పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. చంపకోత్పలమాలల కథ గురించి మోహన అభిప్రాయం:

    11/30/2016 9:04 am

    వ్యాసములో పేర్కొన్న హరవిజయములోని చంపకమాలవృత్తమును క్రింద ఇస్తున్నాను –

    ఇతి రసపోషయుక్తిమదనుజ్ఝితవృత్తి గుణవ్యపాశ్రయం
    ప్రథితశుభాంగలక్షణమపూర్వకృతిప్రవణాత్మతాం దధత్
    కవిరివ నాటకం ఘటితసంధి విధాయ శశాంకశేఖరః
    శిఖరిసుతార్ధమర్ధవపుషి ప్రమదాన్విత మానసోఽభవత్
    – రత్నాకరుని హరవిజయము, 21.57

    విధేయుడు – మోహన

  2. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి VSTSayee అభిప్రాయం:

    11/29/2016 2:26 am

    మాన్యతమ డా. యెర్నేని లైలా గారికి
    విద్వత్సహృదయాస్థాన రంగ మంగళాభరణం మీరు!

    Amen!

    మీరుకూడాను,మురళీధరరావుగారూ!

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  3. గడి-నుడి-2 సమాధానాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/28/2016 4:31 pm

    మరో విషయం: ఇది తెలుగు గడి నుడి కనక ఇంగ్లీషు, తెలుగీషు, హిందీ, అరవ, ఉర్దూ పదాలు, మరో భాషకి సంబంధించినవి వాడవద్దని మనవి – అవి అందరికీ తెలిసినా సరే.

  4. గడి-నుడి-2 సమాధానాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/28/2016 4:27 pm

    నా బ్రౌజర్లో అన్ని సమాధానాలు కనిపించడం లేదు. ఉదా: 1 నిలువు, 30 నిలువు

    ఈ సమాధానాల్లో మరో కష్టమైనది ఏమిటంటే ఇక్కడ 1, 2, 3, నెంబర్లు లేవు. 29 అడ్డం ఎక్కడో, 16 నిలువు ఎక్కడో చూసుకోవాలంటే అసలు గడినుడి వేరే విండోలో ఓపెన్ చేసుకోవాలి.

    సంపాదకులకి ఖాళీ ఉన్నప్పుడు సరిచేయగలరు.

    [కొన్ని అవసరమైన ఆధారాలకి మాత్రమే వివరణలు ఇచ్చాము. మిగిలినవి సమాధానాన్ని బట్టి సూటిగానే తెలుసుకోవచ్చని గడి కూర్పరుల అభిప్రాయం! నెంబర్ల సమస్యను పరిష్కరించాము. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం.]

  5. గడి నుడి – 2 గురించి Madhav అభిప్రాయం:

    11/28/2016 1:53 pm

    గడి నుడి సమాధానం, వివరణలు ప్రచురించాము. దయచేసి గమనించగలరు. ఈసారి ఇద్దరు పాఠకులు మాత్రమే అన్ని సరైన సమాధానాలు పంపగలిగారు:

    శ్రీవల్లి రాధిక
    సుభద్ర వేదుల

    రవిచంద్ర ఎనగంటి రెండు తప్పులతో సమాధానం పంపించారు. విజేతలకు అభినందనలు.

  6. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/28/2016 9:28 am

    మాన్యతమ డా. యెర్నేని లైలా గారికి
    ప్రణామములతో,

    ‘ఈమాట’లో ఏ సందర్భంలో ఎప్పుడు మీ దీప్తపదావళి ప్రకటితమైనా – కోటిపల్లి నుంచి ద్రాక్షారామానికి గోదావరి తరగలతోపాటు పూలపడవ మీద తేలిపోతున్నట్లు, శృంగేరిలో కిగ్గ ఒడ్డున ఋష్యశృంగేశ్వరాలయంలో దేవకాంతలు ఆందోళికాబంధాన్ని పూని ఆకసాని కెగసిపోతున్న శిల్పాన్ని తిలకిస్తున్నట్లు, బదరీనారాయణక్షేత్రంలో కొండకొమ్ము మీదినుంచి సానుతలాన ఫలించిన రుద్రాక్ష వృక్షాలను వీక్షిస్తున్నట్లు, త్రివేణీసంగమం వద్ద పుణ్యనదిలో మునుకవేసి ఆ పురాణస్రవంతీపరిచయంతో పరవశించినట్లు, అపూర్వమైన ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యసంగీతశిల్పచిత్రకళానిధి ముందు నిలబడి విజ్ఞానావేశాన్ని స్వాయత్తీకరించికొంటున్నట్లు – సరస్వతీ సన్నిధి రూపమైన పెన్నిధి ప్రస్ఫుటించి, మనస్సంతా ఆనందతుందిల మవుతుంది. నేను, నా అర్ధాంగలక్ష్మి ఆ సారనవనీతాన్ని ప్రోదిచేసికొని పది కాలాలకు పదిలంగా దాచుకొంటాము.

    విద్వత్సహృదయాస్థాన రంగ మంగళాభరణం మీరు!

    సగౌరవంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి తః తః అభిప్రాయం:

    11/28/2016 8:36 am

    “రేతఃప్రసారణకు ఉపయుజ్యమైనది కాబట్టి కలే=రేతసి, వ్రియతే=ఉపయుజ్యతే అని; కలే శ్రేష్ఠం ఇతి వా అని – కలేవర శబ్దవ్యుత్పత్తి. శరీరము అని అర్థం.”

    శ్రీ మురళీధర రావు గారూ! ‘రేతము’ అంటే ‘శుక్రము’ అని అర్థాన్ని నాకు నేను చెప్పుకుని,’ఉపయుజ్య’ శబ్దార్థంతొ గడబిడ పడలేక మిమ్మల్నే అడిగి సందేహం తీర్చుకుందామని అడుగుతున్నాను “శరీరము అని అర్థం” అన్నారు మీరు. స్త్రీ పురుష శరీరాలకు రెంటికీ వర్తిస్తుందా!

    నమస్కారాలతో -తః తః

    తా.క. ‘నాద తను’కు ‘నాద శరీరం’ పర్యాయంగా ఉపయోగించటం సరికాదని (అనౌచిత్యమని) M.V.Lతో (ముత్యాల ముగ్గు నిర్మాత) వాదించిన గుర్తు.

  8. రాగలహరి: కల్యాణి గురించి NAGANARAYANA అభిప్రాయం:

    11/28/2016 12:50 am

    యమన్ రాగములో తీవ్ర మధ్యమం (ప్రతి మధ్యమం) స్వభావం రుద్రం అని అయినప్పటికి రాగ స్వభావం కళ్యాణ కారకం అని చెపుతారు. వాది స్వరం గాంధారం సంవాది స్వరం నిషాధం కావడం కూడ ఒక కారణం కావచ్చు. కిషొరీ అమొంకర్ గారి యమన్ వినండి.

  9. రాగలహరి: కల్యాణి గురించి NAGANARAYANA అభిప్రాయం:

    11/27/2016 11:46 pm

    చాల బాగుంది. హిందుస్తాని సంగీతంలో రాగాలన్ని వాది సంవాది స్వరాల సమయము మీద ఆధారపడి ఉంటాయి. మోహన రాగంలొ హిందుస్తాని సాంప్రదాయం ప్రకారం వాది గ మరి సంవాది నిషాదము. గాంధార స్వరం రాత్రి మొదటి ఝాములో అద్బుతంగా ఉంటుందని పండితుల అభిప్రాయం. పండితులు ఒకొక్కరు ఒకొక్క రాగాన్ని ఆరాధిస్తుంటారు. త్యాగరాజ స్వామి చెప్పినట్లు సప్తస్వరాలను ఆరాధించినవారు ఏ రాగన్నైనా అలవొకగ పాడతారు లేదా ఆ ఆనందాన్ని అనుభవిస్తారు.

  10. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి lyla yerneni అభిప్రాయం:

    11/27/2016 7:18 pm

    “Dr Yerneni: I am not exactly your fan…”

    But, I am your fan. తహ్! You had me at hello!

    If not my fan, Will you rather be Lady Windermere’s fan? Oh! I must tell you this, a recent movie I saw on gays – thanks to Netflix is – “Those people”. It is poignant. That movie haunts me in a sweet way, and as I write here, I think I will watch it again today.

    It may appear strange, but I have deep longings not so much for real people/artists, but for some people’s art. Because I have craving for Gustave Klimt’s paintings, recently I visited The Neue gallery and I was so happy to see the painting of Adele Bloch-Bauer, and many other beautiful pieces. (You know -the only existing Telugu poem on the enormously famous painting, “The Kiss” could be mine. And it is in this magazine.)

    These days I get more invitations from art galleries, hotels and less from family. I think there is a family gathering for Thanksgiving somewhere, and I have a feeling I was artily excluded. Perhaps they feared there could be some post -election gloating from me, – after my proclaiming on election night, Trump as- the Howard Roark of New York, (a builder/architect, an individual against press, individual against collectivism) and asked them to listen to the courtroom speech of Roark as delivered by the tall upstanding Gary Cooper in the movie “The Fountainhead.”

    These are very interesting times, and this hobnobbing at eemaata are as priceless as evenings in the lounges of hotels Carlyle in NY, or Naples Grande in FL. The Press show their press card, and I show my ‘Fan’ card, to get inside the comment boxes in this magazine.

    I am following the discussion.
    Thanks Much.
    Lyla