పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. ఒక రాజకీయ ఉత్తరం గురించి దాసరి.రాజబాబు అభిప్రాయం:

    12/09/2016 2:42 am

    మైనారిటీలకే కాదు హక్కులగురించి మాట్లాడే వారందరికి…

  2. ఇంక పోతారనగాను గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/08/2016 11:38 pm

    రాఘవేంద్ర గారు, ఇతగాడు సరిపల్లి కులదీపకుడు. త్రిపుర మేషారు గారికి ప్రియ శిష్యుడు. ఊరు ఇసాపట్నవే అయినా ప్రస్తుతం కెనడా. త్రిపుర కధలు పుస్తకం లోనూ, త్రిపుర నివాళి పుస్తకం లోనూ ఖతర్నాక్ వ్యాసాలు రాశారు. కినిగె అంతర్జాల పత్రికలో కొన్ని అద్భుతవైన కధలు రాశారు. కళింగ మాండలీకంపై మంచి పట్టున్నవారు. వీలు చూసుకుని కనక ప్రసాద్ గారి ఇతర రచనలూ చదవగలరు.

  3. వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    12/07/2016 11:31 am

    వేణుగోపాలరెడ్డిగారు: Please send me a మైల్. My address is: sreeni AT gmx DOT de

    జగదీశ్వరరెడ్డిగారు: “చూడు మీ తెలి వెన్నెలా ” పాడినది రత్నం గారే!

    “తఃతః” గారు: ’పడవ నడపవోయ్’ శ్రీ ముసునూరి పాడినట్లుగా నాకు తెలియదు. కానీ ఆయన పాడి వుండవచ్చు. వింజమూరి తరచుగా ఆయనతో కలిసి పనిచేసారని విన్నాను.

    భవదీయుడు
    శ్రీనివాస్

  4. ఇంక పోతారనగాను గురించి Raghavendra అభిప్రాయం:

    12/06/2016 12:03 am

    ఎవరండీ ఈ కనక ప్రసాదూ? చాలా చదువుకున్నాయన అయ్యుంటారు. ఇదిచదివాక ఇంతకాలంగా వీరి రచనలు చదవలేదని వగపు. ఈమాట లో ఈయన రాతలన్నీఏకబిగిన చదివేశా. ఎంతబాగా రాశారండీ! ఇంకా, ఇంకా రాయండీ.

  5. గడి నుడి – 2 గురించి a reader అభిప్రాయం:

    12/04/2016 9:04 pm

    తెలుగు “గడి నుడి” ఆధారాలలో, ఆంగ్ల, హిందీ భాషల ఉపయోగం ఎందుకండీ?

  6. వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి venu gop-al reddy అభిప్రాయం:

    12/03/2016 3:09 am

    ఈ పాటలను డౌన్ లోడ్ చెసుకునె అవకాశం ఉంటె దయచెసి తెలుప గలరు !

  7. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    12/02/2016 11:40 pm

    మాన్యులు శ్రీ శేషతల్పశాయి గారికి
    నమస్కారములతో,

    మీ సహృదయతకు, ఔదార్యానికి కృతజ్ఞుణ్ణి!

    ధన్యతయా,
    ఏల్చూరి మురళీధరరావు

  8. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    12/02/2016 11:38 pm

    మాన్యులు శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    లేఖనవ్యతిక్రమం సవరణకు హృయదయపూర్వక ధన్యవాదాలు. ‘కలే శుక్రే’ అని రామాశ్రమి. ‘కలే రేతసి వ్రియతే ఉపయుజ్యతే’ అని అమరకోశ ముకుట వ్యాఖ్య. తెలుగు వాక్యంలో ‘ఉపయోజ్యము’ అన్నది సరైన రూపం. ఉపోపసర్గాత్మకమైన యుజ్యము కూడా సాధ్యమే కాని, నా ఉద్దేశం ఉపయోజ్యమనే. “కలేవరం, గాత్రం వపుః సంహననం శరీరం వర్ష్మ విగ్రహః, కాయో దేహః క్లీబపుంసోః స్త్రియాం మూర్తి స్తను స్తనూః” అని అమరకోశం. ప్రతిసంస్కృతములు (ఏకార్థవాచక పర్యాయపదములు) కాబట్టి కలేవర గాత్ర తను శరీరాదులన్నీ లోకమర్యాదానుసారం స్త్రీపురుషతిర్యక్కులకు పర్యాయత్వాన అనువర్తనీయములే కదా.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  9. తెగులుకి శిక్ష గురించి kuppa sudarsan kumar అభిప్రాయం:

    12/01/2016 1:17 am

    కథ సరాదాగా/ హాయీగా నవ్వుకునేలా ఉంది. చాలా బాగుంది. ఈమాట పత్రిక నిర్వహణ కూడా భేష్..

    కుప్పాసుదర్శన్ కుమార్

  10. గబ్బిలము గురించి Dr. Avadhanam Raghu Kumar అభిప్రాయం:

    11/30/2016 10:06 am

    చాల ఆనందించాను. ఇంత కాలం చదవనందుకు బాధ పద్దాను. చాల గొప్ప ఆవేదనతొ కూడిన కావ్యం.