పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. Breakrooమోపాఖ్యానము గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    09/18/2017 5:55 pm

    భలే రాశారు. సులభ గ్రాంధికం బాగా పండించారు.

  2. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి K V SESHA KUMAR అభిప్రాయం:

    09/18/2017 6:42 am

    నమస్తే శ్రీసురేశ్ కొలిచాల గారికి,

    తరువాతి భాగాల కోసం ఎదురు చూస్తున్నాను . ఇంతమంది పాఠకుల/పండితుల సందేహాలు/అభిప్రాయాలు ఎలా సమన్వయం చేసి వ్రాస్తారోనని ఆసక్తి గా ఉంది.

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి C. Chandrasekhar అభిప్రాయం:

    09/14/2017 6:22 pm

    ఈ శ్లోకానికి సరియైన సాంకేతికార్థము విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సురభి లోని వ్యాఖ్యానము చూడండి. విష్ణు పదానికి విశ్వవ్యాపకుడన్న అర్థమే చెప్పుకోవాలి.

    గణపతి ఆరాధన తంత్ర శాస్త్రానికి సంబంధించినది. కుండలినీ శక్తి మూలాధారమునుండి ఊర్ధ్వగతిలో పయనించడానికి మొదట నున్న ఆటంకమునే గణపతిగా భావించి స్తుతించినారు. పార్వతి స్నానము చేయబోతూ గణపతిని ద్వారపాలకునిగా నియమించినదన్న కథ కూడా ఈ తత్త్వానికి సంకేతమే. (సరియైన వివరములు యోగా వ్యాసకులు, దేవీ ఉపాసకులు మాత్రమే చెప్పగలరు.)

    శ్రీశంకరుల కాలానికే – అనగా 7వ శతాబ్దానికి పూర్వమే – గాణాపత్యము తాంత్రిక సాధనలలో సనప్రసిధ్ధమైనది. షణ్మత స్థాపకులుగా శంకరులు సంస్కరించిన ఆరు మతాలలో గాణాపత్యము కూడా ఉన్నది.

    వేదాలలో సంగ్రహంగా చెప్పబడిన ఉపాసనలనుండే పురాణకాలంలో దేవతలకు మూర్తి కల్పన జరిగింది. అందులోనూ గణపతి, స్కందుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి వంటి కొందరు కేవల మంత్ర స్వరూపులుగా ఉపాసింపవలసినవారు.

    కథారూపంలో వ్రాసిన పై వ్యాసంలో సరియైన పరిశోధన చేసినట్లు కనిపించదు. It is not proper to deal with serious topics in a casual manner, without seeking guidance from the learned scholars in relevant field.

  4. Breakrooమోపాఖ్యానము గురించి ns murty అభిప్రాయం:

    09/13/2017 11:51 pm

    ఇంద్రాణి గారూ

    వ్యంగ్యం, హాస్యం, ఆంగ్ల- తెలుగు పదాల సముచ్చయమూ , అన్నీ చాలా బాగున్నాయి.

    అభినందనలు.

  5. Breakrooమోపాఖ్యానము గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    09/13/2017 11:35 am

    కవయిత్రిగానే మచ్ తెలిసిన ఈమె ఉపాఖ్యానము జదివి అమేజ్మెంట్‌నకు గురికాలేదని జెప్పిన నా శిరస్సు వేయి వ్రక్కలవగలదని తెలిసి తెలిసి ఆపాయమును దప్పించుకొనుటకు ఇచ్చోట కామెంటుతున్నానని సభాముఖమున విన్నవించుకుంటున్నవాడను.

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2 గురించి భట్టారం రవీంద్ర బాబు అభిప్రాయం:

    09/12/2017 12:27 pm

    ఈ శీర్షికలో ఎంత గొప్ప సాంకేతిక సహాయకాలని వాడకానికి మాకిచ్చారు!

  7. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2 గురించి భట్టారం రవీంద్ర బాబు అభిప్రాయం:

    09/12/2017 12:20 pm

    శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక 2 లో నిలువు 27 యొక్క ఆధారంలో అక్షర దోషం ఉంది. “ముందుగా” అని ఉండవలసినది అనుకుంటాను. “మౌండుగా” అని ఉంది. సవరించ గలరు.

    ధన్యుడను.

    [అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  8. బ్రేక‌ప్ గురించి suryanarayana murthy Akella అభిప్రాయం:

    09/12/2017 9:10 am

    చెత్త కథ, ఎడిటింగ్ లో ఎలా ఫిల్టర్ అయ్యిందో?

  9. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి ఆంజనేయులు మాష్ఠర్ అభిప్రాయం:

    09/12/2017 6:42 am

    నేను కాటిసీనులో పాడుతున్నపుడు నాకు కన్నీళ్ళు వస్తుoటాయి.

  10. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి K V SESHA KUMAR అభిప్రాయం:

    09/11/2017 7:28 am

    నమస్కారం కామేశ్వరరావుగారూ,

    కవయిత్రి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ వ్రాశారు.ధన్యవాదాలు.

    దాదాపుగా కావ్య సమీక్ష చేస్తూ పూర్తిగా ఆ కావ్యాన్ని చదవడానికి ఆసక్తిని ఉద్దీపనంచేశారు.

    శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహాభక్తురాలైన మాతృశ్రీ వెంగమాంబ, మీరు ఉదహరించిన ఘట్టాలలో స్వామి వారిని నిందాస్తుతి చేసినట్లు అనిపిస్తుంది.అంతే గానీ స్త్రీ పక్షపాత ధోరణి కాదనుకుంటాను.