పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఒక్కతే… మృత్యువు గురించి lyla yerneni అభిప్రాయం:

    06/01/2016 6:16 pm

    ఒక చిన్న కథ:

    ఒక అడివి లో, చింకిపాతల బక్క ఎముకలగూడు దరిద్రుడు, రోజూ పొట్ట పోసుకోటానికై, కట్టెలు కొట్టుకుంటున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. కళ్లు తిరుగుతున్నయి. పగలే చుక్కలు కనపిస్తున్నయి. కట్టెలు ఎలాగో మోపు కట్టాడు. అడివి లోంచి బైట పడి ఇల్లు చేరే ఓపిక లేదు. యముడా! ఈ తిప్పలు నేను పడలేనురా. ఎత్తుకు పోటానికి రారా! – అని అరిచాడంట. వెంటనే యమధర్మరాజు ప్రత్యక్షమై, నన్ను తలిచావా? పిలిచావా? అన్నాడట. కట్టెలు కొట్టేవాడు, వెంటనే – ఈ కట్టెలమోపు ఎత్తి నెత్తిన పెట్టి పోతావని సాయానికి పిలిచానయ్యా, నేనే తంటాలు పడతాలే వెళ్లు, వెళ్లు, నీ పని చూసుకో -అన్నాడంట.

    (ఈ కథ పల్లెటూళ్లో, ఇంట్లో పొయ్యి రాజటానికి,తన దొడ్లో,గొడ్డలి తో పేళ్లేసే మా అమ్మనాన నాకు చెప్పాడు. ఈ కథలో నీతి ఏమి టో, అది నాకు ఎక్కిందో లేదో, తెలియదు కాని, ఈ మాట లో ‘మృత్యువు’ గురించి జోరుదారుగా కథలు, కవితలు వచ్చినప్పుడు అవి క్లినికల్ గా సినికల్ గా లిరికల్ గా ఉన్నప్పుడు నాకీ డల్ కాటూరు కట్టెల కథ ఎందుకు గుర్తొస్తుందా? అనుకుంటాను.

    లైలా
    *Watching French Open Tennis Championships. Love human body and its mechanics. Love Neruda – when he opens his poetry with lines like:

    “Body of a woman, white hills, white thighs,
    you look like a world, lying in surrender.
    My rough peasant’s body digs in you…”

  2. ఇద్దరు దుర్మార్గులు గురించి madhav అభిప్రాయం:

    06/01/2016 8:20 am

    Chala bagundi sir

  3. ఒక్కతే… మృత్యువు గురించి జ్యోత్స్న అభిప్రాయం:

    05/31/2016 12:22 pm

    ఈ సంచిక ఏడేళ్ళ క్రితందైనా..ఈ మధ్యనే జరిగిన ఒక చర్చ కారణంగా నెరుడా కవితను దాని అనువాదాలను వెతుకుతూ వుంటే పై కవితలు కనిపించాయి.అన్ని అనువాదాలు ఎంతో క్లుప్తంగా కళాత్మకంగా కవి భావాలను ఎన్నో విధాలుగా అన్వయించ వచ్చు అనువదించ వచ్చు అని తెలియజేస్తూ వున్నాయి అదే స్ఫూర్తితో రాసినది ఈ కవిత

    శ్మశానాల,శవ సమూహాల ఉవ్విళ్ళూరే ఒంటరితనం
    ఎండిన ఎముకల నిర్జీవ సమాధుల నిండిన నిశ్శబ్ధం
    అలసిన ఆత్మ పరమాత్మకై ప్రయాణం అగమ్యగోచారం
    గమ్యం చేరే వరకు గూభ్యం,అంధకారం, గాఢ్యాంధకారం!
    రారమ్మంటూ పిలిచే మరణం
    ఆత్మ జీవం పోసుకునే అద్భుత తరుణం !

    మట్టి ముద్దల,మేలిమి బొమ్మల నిండి వున్నది మృత్యువు
    కబళించే కూతలలో,కడ చేరిన కళేబరాలలో
    ప్రతిధ్వనిస్తూ
    ఆత్మ విరహపు ఆవిరి ఆత్మీయుల కన్నుల కమ్మేస్తూ. ..

    కవ్వించే కేశాలు,ముట్టించే కాపర్లు
    న్యాయానుచరిణి,చింతించే తరుణి
    అన్నింటినీ దాటించే వైతరణి
    వెనుకకు లాగే రక్తపు బంధం
    నది దాటిస్తున్న నిశ్శబ్ధం

    పాదం వదిలిన పాదుకలా
    ఆత్మను విడిచిన దేహంలా
    నీకెవ్వరింక నాతో రమ్మని
    నలుదిక్కులా ప్రతిధ్వనించే మృత్యువు నిశ్శబ్ధపు సడి

    అంతమో ఆరంభమో తెలియని అజ్ఞానిని
    భూమిలో ఒదిగి పొమ్మనే,నాచులో కలిసిపొమ్మనే
    ఊదా పూల జోల వలే వినిపించే మృత్యుగీతి

    ఎండిన ఎముకల శిశిర సమాధులని తుడిచేస్తూ
    ‘అహం’కారపు అవశేషాలకై ఆఘ్రాణిస్తోంది
    ఆత్మ పయనానికి అడ్డంకులింకేవని వేటాడే లయకారి!

    శవ పేటికలలో నిగూఢంగా నిదురిస్తూ
    నిశి రేయి నీడలలోంచి ఒక్క నిట్టూర్పుతో
    జీవం పోసుకునే మృత్యువు
    వేచి వున్నది ఆత్మ మరుజన్మకై నిరీక్షిస్తూ!

    చదివి అభిప్రాయాలు తెలుపగలరు ☺
    -జ్యోత్స్న

  4. నిశ్శబ్ద సమూహం గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    05/31/2016 12:21 pm

    మూగపోయిన సమాధానాలతొ
    ముడుచుకున్న జ్ఞాపకాలు
    గాయం చెసిన గతాన్ని మరచి
    గది నుంచి బయటకు వచ్చి
    నిశ్సబ్ధాన్ని బద్డలుగొడతాయి

  5. ఇది చాలు నాకు గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    05/31/2016 12:07 pm

    ఈ ‘మాట’ లాంటి తెలుగు పత్రిక
    అభిప్రాయాలు తెలియజేసుకునే వేదిక
    ‘ఇది చాలు నాకు’ అనే కవిత
    ఇంతకు మించి ఏంకావాలి మాకు

  6. ఇద్దరు మిత్రులు గురించి madhav అభిప్రాయం:

    05/31/2016 10:12 am

    Chala Bagundi Sir

  7. కాపరి భార్య గురించి శ్రీహరి అభిప్రాయం:

    05/31/2016 9:28 am

    చక్కటి కథకి చక్కనైన అనువాదం

  8. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:42 am

    నీహారిక గారూ కృతజ్ఞతలు.

  9. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:41 am

    ధన్యవాదాలు సరళా మోహన్ గారూ

  10. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:40 am

    ధన్యవాదాలు దాశరథి గారూ