“ఈ సంచిక నుండి సాధారణ కథావ్యాసాది లక్షణాలతో పొసగనివిగా అనిపించే రచనలకు చోటు కల్పిస్తూ స్వగతం అనే ఒక కొత్త కేటగిరీ మొదలు పెడుతున్నాం పూడూరి రాజిరెడ్డి రచనతో. ఈ కొత్త విభాగం ఈమాట రచయితలకు తమ ఆలోచనలు, ఊహలు, అభిప్రాయాలు, మ్యూజింగ్స్ వంటివి ప్రచురించుకునేందుకు ఒక కొత్త వెసులుబాటు నిస్తుంది. రచయితలు వినియోగపరచుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.”
* చాలా మంచి ప్రయత్నానికి నుడికారం చుట్టిన ఈమాటకి, సంపాదకులకి నా అభినందనలు.
అలానే, జీవితానుభవాలు, లేఖలు, కబుర్లు, ప్రయాణాల అనుభూతులు, కొత్త వారు కలిసినప్పుడు కలిగిన అభిప్రాయాలు, అంచనాల తారుమార్లు, నేర్చుకున్న గుణపాఠాలు, జాగరూకతలు, కూడా కలపండి.
కొన్ని తరహాలకు చెందిన సినిమా లు చూసినప్పుడు కలిగిన ఎమోషనల్ ఫీలింగ్స్ ని కూడా ఒక కాలం ఇవ్వండి. ‘నే మరచిపోలేని సినిమా..’ అంటూ.
అప్పుడేమైందంటే ..అంటూ ఇంట్రెస్టింగ్ అంశాలకు తావు కల్పించండి.
నాకు నచ్చిన రచన.. అంటూ చదివిన పుస్తకాలకు, నచ్చిన కథ గురించి ముచ్చట్లు చెప్పుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన కాలం వుంటే ‘రీడర్స్ బాతాఖానీ’ కింద ఉపయోగపడుతుంది. dhanyavaadaalu.
ఆద్యంతం అలరించింది కథనం. కథలో ఉన్న ఇతివృత్తం తెలుగుభాషాప్రేమికులకు సంతోషమూ, ఏమిటీ తెలుగు నస అనుకునే వారికి చిరాకునూ కలిగిస్తుంది.
ఈ రచయితగారు చెప్పిన కథ ప్రకారం చూస్తే “బ్లాగాంతే నరకం ధృవం” అని (ఒక పాతసామెతకు అధునాతనరూపపు) సామెత ఒకటి గ్రహించుకొనక తప్పదు.
రచయిత గారికి హృదయపూర్వకమైన అభినందనలు.
ఇలా అభినందనలు చెప్పటం ఎందుకైనా మంచిది. లేకుంటే రాబోయే కథలో తీసుకొని వెళ్ళి ఎందులోనికి విసిరేస్తారో ఇప్పుడే చెప్పలేం కదా!. అందుచేత మరొక్కసారి అభినందనలు జోడించి మరీ సెలవు.
Due to health, travel and technical reasons we were unable to submit the second part of the essay in time. We shall submit it for the next issue, appearing on 01.January. The delay is regretted.
వెంకటరమణగారి “శోభనాచల” బ్లాగు తరచుగానే చూస్తుంటాను కానీ వారు జూన్ నెలలో రాసిన ఈ పోస్టు ఎలానో miss అయ్యాను. ఈ రోజు చూడటం జరిగింది. వెంకటరమణగారు ఈ పద్యనాటిక గురించి మరింత సమాచారాన్ని, ముఖ్యంగా సాహిత్యాన్ని, సేకరించి యిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.
దేశికాచారిగారు, మీరు చెప్పినది సరియే. ఉత్పలమాలలోని ఈ ప్రత్యేకతను నేను గమనించియున్నాను. న-గణమునకు బదులు లగమును ఉంచితే అప్పుడు మొదటి ఎనిమిది అక్షరములు భ/ర/లగ అవుతుంది, చివరి ఎనిమిది అక్షరములు కూడ భ/ర/లగ అవుతుంది. ఈ రెంటిని మధ్య ఉండే భ-గణము వంతెనలా కలుపుతుంది. అప్పుడు అక్షరసామ్య యతిని, ప్రాసయతిని రెంటిని ఉంచి పద్యమును వ్రాయ వీలగును. భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును “నాగరక” అని పిలుస్తారు. భ/ర/లగ – భ – భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును నేను కల్వపూవు అని 21 ఫిబ్రవరి 2012 తారీకు కల్పించినాను. ఉత్పలమాలను మీరు చెప్పినట్లు ఇంచుమించు ఇలా విఱిచి వ్రాసిన ఉదాహరణము నొకదానిని శ్రీ పిల్లలమఱ్ఱి బృందావన రావుగారు మఱొక పిల్లమఱ్ఱివారి కావ్యమైన శృంగారశాకుంతలమునుండి ఉదాహరించినారు. ఆ పాదము “మ్రోయకుడీ శుకంబులు నె – లుంగులు – సేయకుడీ పికంబులున్”. భ/ర/య/స/స/జ/గ (భ/ర/లగ – భ – భ/ర/లగ)గణములతో ఉండే వృత్తమునకు బృందావని అని కూడ పేరుంచినాను. కల్వపూవు లేక బృందావని వృత్తమునకు, యతి, ప్రాసయతులతో ఒక ఉదాహరణము –
‘చంపకోత్పలమాలలకు కూడ మాత్రాగణముల ప్రకారము, ఇప్పటి యతికి తఱువాతి అక్షరమును యతిగ గ్రహించాలి అని నా అభిప్రాయము’
ఉత్పలమాలలో మొదటి భ ర న గణాలు చివరి భ ర వ గణాలు సమానమైన మాత్రలు కలిగి సర్వసమానముగా నుండి, మధ్యగల భగణానికి పక్షికి ఇరువైపులా ఉండే ఱెక్కలలాగా సౌష్ఠవసహితంగా ఉన్నవి. ఈవిధంగా ఉత్పలమాలాస్వరూపాన్ని గమనించినప్పుడు ఈరెండు పక్షాల మధ్యనున్న భగణాదియందు యతిని నిల్పుట సతార్కికముగా నున్నది. ఉత్పలమాలలోని మొదటి అక్షరాన్ని రెండు లఘువులుగా మార్చడంవల్ల ఈ రెండుపక్షాల మాత్రాదైర్ఘ్యము సమానముగానే యున్నది గాని యతిస్థానము 11వ అక్షరమైనది. యతిస్థాన నిర్దేశములో తర్కముగాక లక్షణమే ప్రమాణమైనను, ఉత్పలచంపకములలో సహజముగా నున్న సమానోభయపక్షములకు మధ్యగణారంభమున యతి నిల్పు లక్షణము సతార్కికముగాను ఉండుట ముదావహముగా నున్నది
మత్తేభవిక్రీడితము శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా మార్చగా లభించినది. శార్దూలవిక్రీడితము ఒక పెద్ద వృత్తమునకు ఒక చిన్న వృత్తము అతికించగా లభించిన ఫలితము అని ఊహ. అందువలన విరామయతిని పెద్ద వృత్తపు చివర ఉంచినారు. దానిని అలాగే తెలుగులో అనుసరించినారు, ఆ నియమములనే మ.వి.కి కూడ పాటించినారు. అసలు శా.వి.కి ఒకటికంటె ఎక్కువ యతి ఉండాలని నేను సూచించినాను. నేను వ్రాసిన శా.వి.పైన వ్యాసమును చదవండి. చంపకోత్పలమాలలకు కూడ మాత్రాగణముల ప్రకారము, ఇప్పటి యతికి తఱువాతి అక్షరమును యతిగ గ్రహించాలి అని నా అభిప్రాయము. యతిని ఒక లాక్షణికుడు నిర్ణయిస్తాడు, అందఱు దానిని అనుసరిస్తారు. అన్ని వేళలలో యతి స్థానము logical గా ఉండదు. ఉదాహరణకు, తోటక వృత్తములో నాలుగు స-గణములు ఉన్నాయి, అనగా నాలుగు చతుర్మాత్రలు. logical గా మొదటి అక్షరమునకు, ఏడవ అక్షరమునకు అక్షరసామ్య యతి ఉండాలి. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో గురువైన తొమ్మిదవ అక్షరము యతి! సామాన్యముగా తెలుగు లాక్షణికులు గురువుపైన యతిని ఉంచుతారు. – మోహన
నవంబర్ 2016 గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
11/01/2016 2:33 pm
“ఈ సంచిక నుండి సాధారణ కథావ్యాసాది లక్షణాలతో పొసగనివిగా అనిపించే రచనలకు చోటు కల్పిస్తూ స్వగతం అనే ఒక కొత్త కేటగిరీ మొదలు పెడుతున్నాం పూడూరి రాజిరెడ్డి రచనతో. ఈ కొత్త విభాగం ఈమాట రచయితలకు తమ ఆలోచనలు, ఊహలు, అభిప్రాయాలు, మ్యూజింగ్స్ వంటివి ప్రచురించుకునేందుకు ఒక కొత్త వెసులుబాటు నిస్తుంది. రచయితలు వినియోగపరచుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.”
* చాలా మంచి ప్రయత్నానికి నుడికారం చుట్టిన ఈమాటకి, సంపాదకులకి నా అభినందనలు.
అలానే, జీవితానుభవాలు, లేఖలు, కబుర్లు, ప్రయాణాల అనుభూతులు, కొత్త వారు కలిసినప్పుడు కలిగిన అభిప్రాయాలు, అంచనాల తారుమార్లు, నేర్చుకున్న గుణపాఠాలు, జాగరూకతలు, కూడా కలపండి.
కొన్ని తరహాలకు చెందిన సినిమా లు చూసినప్పుడు కలిగిన ఎమోషనల్ ఫీలింగ్స్ ని కూడా ఒక కాలం ఇవ్వండి. ‘నే మరచిపోలేని సినిమా..’ అంటూ.
అప్పుడేమైందంటే ..అంటూ ఇంట్రెస్టింగ్ అంశాలకు తావు కల్పించండి.
నాకు నచ్చిన రచన.. అంటూ చదివిన పుస్తకాలకు, నచ్చిన కథ గురించి ముచ్చట్లు చెప్పుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన కాలం వుంటే ‘రీడర్స్ బాతాఖానీ’ కింద ఉపయోగపడుతుంది. dhanyavaadaalu.
తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
11/01/2016 10:40 am
ఆద్యంతం అలరించింది కథనం. కథలో ఉన్న ఇతివృత్తం తెలుగుభాషాప్రేమికులకు సంతోషమూ, ఏమిటీ తెలుగు నస అనుకునే వారికి చిరాకునూ కలిగిస్తుంది.
ఈ రచయితగారు చెప్పిన కథ ప్రకారం చూస్తే “బ్లాగాంతే నరకం ధృవం” అని (ఒక పాతసామెతకు అధునాతనరూపపు) సామెత ఒకటి గ్రహించుకొనక తప్పదు.
రచయిత గారికి హృదయపూర్వకమైన అభినందనలు.
ఇలా అభినందనలు చెప్పటం ఎందుకైనా మంచిది. లేకుంటే రాబోయే కథలో తీసుకొని వెళ్ళి ఎందులోనికి విసిరేస్తారో ఇప్పుడే చెప్పలేం కదా!. అందుచేత మరొక్కసారి అభినందనలు జోడించి మరీ సెలవు.
వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం గురించి లావణ్యవతి అభిప్రాయం:
11/01/2016 3:18 am
ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన కథలంటే నాకు చాలా ఇష్టం .
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి గురించి Velcheru Narayanarao, Sreenivas Paruchuri అభిప్రాయం:
10/29/2016 6:39 pm
Due to health, travel and technical reasons we were unable to submit the second part of the essay in time. We shall submit it for the next issue, appearing on 01.January. The delay is regretted.
Regards,
V. Narayanarao
P. Sreenivas
దీక్షిత దుహిత గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
10/29/2016 6:32 pm
వెంకటరమణగారి “శోభనాచల” బ్లాగు తరచుగానే చూస్తుంటాను కానీ వారు జూన్ నెలలో రాసిన ఈ పోస్టు ఎలానో miss అయ్యాను. ఈ రోజు చూడటం జరిగింది. వెంకటరమణగారు ఈ పద్యనాటిక గురించి మరింత సమాచారాన్ని, ముఖ్యంగా సాహిత్యాన్ని, సేకరించి యిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి మోహన అభిప్రాయం:
10/27/2016 11:02 am
దేశికాచారిగారు, మీరు చెప్పినది సరియే. ఉత్పలమాలలోని ఈ ప్రత్యేకతను నేను గమనించియున్నాను. న-గణమునకు బదులు లగమును ఉంచితే అప్పుడు మొదటి ఎనిమిది అక్షరములు భ/ర/లగ అవుతుంది, చివరి ఎనిమిది అక్షరములు కూడ భ/ర/లగ అవుతుంది. ఈ రెంటిని మధ్య ఉండే భ-గణము వంతెనలా కలుపుతుంది. అప్పుడు అక్షరసామ్య యతిని, ప్రాసయతిని రెంటిని ఉంచి పద్యమును వ్రాయ వీలగును. భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును “నాగరక” అని పిలుస్తారు. భ/ర/లగ – భ – భ/ర/లగ గణములతో ఉండే వృత్తమును నేను కల్వపూవు అని 21 ఫిబ్రవరి 2012 తారీకు కల్పించినాను. ఉత్పలమాలను మీరు చెప్పినట్లు ఇంచుమించు ఇలా విఱిచి వ్రాసిన ఉదాహరణము నొకదానిని శ్రీ పిల్లలమఱ్ఱి బృందావన రావుగారు మఱొక పిల్లమఱ్ఱివారి కావ్యమైన శృంగారశాకుంతలమునుండి ఉదాహరించినారు. ఆ పాదము “మ్రోయకుడీ శుకంబులు నె – లుంగులు – సేయకుడీ పికంబులున్”. భ/ర/య/స/స/జ/గ (భ/ర/లగ – భ – భ/ర/లగ)గణములతో ఉండే వృత్తమునకు బృందావని అని కూడ పేరుంచినాను. కల్వపూవు లేక బృందావని వృత్తమునకు, యతి, ప్రాసయతులతో ఒక ఉదాహరణము –
మల్లెల మాల వేయనా – మాయక
నుల్లము సేద దీర్చనా
తెల్లగ ముగ్గు వేయనా – తేనెల
వల్లకి తంత్రి మీటనా
మెల్లగ నిన్ను దాకనా – మేఘము
త్రుళ్లగ కేకి నౌదునా
గిల్లుచు నేడిపించనా – కృష్ణుని
తల్లిగ లాలి బాడనా
పై ఉదాహరణములో అక్షరసామ్య యతితో ఉండే వంతెన పదమును తొలగిస్తే మనకు “నాగరక” వృత్తము లభిస్తుంది –
మల్లెల మాల వేయనా
ఉల్లము సేద దీర్చనా
తెల్లగ ముగ్గు వేయనా
వల్లకి తంత్రి మీటనా
మెల్లగ నిన్ను దాకనా
త్రుళ్లగ కేకి నౌదునా
గిల్లుచు నేడిపించనా
తల్లిగ లాలి బాడనా
కల్వపూవు లేక బృందావని ఉదాహరణము చిన్న మార్పులతో ఉత్పలమాలగా –
మల్లెల మాల వేసెదను – మాయక
నుల్లము సేద దీర్చెదన్
తెల్లగ ముగ్గు వేసెదను – తేనెల
వల్లకి తంత్రి మీటెదన్
మెల్లగ నిన్ను దాకెదను – మేఘము
త్రుళ్లగ కేకి నయ్యెదన్
గిల్లుచు నేడిపించెదను – కృష్ణుని
తల్లిగ లాలి బాడెదన్
విధేయుడు – మోహన
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి venu gop-al reddy అభిప్రాయం:
10/26/2016 8:07 am
చాలా చాలా బాగున్నాయి వీటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటె బాగుంటుంది ఆ సౌకర్యం కల్గించగలరని కోరుచున్నాము.
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి desikachary అభిప్రాయం:
10/25/2016 11:10 am
ఉత్పలమాలలో మొదటి భ ర న గణాలు చివరి భ ర వ గణాలు సమానమైన మాత్రలు కలిగి సర్వసమానముగా నుండి, మధ్యగల భగణానికి పక్షికి ఇరువైపులా ఉండే ఱెక్కలలాగా సౌష్ఠవసహితంగా ఉన్నవి. ఈవిధంగా ఉత్పలమాలాస్వరూపాన్ని గమనించినప్పుడు ఈరెండు పక్షాల మధ్యనున్న భగణాదియందు యతిని నిల్పుట సతార్కికముగా నున్నది. ఉత్పలమాలలోని మొదటి అక్షరాన్ని రెండు లఘువులుగా మార్చడంవల్ల ఈ రెండుపక్షాల మాత్రాదైర్ఘ్యము సమానముగానే యున్నది గాని యతిస్థానము 11వ అక్షరమైనది. యతిస్థాన నిర్దేశములో తర్కముగాక లక్షణమే ప్రమాణమైనను, ఉత్పలచంపకములలో సహజముగా నున్న సమానోభయపక్షములకు మధ్యగణారంభమున యతి నిల్పు లక్షణము సతార్కికముగాను ఉండుట ముదావహముగా నున్నది
English and Telugu Lexicons: Parallel Trajectories గురించి మోహన అభిప్రాయం:
10/24/2016 11:58 am
Good analysis, what is TAPU?
ఛందస్సులో గణితాంశములు – 2 గురించి మోహన అభిప్రాయం:
10/24/2016 11:46 am