శ్యామల రావు గారూ, ఇలాంటివి చెప్తే తెలుసుకోవడం నా కర్తవ్యము. దయచేసి మీకు వీలున్నప్పుడు తప్పకుండా చెప్పడానికి ఏ మాత్రమూ సంకోచించవలదని విన్నపం.
ఆశానిరాశలు గా సరిదిద్దవలసినదని సంపాదక వర్గాన్ని కోరుతున్నాను.
గూగుల్ సెర్చ్ లో సరైన పదం దొరకదండి. ఎక్కువభాగం ‘తేలిక తెలుగు’ నేర్పే గురువుల శిష్యులే ఉన్నామేమో.
I think the doctors are trained to be clinical in their approach to the patients. This story clearly demonstrates the need for a social approach towards the patients. No doubt, the writer is a master story teller.
ఘంటసాల వారి గళం నభూతోనభవిష్యతి బాలు గారి పాటలు చాల మంది మిమిక్రీ చేసి పాడగలుగుతున్నారు కానీ ఘంటసాల వారి గళాన్ని ఎవరూ అనుకరించలేకపోయారు అయన స్వరం అనుపమానం అయన ప్రాతస్మారణీయుడు. వ్యక్తిగాగానీ సంగీత దర్శకుడిగా గాని ఆయనకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు.
ఒక విషయం ప్రస్తావించటం మరచిపోయాను. శీర్షికను ‘ఆశనిరాశలు’ అని ఉంచారు. ఈ పదబంధం అంత సరైనదిగా అనిపించటం లేదు నాకు. ‘ఆశానిరాశలు’ అనటం సరిగా ఉంటుందనుకుంటాను. ఈమాట సంపాదకవర్గమూ, పరిశీలనాప్రవీణుల వడపోతలూ ఇలాంటి విషయాలపైన దృష్టిపెట్టవేమో తెలియదు. లేదా భాషాసంబంధమైన తప్పొప్పులపట్ల ఉదారవైఖరి అవలంబిస్తూ ఉండవచ్చును. ఇంగ్లీషులో ఎవరికైనా మెయిల్ పంపే ముందు అతిజాగ్రత్తగా వ్యాకరణదోషాలూ, అక్షరదోషాలూ సరిచేస్తాం. అది అవసరం కూడా. ఐతే, తెలుగులో మాత్రం ‘ఎలా వ్రాసినా చెల్లుతుంది’ అన్న వైఖరి ఈ మధ్య కాలంలో సర్వేసర్వత్రా కనిపిస్తోంది. సరదాగా గూగుల్ చేసి చూస్తే ‘ఆశనిరాశలు’ అన్న పదం 822 చోట్లా, ‘ఆశానిరాశలు’ అన్నది కేవలం 107 చోట్లా కనిపించింది. నాదే పొరపాటేమో!
భాషాశాస్త్రానికి పుట్టినిల్లు భారతదేశమని చెప్పడం అతిశయోక్తి కాదని మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. సంస్కృతంలో 2000 సంవత్సరాల క్రితమే భాషాశాస్త్రంలో సాధించిన అభివృద్ధి పాశ్చాత్య దేశాల్లో 200 సంవత్సరాల క్రితం వరకూ జరగలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. నిజానికి, ఆంగ్లంలో ఇప్పుడు వాడుతున్న పదాలలో చాలాపదాలు పాణినీయ వ్యాకరణాలలో వాడిన సంస్కృత పదాలకు ఆంగ్ల సమానార్థకాలు. ఈ వ్యాస పరంపరలో వాడుతున్న సాంకేతిక పదజాలం నేను కొత్తగా సృష్టించింది కాదు. నేను వాడుతున్న పదాలన్నీ తెలుగులో ఇతర భాషావేత్తలు ప్రామాణికంగా వాడుతూ వస్తున్న పరిభాషలోనివే. ఈ పదాలకు మూలాలు చాలావరకూ పాణిని, పతంజలి తదితరుల సంప్రదాయ వ్యాకరణాలలో వాడుకున్న పదజాలంనుండి స్వీకరించినవే.
ఆధునిక భాషాశాస్త్ర పరంగా, గత 100 సంవత్సరాలలో తెలుగులో భాషాశాస్త్ర వ్యాసాలను పలువురు భాషాశాస్త్రవేత్తలు ప్రచురించారు. గిడుగు రామమూర్తి పంతులు 1912లో వ్యవహారిక భాషా ఉద్యమం కోసం రాసిన వ్యాసాలతో తెలుగులో ఆధునిక భాషాశాస్త్ర రచనకు అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆపై, 1929లో ఆయన శిష్యుడు చిలుకూరి నారాయణరావు 11 శతాబ్దిలోని తెలుగు భాషను గురించి సిద్ధాంత వ్యాసం రాసి మదరాసు యూనివర్సిటీ నుంచి డాక్టరేటు డిగ్రీ పొందారు. 1937 లో ఆయన రచించిన ఆంధ్రభాషా చరిత్రము అనే గ్రంథాన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రెండు సంపుటాలుగా ముద్రించింది. కోరాడ రామకృష్ణయ్యగారు తమ వ్యాసాల్లో, గ్రంథాల్లో (చూ.సంధి- చారిత్రక పరిశీలన) భాషాశాస్త్ర పరిభాషను వాడుకున్నారు. 1947లో గంటిజోగి సోమయాజిగారు “ఆంధ్ర భాషా వికాసం”లో దాదాపు అన్నీ ప్రాథమిక భాషాశాస్త్ర సిద్ధాంతాలకు సంప్రదాయక సంస్కృత పదజాలాన్ని విరివిగా వాడుకొన్నారు. నేను వాడుతున్న పదజాలానికి చాలావరకూ భద్రిరాజు కృష్ణమూర్తి గారి సంపాదకత్వంలో వెలువడిన “తెలుగు భాష చరిత్ర” అన్న పుస్తకంలో వాడుకొన్న పదజాలమే ఆధారమని చెప్పుకోవచ్చును. ఏం. ఏ. తెలుగు కానీ, ఏం. ఏ. భాషాశాస్త్రం కానీ చదివిన విద్యార్థులు నా వాడిన పదజాలం ప్రామాణికమేనని గుర్తిస్తారని ఆశిస్తాను.
నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:
05/31/2016 6:39 am
ధన్యవాదాలు సుపర్ణ మీ అభిమానానికి.
ఆశనిరాశలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
05/28/2016 12:07 am
శ్యామల రావు గారూ, ఇలాంటివి చెప్తే తెలుసుకోవడం నా కర్తవ్యము. దయచేసి మీకు వీలున్నప్పుడు తప్పకుండా చెప్పడానికి ఏ మాత్రమూ సంకోచించవలదని విన్నపం.
ఆశానిరాశలు గా సరిదిద్దవలసినదని సంపాదక వర్గాన్ని కోరుతున్నాను.
గూగుల్ సెర్చ్ లో సరైన పదం దొరకదండి. ఎక్కువభాగం ‘తేలిక తెలుగు’ నేర్పే గురువుల శిష్యులే ఉన్నామేమో.
తేలిక తెలుగు గురించి ముల్లా జలాలుద్దీన్ అభిప్రాయం:
05/27/2016 5:54 pm
ఎడిటర్‌జీ:
సలామ్ ఆలేకుం.
ఎందరో పాఠకులు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించిన తరువాత ఈ రెండు మాటలూ చెబుదామనిపించింది.
“నాకు తెలుగుమాట్లాడటం వచ్చు. నాకు తెలుగులో రాయటం, చదవటం కూడా వచ్చు.అప్పుడప్పుడు, ఏమీ తోచనప్పుడు, పిల్లి దొరకనప్పుడూ, కథలు, కాకరకాయలూ కూడా రాసేశా.”
అందుచేత,తెలుగురానివాడికి, తెలుగువాడు కానివాడికీ,తెలుగు రెండవభాషగా పాఠంచెప్పటం వచ్చనుకోవటం, ఆయనెవరో, మున్‌షీజీ అన్నట్టు, ‘దేశభక్తికన్నా హీనమైన పాపం.’
ఖుదా హఫీజ్
ముల్లా జలాలుద్దీన్
నువ్వు నాకొద్దు గురించి A K Rao అభిప్రాయం:
05/27/2016 8:20 am
I think the doctors are trained to be clinical in their approach to the patients. This story clearly demonstrates the need for a social approach towards the patients. No doubt, the writer is a master story teller.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి జి.ఎల్.విజయ్ అభిప్రాయం:
05/27/2016 6:41 am
ఘంటసాల వారి గళం నభూతోనభవిష్యతి బాలు గారి పాటలు చాల మంది మిమిక్రీ చేసి పాడగలుగుతున్నారు కానీ ఘంటసాల వారి గళాన్ని ఎవరూ అనుకరించలేకపోయారు అయన స్వరం అనుపమానం అయన ప్రాతస్మారణీయుడు. వ్యక్తిగాగానీ సంగీత దర్శకుడిగా గాని ఆయనకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు.
ఆశనిరాశలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
05/27/2016 1:37 am
మాధవ రావు గారు, శ్యామల రావు గారు, ధన్యవాదాలు.
ఫోన్ రింగ్ టోన్ అది. అది వినపడగానే ఫోన్ తీస్తారు. అతకలేదంటారా , ఇకమీదట ఇలాంటివి వ్రాసేటపుడు జాగ్రత్త పడతాను. సూచించినందుకు సంతోషమండి.
ఆశనిరాశలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
05/25/2016 1:47 am
ఒక విషయం ప్రస్తావించటం మరచిపోయాను. శీర్షికను ‘ఆశనిరాశలు’ అని ఉంచారు. ఈ పదబంధం అంత సరైనదిగా అనిపించటం లేదు నాకు. ‘ఆశానిరాశలు’ అనటం సరిగా ఉంటుందనుకుంటాను. ఈమాట సంపాదకవర్గమూ, పరిశీలనాప్రవీణుల వడపోతలూ ఇలాంటి విషయాలపైన దృష్టిపెట్టవేమో తెలియదు. లేదా భాషాసంబంధమైన తప్పొప్పులపట్ల ఉదారవైఖరి అవలంబిస్తూ ఉండవచ్చును. ఇంగ్లీషులో ఎవరికైనా మెయిల్ పంపే ముందు అతిజాగ్రత్తగా వ్యాకరణదోషాలూ, అక్షరదోషాలూ సరిచేస్తాం. అది అవసరం కూడా. ఐతే, తెలుగులో మాత్రం ‘ఎలా వ్రాసినా చెల్లుతుంది’ అన్న వైఖరి ఈ మధ్య కాలంలో సర్వేసర్వత్రా కనిపిస్తోంది. సరదాగా గూగుల్ చేసి చూస్తే ‘ఆశనిరాశలు’ అన్న పదం 822 చోట్లా, ‘ఆశానిరాశలు’ అన్నది కేవలం 107 చోట్లా కనిపించింది. నాదే పొరపాటేమో!
ఆశనిరాశలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
05/24/2016 7:37 am
కథ బాగుంది.
రెండు మూడు సార్లు అంతరంగ మృదంగనాద… అంటూ వస్తుంది. కాని అంతబాగా అది అతకలేదు కథనంలో.
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/23/2016 6:38 pm
సిద్ధినేని భావనారాయణ గారు,
భాషాశాస్త్రానికి పుట్టినిల్లు భారతదేశమని చెప్పడం అతిశయోక్తి కాదని మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. సంస్కృతంలో 2000 సంవత్సరాల క్రితమే భాషాశాస్త్రంలో సాధించిన అభివృద్ధి పాశ్చాత్య దేశాల్లో 200 సంవత్సరాల క్రితం వరకూ జరగలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. నిజానికి, ఆంగ్లంలో ఇప్పుడు వాడుతున్న పదాలలో చాలాపదాలు పాణినీయ వ్యాకరణాలలో వాడిన సంస్కృత పదాలకు ఆంగ్ల సమానార్థకాలు. ఈ వ్యాస పరంపరలో వాడుతున్న సాంకేతిక పదజాలం నేను కొత్తగా సృష్టించింది కాదు. నేను వాడుతున్న పదాలన్నీ తెలుగులో ఇతర భాషావేత్తలు ప్రామాణికంగా వాడుతూ వస్తున్న పరిభాషలోనివే. ఈ పదాలకు మూలాలు చాలావరకూ పాణిని, పతంజలి తదితరుల సంప్రదాయ వ్యాకరణాలలో వాడుకున్న పదజాలంనుండి స్వీకరించినవే.
ఆధునిక భాషాశాస్త్ర పరంగా, గత 100 సంవత్సరాలలో తెలుగులో భాషాశాస్త్ర వ్యాసాలను పలువురు భాషాశాస్త్రవేత్తలు ప్రచురించారు. గిడుగు రామమూర్తి పంతులు 1912లో వ్యవహారిక భాషా ఉద్యమం కోసం రాసిన వ్యాసాలతో తెలుగులో ఆధునిక భాషాశాస్త్ర రచనకు అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆపై, 1929లో ఆయన శిష్యుడు చిలుకూరి నారాయణరావు 11 శతాబ్దిలోని తెలుగు భాషను గురించి సిద్ధాంత వ్యాసం రాసి మదరాసు యూనివర్సిటీ నుంచి డాక్టరేటు డిగ్రీ పొందారు. 1937 లో ఆయన రచించిన ఆంధ్రభాషా చరిత్రము అనే గ్రంథాన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్తు రెండు సంపుటాలుగా ముద్రించింది. కోరాడ రామకృష్ణయ్యగారు తమ వ్యాసాల్లో, గ్రంథాల్లో (చూ.సంధి- చారిత్రక పరిశీలన) భాషాశాస్త్ర పరిభాషను వాడుకున్నారు. 1947లో గంటిజోగి సోమయాజిగారు “ఆంధ్ర భాషా వికాసం”లో దాదాపు అన్నీ ప్రాథమిక భాషాశాస్త్ర సిద్ధాంతాలకు సంప్రదాయక సంస్కృత పదజాలాన్ని విరివిగా వాడుకొన్నారు. నేను వాడుతున్న పదజాలానికి చాలావరకూ భద్రిరాజు కృష్ణమూర్తి గారి సంపాదకత్వంలో వెలువడిన “తెలుగు భాష చరిత్ర” అన్న పుస్తకంలో వాడుకొన్న పదజాలమే ఆధారమని చెప్పుకోవచ్చును. ఏం. ఏ. తెలుగు కానీ, ఏం. ఏ. భాషాశాస్త్రం కానీ చదివిన విద్యార్థులు నా వాడిన పదజాలం ప్రామాణికమేనని గుర్తిస్తారని ఆశిస్తాను.
సురేశ్.
ఆశనిరాశలు గురించి Madhav Rao అభిప్రాయం:
05/23/2016 11:30 am
Very Nice. It is really inspiring to many people.