పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. కొడుకుల శివరాం భాగవత గానం గురించి Mallaiah Anchoori అభిప్రాయం:

    11/02/2016 9:13 pm

    రాం రెడ్డి గారు:

    నేను 2006 లోనే టి టి డి వారు ప్రచురించిన తాత్పర్య సహిత మొత్తం పోతన భాగవతం 9500కు పైగావి ఇంటివద్దే పాడి డిజిటల్ గా రికార్ద్ చేశాను. ఇంకా భాగవత సంబంధిత అనేక ప్రాజక్టులు చేశాను. బహుశ మీకు ఆస్ట్రేలియాలోనె ఉంటున్న సారథి మోటుమర్రిగారు తెలిసే ఉంటారు. ఆయన వద్ద రెండు సిడి లు… “మందార మకరందాలు” మరియు “మలయమారుతాలు” అని ఉన్నావి. అడుగుతే కాపీ చేసుకోనిస్తారు. దయచేసి వినగలరు.

  2. తెగులుకి శిక్ష గురించి మోహన అభిప్రాయం:

    11/02/2016 3:26 pm

    బాగా నవ్వు తెప్పించింది “కథ”!
    క్రింది పంక్తులను కూడ చేర్చవచ్చును కథకు చివర –

    “యముడి నోట్లోంచి వచ్చే పద్యం విన్న చిత్రగుప్తుల వారు కైటభ మర్దనుణ్ణి తల్చుకుంటూ చేతులు జోడిస్తూంటే, ఘంఠికలు సుతిమెత్తగా మ్రోగించుకుంటూ మహిషం వడివడిగా ముందుకి సాగిపోయింది.”

    వెళ్లడానికి ముందు యముడు చిత్రగుప్తుడిని పిలిచి ఇలాగన్నాడు – పద్యాలు సరిగా వ్రాయలేక పోతున్న వాళ్లకు ఈ శిక్ష కూడ ఉచితమే. యాహూలో ఛందస్సు, రచ్చబండ అనే కూటములు ఉన్నాయి. అక్కడ ఎన్నో పద్యాలు చక్కని తెలుగులో ఉన్నాయి. వాటిని చదివి అలాగే వ్రాయడానికి అభ్యాసము చేయమని వీళ్లకు చెప్పు. ఇప్పుడు Facebook లో కూడ ఛందస్సు అనే కూటమి గలదు. అక్కడ సుప్రభ, రవిప్రసాద్, శంకరయ్య, మోహనరావు వంటి వాళ్లు ఈ బ్లాగర్లకు తరిఫీదు కూడ ఇయ్యగలరు. ఈ శిక్ష పనిచేసినదో లేదో అనే విషయమును ఒక ఏడాది పిదప పరిశీలించవచ్చును. ఇక నే వెళ్తాను. మరిచిపోకు చిత్రగుప్తా నేను చెప్పిన విషయము.

    విధేయుడు – మోహన

  3. తెగులుకి శిక్ష గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    11/02/2016 12:54 pm

    ఈ రచనతో ఈమాట స్థాయి తగ్గినదన్న అభిప్రాయంతో ఏకీభవించలేక పోతున్నందుకు నాగమురళి గారు దయచేసి మన్నించాలి. కాని ఆ ముక్క వారు అనటం వెనుక వారి ఉద్దేశం ఇంతకంటే హుందాగా ఉండే రచనలకే పీట వేసి ఈమాట మరింత హుందాగా ఉండాలని కావచ్చు. కాని ఈ‌రచనలో నేటి కాలపు వెకిలిహాస్యం యేమీ లేదు కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను.

    ఐతే సాహిత్యపు విలువలని సంతరించుకోలేక పోయాయని నేను అభిప్రాయపడిన రచనలూ వచ్చాయి ఈమాటలో. ఇలా అన్నందుకు ఈమాట వారు మన్నించాలి. ఇప్పుడు నిలదీసి అవి యేయే రచనలు అని అడిగితే నావద్ద ఒక పట్టిక యేదీ సిద్ధంగా లేదు. కాని సభాముఖంగా ఆముక్కను ఇంతవరకూ నేను చెప్పలేదు. కాని సందర్భం యేర్పడింది కాబట్టి చెప్పవలసి వస్తోంది.

    కాని ఈమాట వారు తమ పత్రికను ఒక చక్కని సాహిత్యప్రతికగా చాలా బాగా నిర్వహిస్తున్నారని చెప్పటానికి నాకైతే యేమీ సందేహంలేదు. అలనాటి భారతి సాహిత్యమాసపత్రిక తరువాత ఆ ఒరవడిలో సమర్ధంగా కృషిచేస్తున్నది ఈమాట పత్రిక అన్నదే ఒక సాహిత్యాభిమానిగా నా నిశ్చితాభిప్రాయం.

    సందర్భం అంటూ ఒకటి వచ్చింది కాబట్టి ఈ‌మాటను కూడా చెబుతాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి కూడా ఈమాట పత్రికవారి స్థాయికి తగిన రచనను నేను పంపలేకపోయాను! శర్మగారన్నట్లు నాగమురళి గారి నుండీ వారితోపాటు దదితర రచయితల నుండీ మంచి సూచనలు వస్తే వాటి పుణ్యమా నాబోటి వాడికీ ఒక అవకాశం రావచ్చు ఒక్క రచనను ఐనా ఈమాటలో చూచుకుందుకు.

    దంతుర్తి శర్మగారికి ఆరోజుల్లో నూటికి నలభైవస్తే అది ప్రశంశనీయమే. అప్పట్లో నన్నయ వచ్చి వ్రాసినా నలభైకి మించి మార్కులు రావటం‌ దుస్సాధ్యంగా ఉండేది. నాకు కూడా ఎప్పుడూ ఆస్థాయికి దాటి మార్కులు రాలేదు. ఈరోజుల్లో ఐతే కనీసం ఎనభైమార్కులు పైనే వస్తాయి తెలుగుపరీక్షలో ఒక్కసమాధానమూ అస్సలు సరిగా వ్రాయకపోయినా శరే. చిన్నయసూరి పేరు కూడా వినకుండానే తెలుగులో ఎం.ఎ పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావచ్చును. కాని అధునికమైన వ్యావహారికభాషలో తెలుగువారు రచనలు చేసేందుకు భాషాపాండిత్యం ఒకమోస్తరుగా ఉన్నా దానికిన్నీ కించిత్తు న్యూనంగా ఉన్నా సరిపోతుందని అభిప్రాయ పడుతున్నాను.

  4. తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/02/2016 10:48 am

    http://eemaata.com/em/about

    నాగమురళి గారు
    పైనిచ్చిన లింకులో ఈమాట గురించి రాసారు. అందులో “కాలానుగుణంగా” అన్న మాట బట్టి ఇది కూడా వేసుకుంటారనుకుని, నాకొచ్చిన అతి “లో లెవెల్” (అంటే పదో తరగతి తెలుగు మా-త్ర-మే అని ఒప్పుకోవడానికి ఏమీ సిగ్గు లేదు) వాడి అప్పుడప్పుడూ చదివే బ్లాగుల్లో విషయాలు చూసి, అచ్చులో పేరు చూసుకోవచ్చనుకుని ఇది రాసాను. మీకున్న సంస్కృత ఆంధ్ర పరిజ్ఞానం నాకు లేదు. నాకు తెలుగూ, ఇంగ్లీషు కూడా సరిగ్గా రావు. వేరే భాషల గురించి చెప్పనేల? దీనికి ప్రూఫ్ కావాలంటే వినండి. నాకు హైస్కూల్లో తెలుగుకి వచ్చిన మార్కులు నూటికి నలభై శాతం మాత్రమే. అలా అత్తెసరుగా గట్టెక్కాను.

    దీని మూలాన ఈమాట స్థాయి తగ్గిపోతుం/యిందని తెలియలేదు; క్షంతవ్యుడను. దయచేసి ఈమాట స్థాయి పెంచే రచన ఎలా ఉండాలో తెలియచేయగలరు. మీ సూచన చూసాక అటువంటివి రాయడానికి ప్రయత్నం చేస్తా. అది కుదరక పోతే మళ్ళీ ఏమీ రాయను లెండి. మీకు ఇక్కడ చెప్పడం ఇష్టం లేకపోతే ఎడిటర్ గారికి చెప్పండి – ఇలా స్థాయి తగ్గించే రాతలు వేసుకోవద్దని. ఆయన నిర్ణయం ప్రకారం నడుచుకోవడమే మనందరికీ మంచిది కదా? నమస్కారం.

  5. ఆకు గురించి లావణ్యవతి కఠారి అభిప్రాయం:

    11/02/2016 9:45 am

    అద్భుతమైన కవిత. గొప్ప తాత్వికత. పరిశుద్ధమైన అనువాదం !!!

  6. తెగులుకి శిక్ష గురించి Ayyavaru అభిప్రాయం:

    11/02/2016 9:34 am

    తెలుగు భాష అభివృద్ధి పేరుతో రకరకాల కొత్త పేర్లు సృష్టించి చంపుతున్న ఒక ప్రముఖ దినపత్రిక లో వార్తా సంకరాలు/సంకలనాలు గుర్తొచ్చాయి.

    తెలుగు భాష అభివృధ్ధి పేరుతో రకరkaaల కొత్త పేర్లు సృష్టించి చంపుతున్న ఒక ప్రముఖ తెలుగు పత్రిక లో వార్తా సంకలనాలు/సంకరాలు గుర్తొచ్చాయి.

  7. సత్య దర్శనం గురించి Lakshmi అభిప్రాయం:

    11/02/2016 1:55 am

    చాల అద్భుతముగ ఉంది

  8. తెగులుకి శిక్ష గురించి Markandeyulu అభిప్రాయం:

    11/01/2016 10:56 pm

    కాటుక కంటి నీరు చనుగట్టుపయిం బడ నేలయేడ్చెదో తో ముగించి కళ్ళు చెమర్పించేరు

  9. తెగులుకి శిక్ష గురించి nagamurali అభిప్రాయం:

    11/01/2016 10:51 pm

    ఈమాట స్థాయిని తగ్గించిన రచన.

  10. తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/01/2016 5:48 pm

    శ్రీభగవానువాచ:
    కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం
    అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర “శ్యామల”


    సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
    తతో “బ్లాగాయ లిఖ్యస్య” నైవం పాప మవాప్స్యసి .

    ధన్యవాదములు