్రణయాన్నీ ఒక అందమయిన కోణంలో భలే చెప్పారే…

  6. కొండదారిలో! గురించి Seetha అభిప్రాయం:

    05/13/2016 7:04 pm

    మానసగారు, మీరు అనుభవించి వ్రాసారో, ఊహించి వ్రాసారో గాని చాలా బాగా వ్రాసారు. నా బాల్యమంతా కొండల్లోనే.. మీ కవిత నా బాల్యాన్ని గుర్తుచేసింది. ధన్యవాదాలు.

  7. దేవకన్య గురించి Seetha అభిప్రాయం:

    05/13/2016 6:52 pm

    love it

  8. తేలిక తెలుగు గురించి మోహన అభిప్రాయం:

    05/13/2016 6:12 pm

    మఱొక చిన్న విషయము. ఈ course ను తప్పు పట్టే వారందఱు దీనిని నేర్చుకొన్న విద్యార్థులు ఇంతటితో ఆగిపోతారు అని అనుకొన్నట్లుంది. దీనిలో ఉత్తీర్ణులయినవారు తఱువాతి మెట్టు course ను తీసికొని తమ భాషను మెఱుగు పెట్టుకోవచ్చును కదా? దానికి ఇది పునాదిగా భావించవచ్చును. కొన్ని అక్షరాలను మొట్టమొదటే పరిచయము చేయకుండా ఉండడము విద్యార్థులను భయపెట్టకుండడానికి అని అనుకోవచ్చును. చైనా వాళ్ల భాష నేర్చుకొనేటప్పుడు అన్ని characters ఒకే మారు నేర్చుకొనరు. తెలుగులో సులభమయిన పదాలు ఉండే చోటులలో కష్టమయిన సంస్కృత పదములు వాడడము కూడ సామాన్యము అయిపోయినది. చేప అనే పదానికి మత్స్యము, ఝషము మున్నగు పదాలను వాడడము ఈ కోవకు చెందినదే. వీలయినంతవఱకు “తేలిక” తెలుగు పదాలను ప్రారంభ దశలో ఉపయోగించడము మంచిది.

    విధేయుడు – మోహన

  9. పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి S.Bhavanarayana, అభిప్రాయం:

    05/13/2016 12:08 pm

    సురేశ్ కొలిచాల గారూ,

    చాలా చక్కటి పరిశీలన.మీ నుంచి ఇంకా దీర్ఘమైన వ్యాసాలు ఆశిస్తున్నాం.

    I would like to clarify as to the technical terminology in regard to linguistic science , more specifically in that of phonetics. The terminology , standardized in Latinized English language is recognized trans linguistically and is recognized s to be consistently standard .

    Those who are exposed to Linguistics through the medium of English , the technical terms in translation are posing a problem in grasping the shade of sound described by the term.

    Further, I am afraid , the process of translating the terminology into hypersanskritised compound terms is lacking in uniformity. I do not know if the jargon has been standardized in the context of using in Telugu research papers.

    It is easier to keep the dissection between the idea of an alveolar stop and that of a voiceless dental stop by using the original terminology rather than n by resorting to translation of the terminology.

    It would turn to be a cumbersome , long winding and inverted compound word, should a phrase like, say,” voiced labiodentals fricative” be rendered into Sanskritiesd form.
    I request the experts to retain the original terminology , so that neither clarity in expression, nor precision as to the example referred to, is not compromised with.

    Regards.

    Yours sincerely,

    Siddineni Bhava Narayana.

  10. తేలిక తెలుగు గురించి మోహన అభిప్రాయం:

    05/13/2016 10:24 am

    నేను IISc లో PhD విద్యార్థిగా ఉండేటప్పుడు విధిగా ఒక విదేశీయ భాష నేర్చుకోవాలి. అందులో నెగ్గితే తప్ప thesis submit చేయుటకు అర్హత లభించదు. అప్పుడు నేను ఒక సంవత్సరము జెర్మన్, రెండు సంవత్సరాలు ఫ్రెంచి, ఆఱు నెలలు రష్యన్ అభ్యసించాను. ఫ్రెంచి మాడం మాకు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడము, ఆంగ్లములో ఫ్రెంచి అనువాదము చెయ్యడము లాటి విషయాలను నేర్పారు. ఆ తఱువాత 12 సంవత్సరాలకు అమెరికా వచ్చాను, ఆ తఱువాత సుమారు పది సంవత్సరాల తఱువాత ఒక సమావేశానికోసం ఫ్రాన్స్ వెళ్లడము జరిగింది. నేను ఎన్నో సంవత్సరాలకు ముందు నేర్చుకొన్న ఫ్రెంచి ఎంతయో సహాయకారిగా ఉండినది. అదే విధముగా UCal లో ఇప్పుడు తేలిక తెలుగు నేర్చుకొన్న ఒకరు కొన్ని ఏళ్ల తఱువాత హైదరాబాదు లేక అమరావతి వెళ్లితే ఆ తెలుగు తప్పక ఉపయోగ పడుతుంది అన్న విషయములో సందేహము లేదు. అలాగే భారతదేశములో జెర్మన్ లేక ఫ్రెంచి భాషలను పఠించేవారికి కూడ ఆ అనుభవము ఉపయోగకారి అవుతుంది. ప్రయోజనాలు ఏమీ లేకపోయినా ఒక భాషను నేర్చుకోవడము మంచిదే కదా? ఉన్న కాలవ్యవధిలో కొన్ని short cuts అవసరమే కదా? electrons nucleus చుట్టు తిరుగుతాయని మొదట నేర్చుకొంటాము. తఱువాత కొన్ని సంవత్సరాల పిదప quantum mechanics నేర్చుకొన్న పిదప మనము ముందు నేర్చుకొన్నది ఒక approximation అని తెలిసికొంటాము. ఇక పోతే బడులలో, కళాశాలలలో ఏండ్లతరబడి తెలుగు చదివిన పిదప కూడ వారి తెలుగు చాల తేలికగా ఉండడము చూస్తూనే ఉన్నాము. అందులో గొప్ప చదువుల పట్టాలు పొందినవారు కూడ ఉన్నారు. వేమూరి వారిది ఒక మంచి ప్రయత్నము, దానిని ఆధారముగా చేసికొని కొన్ని మార్పులు కూర్పులు చేసికొని ముందుకు వెళ్లవచ్చును.

    ఒక సయిడుబార్ – అసలు అచ్చ తెలుగులో ఐ, ఔ లు ఉన్నాయా? ఐ, ఔలకు బదులు అయి, అవు వాడవచ్చును అనుకొంటాను, ఉదా. అయిదు, అవును, ఇత్యాదులు.

    తేలిక తెలుగులో ఒక తేటగీతి –
    తెలుగు నేర్చుకొందును నేను – తేలికయిన
    విధముగా, తెలుగను కొత్త – వీధిలోన
    నడచుచుంటిని మెల్లగా – పడుచు లేచి
    అందమయినవి యీ కొత్త – అనుభవములు

    విధేయుడు – మోహన