పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి బి. పవన్ కుమార్ అభిప్రాయం:

    12/30/2016 2:54 am

    ఔరంగజేబు గురించిన మనకు తెలిసినది పరమత సహనం లేనివాడని, హిందూ, సిక్కు చక్రవర్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడని ఆలయాల విద్వంసాలకు పాల్పడేవాడని. కాని ఈ లేఖలో అతని గురించి కన్నా అతను చెప్పిన విషయాలు చాలా వరకు మనకు ఉపయోగపడేవి, నిరుపయోగమైన విద్యను నేర్చుకొనుటకు కాలాన్ని, సమయాన్ని వెచ్చించనక్కర్లేదని మనకు తెలుస్తుంది.

  2. తెగులుకి శిక్ష గురించి Phaneendra అభిప్రాయం:

    12/30/2016 2:50 am

    శర్మ గారికి ముందుగా అభినందనలు.

    బ్లాగుల మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని (నిజంగా జరుగుతున్న దాన్ని) కధా వస్తువుగా మలిచి ఇంత చక్కని కధ వ్రాసినందుకు ఈ అభినందన. మీ కధ చదివిన తరువాత, కన్నీరు తుడుచుకొవాల్సి వచ్హింది. అది మీ కధలో వున్న హాస్యం మరియూ తెలుగు భాష వున్న పరిస్థితి తలచుకొని.

    మరొక్కమారు అభినందనలు.

    భవదీయుడు
    ఫణీంద్ర

  3. భూషణీయం గురించి S NARASIMHA swamy అభిప్రాయం:

    12/19/2016 10:13 am

    In every word ESmail smiles

  4. నేనూ నా రచనలు గురించి Ravi Thadicherla అభిప్రాయం:

    12/17/2016 8:12 pm

    కథలతో ప్రారంభమైన రచనా ప్రస్థానం నవలా ప్రక్రియలో స్థిరపడి లోకోత్తర ఖ్యాతిని గడించినారు కదా. ఒక నవల రాయడానికి ఎంతో మేధోమథనం అవసరమవుతుంది అని నా భావన.

    సంశయమేమిటనగా… ఒక నవలా రచనకు పూనుకొన సమయంలోనే ఒక పూర్తి అవగాహనతో అనగా మనసులో పూర్తి నవలా చిత్రాన్ని పూర్తి చేశాకే రాయటం ప్రారంభిస్తారా? లేదా రచనా సాగుతుండగా వస్తున్న ఆలోచనలతో మార్పులు కొనసాగిస్తూ ముందుకువెళ్తారా?

    నవలా సాహిత్యంలో అపార అనుభవ గౌరవ ప్రపత్తులు సొంతచేసుకున్న నవీన్ గారికి కళాభివందనాలు

  5. ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    12/17/2016 6:01 pm

    ఛందోలక్షణములను తెలిపి వివిధ కవ్వీశ్వరుల మత్తేభవిక్రీడితముల నతి మధురముగా వివరించిన శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి అభివందనములు.

  6. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Hemalatha అభిప్రాయం:

    12/17/2016 11:13 am

    Maku e padhyam padava tharagathilo padyabhaagam loni pravaruni swagatham ane paatam lo mottamodhati padhyam.naaku e padhyamante chaala istam.appudu nerchukunna padhyam ippatiki inka prathi aksharam gurthundipoyela cheppina ma telugu mastaru prabhakar gaariki na namassumanjali..e padhyam tho nakunna aanati madhuranubhuthulani gurthochela teluguvariki anuvuga vishadaparichinanduku dhanyavaadamulu.

  7. తెలుగు కథల పోటీ గురించి సిరి .లాబాల అభిప్రాయం:

    12/17/2016 2:47 am

    కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.

    సిరి. లాబాల

  8. ఎవరు చూడొచ్చేరు? గురించి lyla yerneni అభిప్రాయం:

    12/16/2016 2:09 pm

    They are all very nice.

    Christina had placed the wind in power position.

    Dadala makes the wind sneaky. 

    Kanaka Prasad rather wants a mystic wind.

    Here is a verse of mine, where in, it is not about wind at all.

    ‘పరుగు నొచ్చి గాలి పలకరించినపుడు
    జడులు తరులు కూడ జగతి నాడు!
    పరమశివుడె వచ్చి పడతిరో! రమ్మన్న
    నాట్యమాడ ననగ నాకు గాదు.’

    Lyla

  9. ఎవరు చూడొచ్చేరు? గురించి Venkat అభిప్రాయం:

    12/16/2016 3:11 am

    ఈ కవితను కనకప్రసాద్ గారు, దార్ల వేంకటేశ్వరరావు గారు ఉదహరించిన కవిత చదవకుండానే రాస్తే గనుక చాలా గొప్ప కవిత.

  10. ఖండిత, కలహాంతరిత గురించి ennela అభిప్రాయం:

    12/13/2016 11:20 pm

    చాలా చాలా బాగుంది అండీ. మీరు, రత్న గారు ఇద్దరూ మా వారవడం మా అదృష్టం కదా అని మురుపు తో ఆనందం అంబరాన్నంటింది.
    లక్ష్మి రాయవరపు