పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ద్వితీయ కళత్రం గురించి హంస లేఖ అభిప్రాయం:

    09/04/2016 6:36 am

    చాల బాగున్నాయ్

  2. నాన్నా తెలుసా గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:

    09/03/2016 10:39 pm

    ఇది ప్రచురింప బడ్డ 11 ఏళ్ళ తర్వాతనైనా నా కళ్ళ బడడం నా అదృష్టం.పద్యాలు చాలా ఆర్ద్రంగా ఉన్నాయి.వ్యావహారిక భాషలో పద్యాలింకా రావాలని వాటికి అందరి ప్రోత్సహం కావాలని అప్పుడే పద్యం కనుమరుగై పోకుండా ఉంటుందని నా భావన.

  3. తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి Venisha అభిప్రాయం:

    09/03/2016 4:36 pm

    చాల బాగుంది. its so enriching with good research works!! keep it up.

  4. నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/03/2016 4:22 pm

    మాన్య మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారికి
    నమస్కారములతో,

    మొదటి పద్యానికి మీ వ్యాఖ్య, పదప్రయోజనాన్ని వివరించిన తీరు – హృద్యంగా ఉన్నాయి. “దేవీసంతతి” అని మీ ప్రతిలో ఉన్నది కాబోలు. అది తప్పు కాదు కాని, ప్రసిద్ధప్రతు లన్నిటిలో దేవీసంహతి, దేవీసంఘము అనే పాఠాలున్నాయి.

    రెండవ పద్యంలో “బాహుదుర్గములు” అన్న సమాసాన్ని మీరు బహువచనంగా గ్రహించి, ‘బాహువులనే కోటలు’ అని అన్వయించారు. అవి ఒకటి కాదు; రెండు దుర్గాలు అని కూడా వివరించారు. అయితే, ‘బాహువులనెడి దుర్గము’ అని రూపణను ఏకవచనంగా పఠించటమే సమంజసం. శ్రీకృష్ణుని బాహుమధ్యసీమ (విశాలమైన వక్షఃస్థలం) దుర్గోపమమై, దైత్యదానవదుష్ప్రాపం కనుక తనకు రక్షాకరమని సత్యభామ అంటున్నది. ఇక్కడ ఒక్కొక్క బాహువు ఒక్కొక్క దుర్గమన్న అర్థానికి అవకాశం ఉండదు. బాహువులు రెండైనా, నాలుగైనా రిపుదుర్గమమైన దుర్గం ఒక్కటే.

    “త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ, దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః” అని పంచమ స్కంధంలో (1-19) శ్లోకాన్ని చూడండి: “శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి, యరిషడ్వర్గంబు జయించి” అని గంగనామాత్యుని తెలుగుసేత (5-1-11). అక్కడ ఒక్కొక్క చరణం ఒక్కొక్క దుర్గం కాదు కనుకనే, “చరణారవిందములు అనెడి దుర్గము” – అన్నాడు.

    “శ్రీరమణీ కుచదుర్గ విహారే” – శ్రీదేవియొక్క కుచములనెడి దుర్గమునందు (ఎత్తైన రెండు కొండలున్న గిరిదుర్గము వంటి వక్షఃస్థలమునందు) విహరణము కలవాడు – అని భావం. శ్రీదేవియొక్క కుచములనెడు రెండు దుర్గములందు విహరించువాడు అని చెప్పకూడదు. ఇది “మధుకైటభారేః వక్షోవిహారిణి” అన్న ప్రయోగం వంటిదే.

    “బాహుదుర్గములు” అన్న అపపాఠం వల్ల ఈ అపార్థానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల పద్యాన్ని –

    “దానవు లైన నేమి, మఱి దైత్యసమూహము లైన నేమి? నీ
    మానితబాహుదుర్గ మను మాటున నుండఁగ నేమి శంక? నీ
    తో నరుదెంతు” నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
    మ్మానిని, దన్ను భర్త బహుమానపురస్సరదృష్టిఁ జూడఁగన్. (దశమ: ఉత్తర భాగం-155)

    అని సరిదిద్దుకోవాలి. నీయొక్క బాహుదుర్గసీమ అను మాటునన్ = రక్షణస్థానమున ఉండగా, నాకు ఏమి శంక? అని అన్వయం.

    అంతే కాదు. ఆమె మ్రొక్కటమూ, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూడటమూ ఏకకాలంలో జరగలేదు. ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచిన తర్వాత ఆమె మ్రొక్కలేదు. ఆమె మ్రొక్కిన తర్వాత, ఆయన బహుమానపురస్సరదృష్టితో చూచాడని అన్వయించేందుకు వీలులేకుండా, “బహుమానపురస్సరదృష్టిన్ చూడఁగన్” – అన్న వెంటనే, “ఇట్లు మ్రొక్కిన” అన్న వచనం ఉన్నది. అప్పుడు “చూడఁగన్” అన్న అసమాపక క్రియకు ఆమె మ్రొక్కగా, ఆతడు చూడగా అన్న అన్వయమూ సరిపడదు.

    వాక్యంలో “మ్రొక్కె” అన్న సమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “చూడఁగన్” అన్న అసమాపక క్రియను అన్వయించే వీలుండదు. “చూడఁగన్” అన్న అసమాపక క్రియను ముందుచెప్పి, ఆ తర్వాత “మ్రొక్కెను” అన్న సమాపక క్రియను చివరిదిగా అన్వయించాలి. తనను భర్త బహుమానపురస్సరదృష్టితో వీక్షింపగా, ఆమె కరతోయజములు ముకుళించి మ్రొక్కెను – అని మాత్రమే పద్యంలో వాక్యాన్వయం వ్యాకరణసిద్ధం. అప్పుడు అర్థం పొందుపడదు. నీతో నేను వస్తాను, నీవుండగా నాకేమి భయం? అని ఆమె అడిగినంత మాత్రాన ఆయన బహుమానపురస్సరదృష్టితో చూశాడనటమూ, అప్పుడామె నమస్కరించినదనటమూ కవి చిత్రణ అనుకోలేము. ఆ పక్షాన కవితాత్మకమైన అభివ్యక్తీకరణమే ఉండదు.

    అందువల్ల, “చూడఁగన్” అన్న క్రియారూపానికి ఇక్కడ తుమున్నర్థంగా మాత్రమే అన్వయం. భర్త తన పలుకులను విని, బహుమానపురస్సరదృష్టితో చూసేందుకే ఆమె అంజలించినదన్నమాట. అది సత్యభామ స్వభావానికి తగిన చిత్రణమే. సాకూతమైన అంజలిబంధం. ముందు ప్రశంస, ఆ తర్వాత ప్రణమనం – రెండూ ఆయన మెప్పుకోసం మాత్రమే అన్నమాట. అదే కవి మనోగతం. “చూడఁగన్ = చూచుట కొఱకు” అని తుమున్నర్థకం.

    ఆ జాణతనాన్ని గుర్తించాడు కనుకనే, ఇట్లు (ఈ విధమైన నేర్పరితనంతో) మ్రొక్కినన్ = ఆమె నమస్కరింపగా, ఆయన భావజ్ఞుడు కదా, దగ్గరికి తీసికొని కౌగలించికొన్నాడని తర్వాత అన్నాడు.

    సహృదయత ఉట్టిపడుతున్న అమోఘమైన మీ వ్యాఖ్యకు పరిపూరకంగా మాత్రమే ఈ మాటలను వ్రాశాను. పోతనగారి భాగవతం ఎంత పరిష్కరణ సాపేక్షమో ఈ సన్నివేశం మరొక్కసారి నిరూపిస్తున్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. గడి నుడి – 1 గురించి Ramulu P C అభిప్రాయం:

    09/03/2016 2:15 pm

    The Puzzle is good. Since I do not find any submission button, is it (completed puzzle) not to be submitted to eemaata ??

  6. వాడుక భాషలో పద్యాలు గురించి ghsastry అభిప్రాయం:

    09/03/2016 1:33 pm

    ఎన్నో విషయాలు సోదాహరణముగా వివరించారు. చాలా బాగుంది.అభినందనలు.

  7. గడి నుడి – 1 గురించి I.A.P.S. Murthy అభిప్రాయం:

    09/03/2016 1:16 pm

    చక్కని ప్రయత్నం. మెదడుకు పదునుపెట్టే విధంగా ఉంది.

    అంకెపై క్లిక్ చేసినప్పుడు ఆధారాలు వచ్చే పద్ధతీ, పూర్తిచేసిన నుడికట్టులో గళ్ళని ఎప్పటికప్పుడు సరిచూసుకునే పద్ధతీ బాగున్నాయి.

    చిక్కేమిటంటే,ఇది online లో ఉండటంవల్ల ఏకబిగిని పూర్తిచెయ్యాలి. దీనికి చాలా సమయం పడుతుంది కనుక, offline లో save చేసుకుని వీలువెంబడి పూరించే వెసులుబాటు కలిగించండి.

    సంచిక వెలువడిన వారం పదిరోజుల తరువాత, పూర్తి నుడికట్టు సమాధానాలు, అడిగితే తెలిపేవిధంగా ఏర్పాటు చేయండి (వచ్చే సంచిక వరకూ, అంటే 2 నెలలు ఆగడం కష్టం కాబట్టి).

    అభినందనలతో,

    ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.

    [మీరు దీన్ని ఏకబిగిని పూర్తి చెయ్యాల్సిన అవసరం లేదు. కుకీ (cookie) ద్వారా మీరు నింపున గడులను ఈమాట 30 రోజుల దాకా గుర్తు పెట్టుకుంటుంది. – సం.]

  8. తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి అక్షయ్ అభిప్రాయం:

    09/03/2016 12:08 pm

    ఎన్నో తెలియని విషయాలను శాస్త్రీయతతో విశ్లేషించారు, నెనర్లు! రెండు సందేహాలు / వ్యాఖ్యలు:

    1) సుందర తెలుంగు: మీ వృత్తాంతం ప్రకారం తెలుగీతర భాషలలో చెక్కిన సిలాశాసనాల ఆధారంతో ‘తెలుగు’ లేదా తెలుంగు పదాల ప్రాచీనత స్పష్టంగా తెలియగలదని తెలుస్తోంది. 5వ శతాబ్దపు తమిళ వ్యాకరణం అగత్తియమ్‌లో తెలుగుని ‘తెలుంగం’ అని వ్యవహరించారని వ్రాశారు. అయితే, (ఆం) వికీలో మాత్రం అగత్తియమ్ చెరిత్ర కోలిపోయిన గ్రంథమని వ్రాశారు (https://en.wikipedia.org/wiki/Agattiyam) ఇతర శోధన ఫలితలలో కూడా ఇదే విధంగా వ్రాశారు.

    నాకు తమిళ సాహిత్య చెరిత్ర గురించి తేలియదు; మొదటి సారిగా తెలుగు లేదా ‘తెలుంగం’ను ప్రస్తావించినది ఇంకో సంఘం కాలపు గ్రంథం అయివుండచ్చా?

    2) మ్యాన్మాఁలోని తలైంగులు: తలైంగుల మీద 1854లో ఫ్రేన్సిస్ మేసిన్ వ్రాసిన వ్యాసం jstor ద్వారా దొరికినది. [1]. ఇందులో, తలైంగుల భాష దక్షిణ భారతంలోని ‘cultivated languages'[2] తో ఏ సంబంధాలు కనిపించక పోయినా, చోటా నాగపూర్ ప్రాంతంలో (నేటి ఝార్ ఖండ్ రాష్ట్రం) నివసించే హోం ల భాషతో ఎన్నో పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు. [పేజీ 282 – 284].
    ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆ
    జన్యువుల పొంతన కుదరక పోవడం ఆంధ్రులతోనా, లేక తెలుగు వారితోనా, లేక భారతీయులతోనా?

    ఏది ఏమైనా, చాలా ఆసక్తి కరమైన వ్యాసం. అన్ని వాదనలను ఎంతో వివరంగా సమీక్షించారు, మీకు అభినందనలు. ఏదో, చదివిన కొద్దీ ఈ విషయంపై ఇంకా సోధించాలని అనిపించింది. అందుకే ఈ ప్రశ్నలు.

    [1] – https://www.jstor.org/stable/592280?seq=2#page_scan_tab_contents
    [2]- ఇది 19వ శతాబ్దపు ఇంగ్లీషు వాడుక కాబోలు. బ్రౌన్య నిఘంటువులో ‘cultivated language’కి “వ్యాకరణ శిక్షితమైన భాష” అని అర్థమిచ్చారు.

  9. అభిసారిక, విప్రలబ్ధ గురించి Alivelu అభిప్రాయం:

    09/03/2016 7:04 am

    ఛాలా సంతొషం గా ఉంది. పాటలు పాడడం విధానం చాలా బాగుంది. Congratulations.
    అలివేలు
    ప్రకాశం

  10. హృదయం ఇక్కడే వుంది! గురించి veeran అభిప్రాయం:

    09/03/2016 2:40 am

    ఈ కథలో ఎన్నో లైన్స్ కాపీ చేసి పెట్టుకున్నాను అంటే ఎంత భావయుక్తంగా రాసారో… very expressive lines. ప్రతీ పాత్ర ఎంత బావుందో. ఒక పాత్ర మాత్రం చాల నచ్చింది